New Year సెలబ్రేషన్స్‌‌కు ఇండియాలో బెటర్ ఆప్షన్స్

New Year సెలబ్రేషన్స్‌‌కు ఇండియాలో బెటర్ ఆప్షన్స్

Updated On : December 27, 2019 / 3:02 PM IST

మరి కొద్ది రోజుల్లో రానున్న న్యూ ఇయర్ కోసం ప్లానింగ్‌లు మొదలైపోయాయా.. అయితే ఎక్కడ సెలబ్రేట్ చేసుకుందామనుకుంటున్నారు. ప్రతి ఏటా జరుపుకునే రొటీన్ పద్ధతికి బై బై చెప్పి కొత్త వేకేషన్ స్పాట్‌లో జోష్ నింపుకోవాలనుకుంటున్నారా.. అయితే మా దగ్గర ఉన్న 10ఆప్షన్లలో మీకు నచ్చినవి వాడుకోండి.

గోవా: 
దేశం మొత్తంలో న్యూ ఇయర్‌కు గోవా స్పెషల్ గా రెడీ అవుతుంది. ఇక్కడ సన్‌బర్న్ ఫెస్టివల్ స్పెషల్. తక్కువ రేట్ లో స్పెషల్ సీ ఫుడ్ దొరుకుతుండటం, ఇసుక బీచ్ లో చిందులేయడం ఎవరికి ఇష్టముండదు వకీ. డీజే సౌండింగ్‌తో ఫుల్ నైట్ పార్టీతో ఊగిపోయే జనం.. ఉదయం వరకూ జోష్ లో ఉండి బీచ్ లో ఈతగొట్టేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. 

goa

పుదుచ్చేరి
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి బీచ్ స్పాట్‌కు గోవాకు పోటీ ఇవ్వాలంటే ఇదే మరి. ఎంత ఫ్యామస్ స్పాట్ అంటే ఫ్రెంచ్ వాళ్లు కూడా పుదుచ్చేరిని పొగుడుతూ ఓ స్టోరీ రాశారు. జంటలుగా వచ్చి సెలబ్రేట్ చేసుకోవడమే కాదు.. ఉండటానికి ఆశ్రమాలు కూడా దొరుకుతాయి. చీప్ ఆల్కహాల్‌తో పాటు ఫ్రెంచ్ స్టైల్ లో ఉండే కేఫ్‌లు, బార్లు జనాలతో నిండిపోయి కెవ్వుకేకలతో ఊపేస్తుంది. 

pondicherry

 

ఉదయ్‌పూర్:
రాజస్థాన్ లో ఉన్న ఉదయ్‌పూర్ ఓ చారిత్రక ప్లేస్. రాజ్‌పుత్రుల ప్యాలెస్‌ల మధ్యలో హస్తకళలతో కనువిందు చేస్తుంది ఈ రాజభవనం. ఇంత స్పెషల్ ప్లేస్ కాబట్టే రాజస్థాన్ కశ్మీర్ అని దీనికి పేరు. ఓ రాయల్ స్టైల్‌లో న్యూ ఇయర్ ను జరుపుకోవాలనుకుంటే రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ సంపదకు వెళ్లాల్సిందే. 

udaipur

 

గోకర్ణ:
సాధారణంగా హాలిడే స్పాట్‌గా పేరు తెచ్చుకున్న కర్ణాటకలోని గోకర్ణ రెండు రకాలుగా ఫ్యామస్. ఇదో ఆధ్మాత్మిక నగరమే కాకుండా బీచ్ లవర్స్‌కు స్వర్గాన్ని గుర్తుకు తెస్తుంది. నీలి కెరటాలపై ప్రశాంతంగా నగరం నుంచి వస్తున్న శబ్దాలు వింటూ తక్కువ రేట్ లో దొరికే షెల్టర్ తో పీస్ ఫుల్‌గా న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పేయొచ్చు. 

gokarna

 

 

