5 Unhealthy Habits : మీ ఫిట్‌నెస్‌‌కు అడ్డుపడే 5 అనారోగ్యకర అలవాట్లు ఇవే..!

ఫిట్ నెస్ సాధించే క్రమంలో ఎదురయ్యే ఐదు సాధారణ (five unhealthy habits) అనారోగ్యకర దురాలవాట్లను ఎలా అధిగమించాలో గిల్ పలు సూచనలు చేశారు.

5 Unhealthy Habits : మీ ఫిట్‌నెస్‌‌కు అడ్డుపడే 5 అనారోగ్యకర అలవాట్లు ఇవే..!

5 Unhealthy Habits That Are Coming In The Way Of Your Fitness

Updated On : August 14, 2021 / 6:25 PM IST

5 unhealthy habits of your fitness : అసలే ఉరుకుల పరుగుల జీవితం.. గంటల కొద్ది కంప్యూటర్ ముందే కూర్చొని పనిచేసే జీవనశైలి.. గంట కూడా వ్యాయామం చేసే పరిస్థితి లేకపాయే.. ఇంకేముంది అనేక అనారోగ్య సమస్యలకు ఆహ్వానం పలికినట్టే.. అందుకే ప్రతిఒక్కరూ శారీరక వ్యాయామం అవసరమని నిపుణులు సూచించేది.. చాలామంది మంచి ఫిట్ నెస్ కోసం రోజూ జిమ్ లలో గంటలకొద్ది కసరత్తు చేస్తుంటారు. అయినా సరే ఫిట్ నెస్ సాధించలేకపోతున్నారు. వర్కౌట్ గోల్స్ సరైన క్రమంలో చేస్తేనే ఫలితం ఉంటుందనే విషయం మర్చిపోతున్నారు. ఎలాపడితే అలా చేసేస్తున్నారు.

అసలు ఫిట్ నెస్ అంటేనే లైఫ్ స్టయిల్.. అదో వర్కౌట్ ప్లాన్ కాదని తెలుసుకోవాలి. అంటే.. మీ శరీరాన్ని శిక్షించకండి.. పోషణ ఇవ్వాలని అర్థం. మంచి ఫిట్ నెస్ పొందాలంటే.. ముందుగా బరువు తగ్గాలి. శరీరాన్ని తగిన ఆకృతిలోకి మార్చుకోవాలి. కండరాలను బలిష్టంగా మార్చుకోవాలి. అప్పుడే బలంగా తయారవుతారు. కానీ, చాలామంది ఫిట్ నెస్ పేరుతో శరీరాన్ని తమకు తెలియకుండానే బాధపెడుతున్నారు. కంటినిండా నిద్రలేకుండా ఎన్ని వర్కౌట్లు చేసిన ఫలితం శూన్యమే.. ఇలాంటి మరెన్నో బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల బాడీ ఫిట్ నెస్ సాధించడం ఆలస్యమవుతోంది.

హెల్తీ లైఫ్ స్టయిల్ (healthy lifestyle) ద్వారా మాత్రమే మంచి ఫిట్ నెస్ సాధించడం సాధ్యపడుతుందని fitness influencer Tarun Gill చెబుతున్నారు. ఫిట్ నెస్ సాధించే క్రమంలో ఎదురయ్యే ఐదు సాధారణ (five unhealthy habits) అనారోగ్యకర దురాలవాట్లను ఎలా అధిగమించాలో గిల్ పలు సూచనలు చేశారు. ఈ సూచనల ద్వారా అతి తక్కువ సమయంలో ఫిట్ నెస్ గోల్ చేరుకోవచ్చునని అంటున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..

1. చిరుతిండి వద్దు.. :
2021లో కరోనా పుణ్యామనీ అందరూ ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, డైట్ విషయంలో చాలామంది తమను తాము చీట్ చేసుకుంటున్నారు. చిరుతిండిని హెల్తీ డైట్ తో ముడిపెట్టేస్తున్నారు. కిచెన్ లో స్నాక్స్ ఎక్కువగా ఆరగించే ప్రయత్నం చేస్తున్నారు. మీల్స్ మధ్య చిరుతిండి ఎక్కువగా లాంగేస్తున్నారు. ఫలితంగా ఫిట్ నెస్ తొందరగా సాధించలేకపోతున్నారు. వర్కౌట్లు చేసినా ఫలితం రాకపోవడానికి కారణం ఇదే.. హెల్తీ డైట్ ఫుడ్ మాత్రమే తీసుకునేందుకు ప్రయత్నించండి. అప్పుడు మీ ఫిట్ నెస్ గోల్ తొందరగా చేరుకోగలరు.

