Amla Juice : శీతాకాలంలో వ్యాధులు దరిచేరకుండా రక్షించే ఉసిరికాయ జ్యూస్!

ఉసిరికాయ జ్యూస్ లో ప‌టిక బెల్లం క‌లిపి తీసుకుంటే క‌డుపు ఉబ్బ‌రం, క‌డుపు నొప్పి త‌గ్గుతుంద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నారింజ‌లో కంటే ఉసిరిలో ప‌ది రెట్లు విట‌మిన్ సి అధికంగా ఉంటుంది.

Amla Juice : శీతాకాలంలో వ్యాధులు దరిచేరకుండా రక్షించే ఉసిరికాయ జ్యూస్!

Amla juice protects against diseases in winter!

Amla Juice : ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి దీనిని ఆయుర్వేదంలో దీనిని విరివిగా వాడుతున్నారు. ఇది శీతాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారంగా ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. ఉసిరిలో టమిన్ సి, ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయకారిగా పనిచేస్తుంది. చలికాలంలో జలుబు, దగ్గు నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఉసిరి మీ చర్మాన్ని మెరిసేలా, మృదువుగా చేస్తుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది.

శీతాకాలంలో రోజువారిగా కొద్ది మొత్తంలో ఉసిరికాయ జ్యూస్ రూపంలో తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరి రసం శరీర జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తుంది. అదే క్రమంలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వయస్సుతో పాటు మన ఎముకలు బలహీనపడటం ప్రారంభిస్తాయి. ఉసిరి రసం తాగడం వల్ల అవి తిరిగి బలంగా తయారవుతాయి. ఈ జ్యూస్‌ని రోజూ తాగడం వల్ల ఎముక సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

ఉసిరికాయ జ్యూస్ తీసుకోవటం వల్ల దీనిలో ఉండే విటమిన్ సి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఉసిరి రసం రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, వ్యాధులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉసిరి రసం తాగడం వల్ల జలుబు, అల్సర్, పొట్ట సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఉసిరిలో ఉండే మినరల్స్, విటమిన్లు పీరియడ్స్ సమయంలో నొప్పి నుంచి ఉపశమనం పొందడంలో తోడ్పడతాయి.

ఉసిరికాయ జ్యూస్ లో ప‌టిక బెల్లం క‌లిపి తీసుకుంటే క‌డుపు ఉబ్బ‌రం, క‌డుపు నొప్పి త‌గ్గుతుంద‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నారింజ‌లో కంటే ఉసిరిలో ప‌ది రెట్లు విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవ‌నాయిడ్స్, కెరోటినాయిడ్స్, గ్లూకోజ్, క్యాల్షియం వంటివి కూడా ఉసిరిలో అధికంగా ల‌భ్య‌మ‌వుతాయి. మధుమేహం వ్యాధిగ్రస్తుల్ని అదుపులో ఉంచేందుకు ఈ ఉసిరి గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. క్రోమియం మధుమేహం కంట్రోల్లో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది.

ఉసిరి జ్యూస్ తయారు చేసుకోవడానికి రెండు కాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి నీళ్ళు పోసి జ్యూస్ లా చేసుకుని దానిని వడకట్టుకొని కాస్త తేనె కలుపుకొని ప్రతిరోజు ఒక గ్లాసు చొప్పున తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.