జై సల్మార్:
జై సల్మార్‌లో ఉన్న సోనార్ కిల్లా ప్రపంచంలోని సహజ సంపదల్లో ఒకటి. రాయల్ సెలబ్రేషన్స్‌కు ఇదేం తక్కువ కాదు. సిటీలో ఉన్న కోటలు, భవనాల మధ్యలో థార్ ఎడారి బంగారపు వర్ణం ఇసుకతో న్యూ ఇయర్ జోష్ నింపుకోండి. ఇక్కడకు వెళ్లాలంటే కేవలం ట్రైన్ లో మాత్రమే వెళ్లగలం. 

jai salmer

 

అండమాన్ నికోబార్:

ఎంజాయ్ చేయడానికి మరో బీచ్ స్పాట్ అండమాన్ నికోబార్. న్యూ ఇయర్ బెస్ట్ డెస్టినేషన్స్‌లో ఇదో బెస్ట్ చాయీస్. ప్రశాంతంగా ఉండే ఐలాండ్.. ఈ సందర్భంగా చేసుకునే క్రేజీ పార్టీలకు మంచి హబ్‌గా మారిపోతుంది. సముద్రం మధ్యలో స్టీమర్ కంటే పెద్ద పరిమాణంలో ఉన్న బోటు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కు వేదిక అయిపోతుంది. 

happy new year

 

మెక్ లియోగంజ్:
దేశంలో చూడచక్కని ప్రదేశాల్లో మెక్ లియోగంజ్ ఒకటి. పచ్చదనంతో పాటు, మంచుతో కూడిన పర్వతాల్లో కేఫ్‌లు, భోజన ప్రియులకు కొత్త రకం వంటకాలు వెల్‌కమ్ చెబుతాయి. ఈ సంవత్సరాన్ని గ్రేట్ గా ఆరంభించాలనుకుంటే ఇది చక్కని చాయీస్. 14వ దలైలామా ఉండే ప్రదేశంతో పాటు భగ్సునాథ్ గుడి కూడా ఇక్కడ ఉంది. 

happy new year

 

మనాలి:
2019కి గ్రాండ్‌గా గుడ్ బై చెప్పాలనుకుంటే మనాలి వెళ్లాల్సిందే. మంచు దుప్పట్లతో కప్పి ఉన్న ప్రాంతంలో స్కై డైవింగ్ కిరాక్ ఫీల్ దక్కుతుంది. ఈ ప్రదేశంలో ఉండే పైనాపిల్ చెట్ల వాసన క్రేజీ పార్టీలకు ఊతమిస్తోంది. అందుకే విదేశాల నుంచి ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. 

happy new year

 

కొడైకెనాల్:

దక్షిణాది అంటేనే హీట్.. అని ఫీలవుతుంటారు. ఇక్కడ పచ్చని పర్వత ప్రాంతాలు కూడా ఉండడం ప్రత్యేకం. లోయల్లో ఉండే గ్రామాలు, బెస్ట్ కాఫీని అందించడంతో పాటు చక్కటి లొకేషన్ తో నిండి ఉంటాయి. ఓ సారి కొడైకెనాల్ వెళితే.. కొండప్రాంతాలకే రాకుమారిలా కనిపిస్తుంది అక్కడి వాతావరణం. ఆ ప్రదేశంలో చలితో డిసెంబర్ 31వ రాత్రి ప్రశాంతంగా సాగనంపేయొచ్చు. 

happy new year

 

న్యూ ఢిల్లీ: 
ఇండియాలో ఏం జరిగినా ఢిల్లీనే టాప్. సెలబ్రేషన్స్‌లోనూ అదే తరహా స్పీడ్‌తో ఉందీ దేశ రాజధాని. కళా ప్రదర్శనలు, చారిత్రక సంపద, చక్కటి ఆహారం అందించే రెస్టారెంట్లు, తక్కువ ధరకే దొరికే లాడ్జి గదులు టూరిస్టులను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. పరిసరాల్లో వినిపించే అద్భుతమైన సంగీతం ఆ మూడ్ లోపలికి లాక్కెళ్లిపోతుంది. 

happy new year