Arrhythmias : కార్డియాక్ అరిథ్మియా ప్రాణాంతకమా? అయితే ఎలా గుర్తించాలి?

హృదయ స్పందన విధానంలో అకస్మాత్తుగా మార్పు రావటం తరువాత సాధారణ స్థితికి చేరుకుంటుంది. ప్రమాదాన్ని అంచనా వేయడానికి కార్డియాలజిస్ట్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం అరిథ్మియా ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Arrhythmias : కార్డియాక్ అరిథ్మియా ప్రాణాంతకమా? అయితే ఎలా గుర్తించాలి?

Arrhythmias

Updated On : June 26, 2023 / 10:22 AM IST

Arrhythmias : సాధారణ పదాలలో కార్డియాక్ అరిథ్మియా అంటే గుండె వేగంగా లేదా చాలా నెమ్మదిగా కొట్టుకోవటం. అరిథ్మియా అనేది అసాధారణమైన గుండె లయకు సంబంధించినది. సాధారణంగా హృదయ స్పందన 60-100 మధ్య ఉంటుంది. అంతకన్నా తక్కువ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అసాధారణ పరిస్ధితిగా పరిగణించవచ్చు. హృదయం అనేది లయబద్ధంగా పనిచేసే ఒక నిర్దిష్ట అవయవం, ఏదైనా నాన్-రిథమిక్ కార్యకలాపాలు గుండెతో ప్రతిదీ సరిగ్గా లేదనడానికి సంకేతం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దాదాపు 1.3 లక్షల మంది అరిథ్మియాతో మరణిస్తున్నారు.

READ ALSO : Heart Attack : కార్డియాక్ అరెస్ట్ , గుండెపోటుకు ప్రమాద కారకాలు, లక్షణాలు , నివారణ !

హృదయ స్పందన 120కి పెరిగితే లేదా 40కి తగ్గితే అది అరిథ్మియా కిందకు వస్తుంది. కొన్ని హార్ట్ అరిథ్మియాలు ప్రమాదకరం కాదు, అయితే కొన్ని అరిథ్మియాలు ప్రాణాంతకం కావచ్చు. మరియు స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్‌కు కారణం కావచ్చు. అంతేకాకుండా, అరిథ్మియా లో కొన్ని సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొందరిలో రోగలక్షణాలు కనిపిస్తాయి. సమస్య ఉన్నప్పుడు, దడ, మైకము, ఛాతీలో అసౌకర్యం, శ్వాస ఆడకపోవడం, బలహీనత, అలసట, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి. హృదయ స్పందన చాలా వేగంగా ఉన్న సందర్భాల్లో స్పృహ కోల్పోవడం, మూర్ఛపోవడం జరుగుతుంది.

READ ALSO : Heart Disease : యువతలో గుండె జబ్బులు పెరగడానికి 4 కారణాలు !

అరిథ్మియా వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు:
1. గుండె నాళాలలో అడ్డంకులు (కరోనరీ ఆర్టరీ వ్యాధులు)
2. గుండెలో నిర్మాణ లోపాలు (వాల్వ్ లోపాలు)
3. గుండె కండరాలతో సమస్యలు (కార్డియోమయోపతి)
4. శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత
5. అధిక కెఫిన్ లేదా అధిక శక్తి ఉద్దీపన పానీయం తీసుకోవడం
6. అధిక మద్యం వినియోగం

READ ALSO : Prevent Heart Attack : గుండెపోటును నివారించాలంటే ముందుగా ప్రమాద కారకాలను తెలుసుకోండి !

వయస్సు పై బడుతున్న కొద్దీ అరిథ్మియా అనేది సాధారణం అయినప్పటికీ, అన్ని వయసుల వారు అరిథ్మియాలను కలిగి ఉంటార్న విషయం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా రక్తపోటు , మధుమేహం ఉన్నవారిలో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పురుష సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరాన్ వేగవంతమైన హృదయ స్పందన రేటును ప్రేరేపిస్తుంది కాబట్టి స్త్రీలలో కంటే పురుషులలో అరిథ్మియా ఎక్కువగా కనిపిస్తుంది. ఎటువంటి కారణం లేకుండా చెమట పట్టినట్లయితే, అది అరిథ్మియా యొక్క లక్షణం కావచ్చు.

READ ALSO : High Blood Pressure : హైబీపీ మీ గుండెను మాత్రమే కాదు.. మూత్రపిండాలు, కాలేయంపై కూడా ప్రభవం చూపిస్తుంది

ECG ద్వారా అరిథ్మియాను గుర్తించవచ్చు. మానవ హృదయంలో నాలుగు గదులు ఉంటాయి. రెండు ఎగువ , రెండు దిగువన ఉంటాయి. సాధారణంగా, ఎగువ గదుల అరిథ్మియాలు హానికరమైనవి. అయితే దిగువ గదుల నుండి వచ్చే అరిథ్మియాలు ఎల్లప్పుడూ హానికలిగించేవి కాకపోవచ్చు. దీనిపై నిర్దిష్ట మూల్యాంకనం అవసరం.

ECG సమయంలో అరిథ్మియా గుర్తించబడితే, కార్డియాలజిస్ట్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. కార్డియాలజిస్ట్ మీకు 24 గంటల హోల్టర్ మానిటర్ పరీక్షను సూచించే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలో, ఒక చిన్న మొబైల్ పరికరం ఛాతీకి కనెక్ట్ చేస్తారు. ఇది మీరు మీ సాధారణ పనిని పునఃప్రారంభిస్తున్నప్పుడు గుండె కార్యకలాపాలను రికార్డ్ చేస్తుంది. 24 గంటల సమయంలో గుండె కార్యకలాపాలు, ప్రమాద పరిమాణాన్ని అంచనా వేస్తాయి. కార్డియాలజిస్ట్ సూచించే ఇతర పరీక్షలలో ఒత్తిడి పరీక్ష, ఎఖోకార్డియోగ్రామ్ లేదా కార్డియాక్ MRI ఉన్నాయి.

READ ALSO : Gas Problem : సాధారణ కడుపు నొప్పిని నిర్లక్ష్యం చేయకండి? గ్యాస్ సమస్య గుండెపోటుకు దారితీసే ప్రమాదం

మొత్తానికి అరిథ్మియా అనేది లక్షణాలు లేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో లక్షణాలు బహిర్గతం కావచ్చు. హానికారంకం లేదా ప్రాణాంతకమైనది కావచ్చు. ఎవరైనా దీనివల్ల ప్రభావితం కావచ్చు, అధిక రక్తపోటు, మధుమేహం లేదా ఏదైనా ఇతర గుండె సంబంధిత కారణాలు , 70 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో ముఖ్యంగా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

READ ALSO : Children Heart Health : మీ పిల్లల గుండె ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే ?

హృదయ స్పందన విధానంలో అకస్మాత్తుగా మార్పు రావటం తరువాత సాధారణ స్థితికి చేరుకుంటుంది. ప్రమాదాన్ని అంచనా వేయడానికి కార్డియాలజిస్ట్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం అరిథ్మియా ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అరిథ్మియాను నిర్లక్ష్యంగా చికిత్స చేయకుండా వదిలేస్తే, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్ లేదా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలకు దారితీస్తుంది.