Ramdev Apologises for Womens : మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు .. క్షమాపణ చెప్పిన రాందేవ్ బాబా
మహిళలు బట్టలు లేకపోయినా బాగుంటారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురువు రాందేవ్ బాబాపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన మహిళలకు క్షమాపణ చెప్పారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని..తన వ్యాఖ్యలు మహిళలకు బాధించి ఉంటే క్షమించాలని కోరారు.

Yoga Guru Ramdev Apologises for 'Womens
Ramdev Apologises for Womens : మహిళలు బట్టలు లేకపోయినా బాగుంటారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురువు రాందేవ్ బాబాపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన మహిళలకు క్షమాపణ చెప్పారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని..తన వ్యాఖ్యలు మహిళలకు బాధించి ఉంటే క్షమించాలని కోరారు.
దుస్తులు ధరించకపోయినా మహిళలు అందంగానే ఉంటారంటూ గతవారం రాందేవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రాందేవ్ బాబా చేసిన ఈ వ్యాఖ్యలపై మహిళా లోకం తీవ్రంగా మండిపడింది. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేవఆరు. మహిళా సంఘాలతో పాటు మహారాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన రాందేవ్ బాబా.. తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలియజేసినట్లు మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైరపర్సన్ రూపాలీ చకాంకర్ ట్విటర్‌లో వెల్లడించారు. రాందేవ్ క్షమాపణ లేఖను కూడా పోస్ట్ చేశారు.
మహిళలకు క్షమాపణ చెప్పిన రాందేవ్ బాబా మహిళలు ఈ సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలనే ఉద్దేశంతో వారి సాధికారత కోసమే నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమాలను నేను ప్రోత్సహిస్తాను. మహిళలను అగౌరవపర్చాలన్న ఉద్దేశం నాకు లేదు. సోషల్‌మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో క్లిప్ పూర్తిగా వాస్తవం కాదు. అయినప్పటికీ.. ఎవరైనా బాధపడినట్లయితే నేను తీవ్రంగా చింతిస్తున్నా. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన వారికి బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నా’’ అని రాందేవ్ బాబా ఆ నోటీసులకు సమాధానమిచ్చారు.
వివాదానికి కారణమైన వ్యాఖ్యలు
కాగా గత వారం మహారాష్ట్రలోని ఠానే నగరంలో పతంజలి యోగా పీఠ్, ముంబయి మహిళా పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించగా..యోగా శిక్షణ కార్యక్రమం ముగిసిన తరువాత అక్కడే ఓ సమావేశం జరిగింది. దీంతో యోగా దుస్తుల్లో వచ్చిన మహిళలకు.. వాటిని మార్చుకొని, చీరల వంటివి ధరించటానికి తగిన సమయం దొరకలేదు. ఆ పరిస్థితిపై స్పందించిన రామ్‌దేవ్.. స్త్రీలు చీరల్లో, సల్వార్ సూట్‌లలో అందంగా ఉంటారని.. అంతటింతో ఆగకుండా అసలేం ధరించకపోయినా బాగుంటారని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ యోగా కార్యాక్రమానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృతా ఫడణవీస్ కూడా హాజరుకావటం విశేషం.
बाबा रामदेव उर्फ राम किसन यादव यांनी ठाणे येथील एका सार्वजानिक कार्यक्रमात महिलांसंबंधी अत्यंत खालच्या पातळीवर जाऊन विधान केले होते. या वक्तव्याची राज्य महिला आयोगाने गंभीर दखल घेत बाबा रामदेव उर्फ राम किसन यादव यांना याबाबतीत आपला खुलासा दोन दिवसाच्या आत सादर करण्यासाठी नोटिस१/२ pic.twitter.com/umI27luSK7
— Rupali Chakankar (@ChakankarSpeaks) November 28, 2022