Yemen boy Heartbreaking Photo viral : గుండెలు ద్రవించే ఆకలి కేకలు..

Yemen boy Heartbreaking Photo viral : గుండెలు ద్రవించే ఆకలి కేకలు..

Updated On : January 7, 2021 / 3:19 PM IST

Yemen boy Heartbreaking Photos : యెమెన్ ఎంతంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో తెలియజేయడానికి తాజాగా సామాజిక మాధ్యమాల్లో ద్వారా వైరల్ అవుతున్న ఓ చిత్రం ద్వారా నిరూపితమైంది. తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న ఏడేళ్ల ఫెయిద్ సమీమ్ పశ్చిమాసియాలోని అరబ్ దేశాలలో ఒకటైన యెమెన్ ఎంతంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో తెలియజేయడానికి ఈ పసివాడి ఫోటో ఒక్కటి చాలు.

ఆకలితో అలమటించిపోతూ..చిక్కి శల్యమైపోయి ఏడేళ్లపిల్లాడు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పిల్లాడి ఫోటోలు చూసినవారంతా ఇంత కంటే ఘోరం మరొకటి ఉంటుందా? పసిపిల్లాడి ఆకలి తీర్చలేని ఇంత దౌర్భాగ్యమా? అని వాపోతున్నారు. కన్నీరు కారుస్తున్నారు.గుండెలు ద్రవించిపోయే ఆ బాలుడి ఫోటోలు చూస్తుంటే యోమెన్ ఎంతటి సంక్షోభంలో ఉందో ఊహించుకోవచ్చు..

తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న ఏడేళ్ల ఫెయిద్ సమీమ్ యెమెన్ రాజధాని సనాలోని ఒక ఆసుపత్రి మంచం మీద అత్యంత దీనస్థితిలో పడి ఉన్నాడు. ఈ చిత్రం ప్రపంచాన్ని కలిచివేస్తోంది. పోషకలోపంతో బక్కచిక్కిపోయి,శరీంలో రక్తం లేక పాలిపోయిన ఆ బాలుడు అనుభవిస్తున్న నరకాన్ని ఆ ఫోటో కళ్లకు కడుతోంది.ఇలా యెమెన్ లోని సంక్షోభానికి సంబంధించి ఎన్నో ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారి అక్కడ దుర్భర పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి.

ప్రస్తుతం అతని బరువు కేవలం 7 కిలోలు (15 పౌండ్లు ) మాత్రమే. మెమెన్‌లోని సనాకు చెందిన అతని కుటుంబం అత్యంత దీనదుస్థితిలో ఉంది. తినడానికి తిండి లేక పస్తుతులు ఉంటూ దుర్భర జీవితాన్ని గడుపుతోంది. ఆ బాలుడి దీనస్థితి తెలుసుకన్నవారు ఇచ్చిన విరాళాలతో ఆ కుటుంబం బతుకుతోందంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా?

ఈ ఒక్క సంఘటనే కాదు చాలా మంది యెమెన్ లో ఇటువంటి చిన్నారులు ఇటువంటి దుర్భర జీవాతంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. యొమన్ వ్యాప్తంగా పోషకాహార లోపం కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో అంతర్జాతీయ సేవల సంస్థలవైపు దీనంగా చూస్తున్నారు పేద తల్లిదండ్రులు. సహాయం చేతులపై దీనంగా చూస్తున్నారని స్థానిక డాక్టర్ మహ్మద్ తెలిపారు.

ఇటువంటి దుర్భర పరిస్థితులు ప్రపంచంలోని అతిపెద్ద మానవతా సంక్షోభంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం యెమెన్‌లో 80% జనాభా అంతర్గాత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ దుస్థితి ఉలా ఉంటే పులిమీద పుట్రలా వచ్చి పడండి కరోనా మహమ్మారి. మరింత దారిద్ర్యంలోకి నెట్టేసింది. చిన్న చిన్న దేశాలు అతలాకుతలం అయిపోతున్నాయి. ఓ వైపు కరవు..మరోవైపు కరోనా పట్టి పీడిస్తున్నాయి ప్రపంచంలోని పలు పేద దేశాల్ని.

2020 ప్రపంచాన్ని చెప్పుకోనంత దారుణ సంక్షోభంలోకి నెట్టేసింది. దీన్నించి బైటపడటానికి చాలా సమచమే పడుతుంది. కరోనావైరస్ ఆంక్షలు, పడిపోయిన ఆర్థిక ఉత్పత్తులతో కుదేలైపోయింది. పెద్ద పెద్ద సంస్థలకు కూడా ఆదాయం తగ్గిపోయింది. మరోవైపు పంటలపై విరుచుకుపడిన మిడుతలు దండులు పంటల్ని హుష్ కాకి చేసేశాయి. ఇలా 2020లో వచ్చిన ఉపద్రవాలన్నీ ఆకలి కేకల్ని పెంచుతున్నాయి. మరోపక్క ప్రకృతి వైపురీత్యాల్లో భాగంగా వరదలు ముంచెత్తాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.


ఎన్నో ఏళ్లగా తీవ్ర అవస్థలు పడుతున్న తమను ప్రపంచం ఇప్పటికీ పట్టించుకోకపోవడం లేదని తాము ఒంటరై పోయినట్టు యెమెన్లు భావిస్తున్నారు. ఓ పక్క ఆకలి..మరోపక్క కరవుతో యొమన్ ప్రజలు ఒంటివారైపోయినట్లుగా ఫీలవుతున్నారు. ఏళ్లకు ఏళ్లుగా తీవ్ర అవస్థలు పడుతున్న తమను ప్రపంచం ఇప్పటికీ కనికరించలేదని మానసిక వేదనకూడా వారిని పట్టిపీడిస్తోందని మానసిక నిపుణులు అంటున్నారు.ఇంత దారుణ పరిస్థితులు ఉన్నాగానీ..యొమెన్లోని కరవును అధికారికంగా ప్రకటించలేదు. యెమెన్ లో రాబోయే కరువు గురించి యూఎన్ హెచ్చరించింది.