Human LifeSpan : ఆయుర్దాయం పెరుగుతోంది..! మనిషి జీవితకాలం ఎంత? 150 ఏళ్లపైనా జీవించగలడా?

ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక ఎక్స్ పెయిరీ డేట్ ఉంటుంది.. అలాగే ఒక్కో జీవికి ఒక జీవిత కాలం ఉంటుంది. ఇంతకీ.. మనిషి జీవితకాలం ఎంతంటే? సాధారణంగా 100 ఏళ్లు జీవించగలడని అంటారు. వాస్తవానికి మనిషి జీవితం వందేళ్లు కాదట..

Human LifeSpan : ఆయుర్దాయం పెరుగుతోంది..! మనిషి జీవితకాలం ఎంత? 150 ఏళ్లపైనా జీవించగలడా?

Exact Lifespan Of Human

Updated On : July 5, 2021 / 7:51 PM IST

Human Lifespan : ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఒక ఎక్స్ పెయిరీ డేట్ ఉంటుంది.. అలాగే ఒక్కో జీవికి ఒక జీవిత కాలం ఉంటుంది. ఇంతకీ.. మనిషి జీవితకాలం ఎంతంటే? సాధారణంగా 100 ఏళ్లు జీవించగలడని అంటారు. వాస్తవానికి మనిషి జీవితం వందేళ్లు కాదట.. అంతకంటే ఎక్కువేనట.. ఫ్రాన్స్ కు చెందిన Jeanne Calment అనే వృద్ధ మహిళ 122 ఏళ్లు జీవించిందట..

1997లో ఆమె మరణించగా.. అప్పుడు సరిగ్గా వయస్సు 122 ఏళ్ల 164 రోజులు అంట. ఆమె 24 ఏళ్ల రికార్డును ఎవరైనా బ్రేక్ చేయగలరా? ఎప్పుడు? అంటే కచ్చితంగా చెప్పలేం.. అయితే ఈ శతాబ్దం చివరి నాటికి 122 దాటి జీవించి ఉంటారనడానికి దాదాపు 100శాతం అవకాశం ఉందని అంచన వేస్తున్నారు అధ్యయన పరిశోధకులు. మరో అధ్యయనంలో మనిషి 150 ఏళ్ల వయస్సు వరకు కూడా జీవించగలడని అంచనా వేశారు. ఈ శతాబ్దంలో ఎవరైనా 124 ఏళ్లు జీవించే అవకాశం 99 శాతం ఉందంటున్నారు.

122 ఏళ్ల నుంచి 135 ఏళ్ల మధ్య :
13 దేశాలకు చెందిన వారి జీవిత కాలాన్ని పరిశీలించగా.. 2020-2100 కాలానికి గరిష్టంగా వారి వయస్సు 122 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు. పాత రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ 100శాతం దగ్గరలో ఉందని అంటున్నారు. ఈ శతాబ్దంలో 124 ఏళ్ల రికార్డును 99శాతం బ్రేక్ చేసే అవకాశం ఉంది. అలాగే 127 ఏళ్ల వయస్సు కూడా 68శాతంగా ఉందని అంచనా వేశారు. 130 ఏళ్ల వరకు జీవించడం 13శాతం మాత్రమే తక్కువగా అవకాశం ఉందంటున్నారు.

120 ఏళ్ల నుంచి 150 ఏళ్ల మధ్య..
తగినంత నిద్ర లేకపోవడం, వ్యాయామాలు చేయక ఒత్తిళ్ల నుంచి కోలుకునే వారి సామర్థ్యం చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు. 120-150 ఏళ్ల వయస్సు మధ్య వారిలో శరీరంలోని శక్తి వయస్సుతో పాటు క్రమంగా క్షీణించినట్టు గుర్తించారు. వృద్ధాప్య సమయంలో శరీరం శక్తిని కోల్పోతుందని, తద్వారా గరిష్ట ఆయుష్షును తగ్గించే అవకాశం ఉందంటున్నారు. DOSI అనే ఇండెక్స్ ద్వారా మనిషి జీవిత కాలాన్ని (Biological Age) అంచనా వేశారు. ఇదో రకమైన బ్లడ్ టెస్టుగా చెప్పవచ్చు.

ఆయుర్దాయం పెరుగుతోందట :
100ఏళ్లపైనా జీవించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని అంటున్నారు పరిశోధకులు. కానీ, సూపర్ సెంటెనరియన్ల (supercentenarians) సంఖ్య 110 దాటిన వారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. 2100 నాటికి మానవ జీవితకాలం ఎంత ఎక్కువ ఉంటుందో అంచనా వేసేందుకు వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు Pearce-Raftery అనే కామన్ టూల్ ఉపయోగించారు. భవిష్యత్ ఆయుర్దాయం ఆధారంగా మరణాలను అంచనా వేశారు. 10 యూరోపియన్ దేశాలలో కెనడా, జపాన్ అమెరికా నుంచి సూపర్ సెంటెనరియన్లను ట్రాక్ చేశారు.