YouTube TVలో నెలవారీ సబ్ స్ర్కిప్షన్ ధరలు పెరిగాయి.. ఎంతంటే?

  • Published By: sreehari ,Published On : July 1, 2020 / 07:38 PM IST
YouTube TVలో నెలవారీ సబ్ స్ర్కిప్షన్ ధరలు పెరిగాయి.. ఎంతంటే?

Updated On : July 1, 2020 / 7:50 PM IST

ప్రముఖ ఇంటర్నెట్ టెలివిజన్ సర్వీసు యూట్యూబ్ టీవీ కొత్త ధరలను ప్రకటించింది. నెలవారీ సబ్ స్ర్కిప్షన్ ధరలను ఒక్కసారిగా పెంచేసింది. ఇప్పటివరకూ నెలవారీ సబ్‌ స్ర్కిప్షన్ ధర 50 డాలర్లు (రూ. 3777) నుంచి 64.99 డాలర్లు (రూ.4900)కు పెంచేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 8 ViacomCBS ఛానెల్‌లను కంపెనీ అందించడం ప్రారంభించింది. దీంతో యూట్యూబ్ టీవీ తన నెలవారీ ధరను నెలకు 50 డాలర్ల నుంచి 64.99 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. BET, CMT, Comedy Central, MTV, Nickelodeon, Paramount Network, TV Land, VH1 అనే ఈ ఎనిమిది ఛానళ్లకు నెలవారీ కొత్త ధరలు కొత్త చందాదారులకు అమల్లోకి వచ్చేశాయి. ప్రస్తుత కస్టమర్లు ఈ ధరలను వచ్చే బిల్లింగ్ సైకిల్‌లో (జూలై 30 న లేదా తరువాత) వర్తించనున్నాయి.

ఇప్పుడు పెంచిన కొత్త ధరలతో 15 డాలర్లు పెరిగింది. యూట్యూబ్ టీవీలో తాజా ధరల పెరుగుదలతో పోలిస్తే.. సర్వీసు లాంచ్ చేసిన సమయంలో నెలకు 35 డాలర్లుగా ఉంది. టర్నర్ నెట్‌వర్క్‌లను (TBS, TNT, CNN, Adult Swim, Cartoon Network, truTV, and Turner Classic Moviesతో సహా) యాడ్ చేసింది. 2018 ప్రారంభంలో ఈ ధరను మొదట నెలకు 40 డాలర్లకు పెంచేసింది. యూట్యూబ్ టీవీ డిస్కవరీ నెట్‌వర్క్‌ల శ్రేణిని యాడ్ చేసినప్పుడు ఖర్చులు 2019లో మళ్లీ నెలకు 50 డాలర్లకు పెరిగాయి. ViacomCBS ఛానెల్‌లతో పాటు, నెలకు 64.99 డాలర్లకు సబ్ స్ర్కిప్షన్ ధరలను పెంచేసింది.


AT&T TV నెలకు 55 డాలర్ల వద్ద ప్రారంభమవుతుంది (12 నెలల తర్వాత భారీ పెరుగుదలతో), స్లింగ్ టీవీ పూర్తి ప్రణాళిక నెలకు 45 డాలర్ల ఖర్చు అవుతుంది. యూట్యూబ్ టీవీ వాస్తవ కేబుల్ ధరకు దగ్గరగా ఉందని కొన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ, గూగుల్ ఓవర్-ది-టాప్ సర్వీసుకు కొన్ని బెనిఫెట్స్ అందిస్తోంది. వీటిలో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న దాదాపు ఏ డివైజ్ నుంచి అయినా సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అదనపు హార్డ్‌వేర్‌తో పాటు ఏ కేబుల్ సెట్-టాప్ బాక్స్ కంటే మెరుగైన UI యూజర్ ఇంటర్ ఫేస్ కలిగి ఉంది.