Vishwak Sen : టాలీవుడ్‌కి ‘ధమ్కీ’ ఇవ్వబోతున్న యువ హీరో

తాజాగా విశ్వక్ సేన్ మరో సినిమాని అన్నౌన్స్ చేసాడు. ఇవాళే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ‘దాస్ కా ధమ్కీ’ అనే మాస్ టైటిల్ తో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు..

Vishwak Sen : టాలీవుడ్‌కి ‘ధమ్కీ’ ఇవ్వబోతున్న యువ హీరో

Dhumki

Updated On : March 9, 2022 / 12:19 PM IST

Vishwak Sen :  టాలీవుడ్‌ యువ హీరోలలో విశ్వక్‌ సేన్‌ ఒకరు. ఒక్కో సినిమాకి వైవిధ్యం చూపిస్తూ అటు మాస్, ఇటు క్లాస్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విశ్వక్. ఇతని చేతిలో కూడా దాపు అరడజను పైగా సినిమాలు ఉన్నాయి. ఇటీవలే ‘పాగల్’ సినిమాతో ప్రేక్షకులని పలకరించగా ఆ చిత్రం ఆశించినంత విజయం సాధించలేదు. త్వరలో విశ్వక్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా విడుదల అవ్వనుంది.

తాజాగా విశ్వక్ సేన్ మరో సినిమాని అన్నౌన్స్ చేసాడు. ఇవాళే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ‘దాస్ కా ధమ్కీ’ అనే మాస్ టైటిల్ తో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని కొత్త దర్శకుడు నరేష్ కుప్పిలి తెరకెక్కిస్తుండగా వణ్మయి క్రియేషన్స్ మరియు విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ పై సినిమాని నిర్మిస్తున్నారు.

Acharya Vinod Kumar : ప్రభాస్ పెళ్లిపై ప్రముఖ జ్యోతిష్కుడు జ్యోస్యం.. ప్రభాస్ పెళ్లి జరిగేది అప్పుడే..

ఈ సినిమా పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా వచ్చి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, అనిల్ రావిపూడి కెమెరా ఆన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)