2. నిద్రను నిర్లక్ష్యం చేయొద్దు :
రోజులో ఎన్నిగంటలు నిద్రపోతున్నారు. రోజుంతా పని, ఆడుకోవడం, వర్కౌట్లకే సరిపోతే.. నిద్రపోయేదెప్పుడు.. ముందు నిద్ర సరిగాపోవాలి. లేదంటే అది మీ రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది జాగ్రత్త.. వ్యాధులతో శరీరం పోరాడాలంటే కంటినిండా నిద్ర అవసరం. అప్పుడే మానవ శరీరాలు విశ్రాంతి తీసుకోగలవు. లేదంటే హార్మోన్ల సమతుల్యత లోపించి అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపడం కంటే కంటినిండ్రా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. రోజుకు 8 గంటలు నిద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

3. మానసిక చింతన లేకపోవడం :
ఏది చేసినా మానసికంగా సిద్ధపడాలి. అప్పుడే అది ఫలితాన్ని ఇస్తుంది. అదేపనిగా ఫోన్ లో మాట్లాడేస్తూ.. జిమ్ లో గంటల కొద్ది కసరత్తులు చేసినా ఫలితం ఉండదు. జిమ్ లో ఉండి.. మానసికంగా మరెక్కడో ఏకాగ్రత ఉంటే.. ఫిట్ నెస్ సాధించలేరు. అప్పుడు మీ మనస్సుకు కండరాలకు మధ్య కనెక్షన్ ఉండదు. మనస్సు లగ్నం చేయకుండా ఎంతసేపు జిమ్ చేసినా ఎలాంటి ఫలితం ఉండదని గిల్ చెబుతున్నారు. శరీరం, మనస్సు కలిసినప్పుడే ఏదైనా సాధించవచ్చు. అలాగే మనసు పెట్టి వర్కౌట్ చేసినప్పుడే వందశాతం ఫలితం వస్తుందని గిల్ అంటున్నారు.

4. వర్కౌట్లపై ధ్యాస పెట్టకపోవడం :
వ్యాయామం చేస్తున్నంత సేపు దానిపై దృష్టిపెట్టకపోవడం కూడా ఒక కారణం.. వ్యాయామం చేస్తున్నామనే భావన బలంగా ఉండాలి. ఇలా చేస్తే తాను ఫిట్ నెస్ సాధింగలననే ధృడ విశ్వాసం కలగాలి. మీ మనస్సును ఉత్తేజపరచేలా ఉండాలి. వ్యాయామం చేసేటప్పుడు ఆనందించగలగాలి. వారంలో ప్రతిరోజూ ఫిట్ నెస్ ట్రైనింగ్, కార్డియో, యోగా, డ్యాన్స్‌ చేయడం అలవాటుగా చేసుకోవాలి.

5. ఎలాపడితే అలా చేసేయడం మానుకోండి :
వర్కౌట్లు చేస్తున్నారు సరే.. మీ శరీరానికి ఎలాంటి రూపం ఇవ్వాలనుకుంటున్నారు.. ఈ విషయంలో మీ దృష్టి లేకుంటే సరైన ఫలితం రాదు. ఎలా పడితే అలా వర్కౌట్లు చేయడం ద్వారా మీరు ఆశించిన ఫలితం ఉండదు. టెక్నిక్ తెలిసి ఉండాలి. సరైన ఫారమ్ లేకుండా ఇష్టమొచ్చినట్టు వర్కౌట్లు చేయరాదు.. ఒకవేళ మీరు కొత్తగా వ్యాయామం చేస్తున్నట్టుయితే.. ఒక ఫిట్ నెస్ ట్రైనర్ ఎంచుకోండి. ఎలా వర్కౌట్లు చేయాలో వారే మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఒకవేళ మీరు బరువు తగ్గే వ్యాయాయాలు చేస్తుంటే.. ఎలా చేయాలి.. ఏయే వెయిట్ లిఫ్టింగ్ చేయాలో తగు సూచనలు చేస్తారు. అవి పాటిస్తే సరి.. మీరు కోరుకున్న ఫిట్ నెస్ మీ సొంతం అవుతుంది.