FASTag: మిస్డ్ కాల్‌తో ఫాస్టాగ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా
ఫాస్టాగ్ అకౌంట్‌లో బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ, అన్నింటికంటే ఈజీ ఆప్షన్ ‘మిస్డ్ కాల్’. టోల్ ఫ్రీ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సింపుల్‌గా ఫాస్టాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.

Fastag
FASTag: ఫాస్టాగ్ అకౌంట్‌లో బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ, అన్నింటికంటే ఈజీ ఆప్షన్ ‘మిస్డ్ కాల్’. టోల్ ఫ్రీ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సింపుల్‌గా ఫాస్టాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అయితే, ఈ సదుపాయాన్ని వాడుకోవాలంటే వినియోగదారుడు ప్రీ పెయిడ్ యూజర్ అయ్యుండాలి. పోస్ట్ పెయిడ్ యూజర్లకు ఈ అవకాశం లేదు. ఫాస్టాగ్ అకౌంటుతో రిజిష్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి +91 8884333331 నెంబర్‌కు కాల్ చేయాలి. కాల్ రింగ్ అయిన తర్వాత ఆటోమేటిగ్గా కట్ అవుతుంది. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే మీ రిజిష్టర్డ్ నెంబర్‌కు బ్యాలెన్స్‌కు సంబంధించిన నోటిఫికేషన్, మెసేజ్ రూపంలో వస్తుంది.
Monkeypox : మంకీపాక్స్ పై అలర్టైన తెలంగాణ-21 రోజులు ఐసోలేషన్
ఇది కాకుండా మరో పద్ధతిలో ఫాస్టాగ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటే ‘మై ఫాస్టాగ్’ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, రిజిష్టర్ చేసుకోవాలి. దీంతో ఎప్పుడైనా, ఎక్కడైనా స్మార్ట్‌ఫోన్‌లోనే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. టోల్‌ప్లాజాల దగ్గర రద్దీ తగ్గించేందుకు కేంద్రం ఫాస్టాగ్ ప్రవేశపెట్టింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) టెక్నాలజీ ద్వారా ఫాస్టాగ్ పనిచేస్తుంది. దీని ద్వారా క్షణాల్లోనే ఆటోమేటిగ్గా అకౌంటు నుంచి టోల్ ఫీ చెల్లించవచ్చు.