Covid Symptoms : 21 వేర్వేరు కొవిడ్ లక్షణాలు ఇవే.. అచ్చం సాధారణ జలుబులానే అనిపిస్తుంది.. నిపుణుల హెచ్చరిక!
అచ్చం సాధారణ జలుబు మాదిరిగానే అనిపిస్తుంది.. ఏముందిలే జలుబే కదా అనిపిస్తుంది.. కానీ, అది కరోనా అని తెలుసుకునేలోపు లక్షణాలు ముదిరిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

21 Different Covid Symptoms And Most Common Just Feel Like A Cold, Expert Warns
21 different Covid symptoms : అచ్చం సాధారణ జలుబు మాదిరిగానే అనిపిస్తుంది.. ఏముందిలే జలుబే కదా అనిపిస్తుంది.. కానీ, అది కరోనా అని తెలుసుకునేలోపు లక్షణాలు ముదిరిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా లక్షణాల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆ లక్షణాలు ఎలా ఉంటాయో తప్పక తెలుసుకోవాలని సూచిస్తున్నారు. లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ కొవిడ్ సింప్టమ్ స్టడీ యాప్‌లో కరోనా లక్షణాలు 21 వరకు ఉంటాయని వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లు కూడా తీసుకుంటున్నారు.. కరోనా టీకా తీసుకోవడం ద్వారా కరోనా లక్షణాలు చాలామందిలో భిన్నంగా కనిపిస్తున్నాయని వైద్యనిపుణులు అంటున్నారు. గత వారంలో వైరస్ కేసులు 18 శాతం పెరిగాయని ZOE బృందం వెల్లడించింది.
ఇప్పటివరకూ వ్యాక్సిన్ తీసుకునివారిలో 15,099 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక డోసు లేదా పూర్తి డోసులు తీసుకున్న వారితో పోలిస్తే.. 4,023 వరకు కొత్త కేసులు నమోదయ్యాయి. డబుల్ డోసుతో పోలిస్తే.. మొదటి మోతాదు ఉన్నవారిలో పాజిటివిటీ రేటు చాలా ఎక్కువగా ఉందని యాప్ డేటా సూచిస్తోంది. మహమ్మారి ప్రారంభంలో, NHS జాబితా ప్రకారం.. మూడు సాధారణ లక్షణాల కంటే ఎక్కువ లక్షణాలు ఉన్నాయని యాప్ డేటా తెలిపింది. అయితే ఆ మూడింటి కంటే సాధారణ కరోనా లక్షణాల ఎక్కువ ఉన్నాయని, ప్రజలు అత్యవసరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ZOE యాప్‌లో ప్రస్తుతం లాగిన్ డేటా ప్రకారం.. కరోనా సాధారణ లక్షణాల్లో తలనొప్పి, ముక్కు కారటం, తుమ్ము, అలసట గొంతు నొప్పి ఉంటాయి.. ఇది చాలా మందికి సాధారణ జలుబులానే అనిపిస్తుందని అంటున్నారు. మొదట వచ్చిన వారికి మరోసారి కరోనా సోకుతుంది. కాకుంటే లక్షణాలు తగ్గుతాయి. మరొకరికి వ్యాప్తి చేయగలరు.. అందుకే లక్షణాలు తగ్గేంతవరకు సెల్ఫ్ ఐసోలేట్ కావడం ఉత్తమమని సూచిస్తున్నారు. కరోనా సోకినట్టు అనుమానం ఉంటే వెంటనే టెస్టు చేయించుకుని అందరికి దూరంగా ఐసోలేట్ కావాలని సూచిస్తున్నారు. యూకేలో 264 మందిలో ఒకరికి ప్రస్తుతం కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు అంచనా వేశారు. యాప్ ద్వారా లాగిన్ అయిన కొవిడ్ బాధితుల్లో ప్రధానంగా 21 లక్షణాలు బయటపడ్డాయి.. అవేంటో ఓసారి చూద్దాం..
– అధిక ఉష్ణోగ్రత (జ్వరం)
– చలి లేదా వణుకు
– నిరంతర దగ్గు
– వాసన కోల్పోవడం
– రుచి తెలియకపోవడం..
– తలనొప్పి
– అసాధారణ అలసట
– గొంతు మంట
– ఆకస్మిక గందరగోళం
– చర్మంపై దద్దుర్లు
– నోటిలో లేదా నాలుకలో మార్పులు
– చేతివేళ్లు, కాళ్లపై (Covid toes) ఎర్రగా రంగు మారడం
– శ్వాస ఆడకపోవుట
– ఛాతీ నొప్పి
– కండరాల నొప్పులు
– బొంగురు గొంతు
– అతిసారం
– ఆకలి వేయకపోవడం
– కడుపులో నొప్పి
– ముక్కు కారడం
– తుమ్ములు
కరోనా బాధితుల్లో ఒక్కొక్కరిలో లక్షణాలు భిన్నంగా ఉండవచ్చని ప్రొఫెసర్ స్పెక్టర్ స్పష్టం చేశారు. యూకేలో మిలియన్ల టీకాలు అందబాటులోకి వచ్చాయి. ఇప్పటివరకు 43.4 మిలియన్ల మందికి మొదటి మోతాదు ఇవ్వగా.. 31.7 మందికి రెండవ మోతాదు అందింది. రెండు డోసులు తీసుకున్న తర్వాత తలనొప్పి మొదటిగా లక్షణంగా ఉంది. రెండో లక్షణంగా ముక్కు కారటం, ఆ తర్వాత తుమ్ము, గొంతు నొప్పి మూడో లక్షణంగా ఉన్నాయి. ఒకే మోతాదు తీసుకున్నవారిలో నిరంతర దగ్గు ఐదో లక్షణంగా వస్తుంది. అసలు టీకానే వేసుకోనివారిలో ఇంకా తలనొప్పి, గొంతు నొప్పి, ముక్కు కారటం కనిపిస్తోంది. అలాగే జ్వరం, నిరంతర దగ్గు కూడా వచ్చే అవకాశం ఉంది.
సాధారణ లక్షణాలను టీకా ఎలా నిరోధిస్తుందో తెలుసా… జ్వరం ఉన్నట్లయితే మొదటి ఐదు స్థానాల్లో లేదు కాబట్టి మీరు వ్యాధి బారిన పడ్డారా లేదా తెలుసుకోవడం కష్టమంటున్నారు. కరోనా లక్షణాలలో ఈ మార్పు డెల్టా వేరియంట్ వల్ల జరిగిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని అంటున్నారు. అదేంటో గుర్తించడానికి మరింత డేటా అవసరమని అభిప్రాయపడుతున్నారు.