యాపిల్స్ తింటే న్యుమోనియా రాదట!

రోజుకో యాపిల్ తింటే నిమోనియా వ్యాధి మన దరిచేరదంటున్నారు శాస్త్రవేత్తలు. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల తాజా కూరగాయలు, పండ్లన్నింటిలోనూ యాపిల్స్‌లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. నిమోనియాకు కారణమయ్యే బ్యాక్టీరియా దాడి చేసినప్పుడు.. యాపిల్ దాన్ని ఎదుర్కొనేందుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ విడుదల చేసిందని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో తెలిసింది.
వివరాలు.. నేచర్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్ లో పలువురు సైంటిస్టులు చేపట్టిన ఓ అధ్యయన వివరాల ప్రకారం… యాపిల్ తినడం వల్ల న్యుమోనియా రాకుండా ఉంటుందని తేలింది. యాపిల్ పండ్లలో ఉండే విటమిన్ సి న్యుమోనియా రాకుండా చూస్తుందని చెప్పారు. అందుకనే రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతుంటారు.