Android Screen Lock : మీ ఆండ్రాయిడ్ ఫోన్‌కు స్ర్కీన్ లాక్ వేశారా? మీకు తెలియకుండానే సిమ్ కార్డుతో ఇలా అన్‌లాక్ చేయొచ్చు!
Android Screen Lock : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్‌కు స్ర్కీన్ లాక్ వేశారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు తెలియకుండానే వారి ఫోన్ స్ర్కీన్ అన్ లాక్ చేయవచ్చు. సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు డేవిడ్ షుట్జ్.. గూగుల్ పిక్సెల్ ఫోన్లలో సెక్యూరిటీ లోపాన్ని కనుగొన్నారు.

Your Android phone screen lock may not be as safe as you think
Android Screen Lock : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్‌కు స్ర్కీన్ లాక్ వేశారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు తెలియకుండానే వారి ఫోన్ స్ర్కీన్ అన్ లాక్ చేయవచ్చు. సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు డేవిడ్ షుట్జ్.. గూగుల్ పిక్సెల్ ఫోన్లలో సెక్యూరిటీ లోపాన్ని కనుగొన్నారు. స్క్రీన్ లాక్‌ని అన్‌లాక్ చేసేందుకు ఎవరినైనా అనుమతించగలదని ఆయన గుర్తించారు. అన్‌లాక్ చేసేందుకు SIM కార్డ్, కోర్సు డివైజ్ యాక్సస్ మాత్రమే తీసుకోనుంది. డేవిడ్ కూడా బగ్ గురించి ట్విట్టర్లో ఒక పోస్ట్‌ను షేర్ చేశాడు. Passcode ఏదైనా @Google Pixel ఫోన్‌ని అన్‌లాక్ చేసేందుకు అనుమతించే లోపాన్ని కనుగొన్నట్టు తెలిపారు.
ఇప్పటివరకు ఇదే అత్యంత ప్రభావవంతమైన బగ్ అని చెప్పారు. నవంబర్ 5, 2022 సెక్యూరిటీ ప్యాచ్‌లో Google సమస్యను పరిష్కరించింది. మీ డివైజ్‌లను అప్డేట్ చేసుకోవాలని ట్వీట్లో తెలిపింది. పిక్సెల్ ఫోన్‌ను ఎలా అన్‌లాక్ చేయొచ్చో డేవిడ్ వివరించాడు. డేవిడ్ తన సిమ్ పిన్ను మూడు సార్లు తప్పుగా ఎంటర్ చేశాడు. ఆ తర్వాత, సిమ్ కార్డ్ ఆటోమాటిక్‌గా లాక్ అయింది. అప్పుడు అతడు PUK కోడ్‌ను ఎంటర్ చేశాడు.

Your Android phone screen lock may not be as safe as you think
ఇప్పుడు ఫోన్ స్ర్కీన్ అన్‌లాక్ చేసేందుకు SIM కార్డ్‌లో అందుబాటులో ఉంది. SIM అన్‌లాక్ చేయగానే కొత్త PINని సెట్ చేశాడు. ఆ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత.. హోమ్ స్క్రీన్‌పై ఓపెన్ చేశాడు. అందరూ చూస్తుండగానే డేవిడ్ ఆండ్రాయిడ్ ఫోన్ స్క్రీన్ అన్‌లాక్ చేసి చూపించాడు. ఆ తర్వాత సిమ్ ట్రేని మళ్లీ ఇన్సర్ట్ చేసి.. పిన్ని రీసెట్ చేస్తే సరిపోతుందని తెలిపాడు. ఈ ప్రాసెస్ ఎలా పని చేస్తుందో చూపించేందుకు డేవిడ్ ఒక వీడియోను కూడా షేర్ చేశాడు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..