Vishwak Sen: సైడ్ క్యారెక్టర్‌లో విశ్వక్ సేన్.. విశ్వామిత్రగా పవర్‌ఫుల్ ఎంట్రీ!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తనదైన మార్క్ యాక్టింగ్‌తో వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ప్రేక్షకులను....

Vishwak Sen: సైడ్ క్యారెక్టర్‌లో విశ్వక్ సేన్.. విశ్వామిత్రగా పవర్‌ఫుల్ ఎంట్రీ!

Vishwak Sen As Vishwamithra In Mukhachitram Movie

Updated On : March 29, 2022 / 11:22 AM IST

Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తనదైన మార్క్ యాక్టింగ్‌తో వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే పలు సినిమాలు చేతిలో ఉన్న ఈ యంగ్ హీరో, వరుసగా తన సినిమాలు తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేసేందుకు రెడీ అయిన ఈ హీరో, నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ స్పెషల్ పాత్రలో నటిస్తున్న ‘ముఖచిత్రం’ మూవీ నుండి ఓ సర్ ప్రైజ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

Vishwak Sen : సుమక్కకి పోటీగా యువ హీరో

‘కలర్ ఫోటో’ చిత్రంతో అదిరిపోయే గుర్తింపు అందుకున్న యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్, మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు అందిస్తున్న ‘ముఖచిత్రం’ సినిమాలో విశ్వక్ సేన్ విశ్వామిత్ర అనే పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో మనల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఈ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది.

Vishwak Sen : టాలీవుడ్‌కి ‘ధమ్కీ’ ఇవ్వబోతున్న యువ హీరో

ఈ చిత్రంలో విశ్వక్ సేన్ పాత్ర సినిమాకే కీలకంగా ఉంటుందని వారు అంటున్నారు. ఇక లాయర్ పాత్రలో ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని వారు తెలిపారు. ఏదేమైనా వైవిధ్యమైనా పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న విశ్వక్ సేన్‌కు పలువురు సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. సందీప్ రాజ్ నుండి వస్తున్న ముఖచిత్రం చిత్రాన్ని గంగాధర్ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్‌ను ఇవాళ సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.