Nutrient Supplements : పోషకాల లోపాన్ని అధిగమించేందుకు సప్లిమెంట్లు తప్పనిసరా?
విటమిన్ మరియు మినరల్ సప్లిమెంట్లను తరచుగా దుర్వినియోగం చేస్తున్నారు. జలుబు వంటి రోగాలకు చికిత్స చేయడానికి లేదా ఒత్తిడి వంటి జీవనశైలి సమస్యలను ఎదుర్కోవడానికి వీటిని తరచుగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. విటమిన్ సప్లిమెంట్లు అద్భుత నివారణలు కాదు.

Nutrient Supplements
Nutrient Supplements : మన శరీరాలు చాలా తక్కువ మొత్తంలో, వివిధ రకాల జీవక్రియ ప్రక్రియల కోసం విటమిన్లు సేంద్రీయ సమ్మేళనాలను ఉపయోగిస్తాయి. వివిధ రకాల ఆరోగ్యకరమైన ప్రాసెస్ చేయని ఆహారాలను తినడం ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్లు మరియు ఖనిజాలను పొందడం ఉత్తమమైన మార్గం. ఎవరైతే ఆహారం తీసుకోలేని పరిస్ధితుల్లో ఉంటారో అలాంటి వారు మినరల్ సప్లిమెంట్లను వాడుకోమని వైద్యులు సిఫార్సు చేస్తారు. ఇలాంటి సందర్భంలో వాటి వినియోగం వల్ల పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదు. ఇటీ వలికాలంలో చాలా మంది పోషకాహారం తినటానికి బదులుగా విటమిన్, మినరల్ సప్లిమెంట్లను తీసుకుంటున్నారు. వైద్యుల సిఫార్సు లేకుండానే తమంతట తాముగా వాటిని వినియోగిస్తున్నారు.
విటమిన్ మరియు మినరల్ సప్లిమెంట్లను తరచుగా దుర్వినియోగం చేస్తారు. జలుబు వంటి రోగాలకు చికిత్స చేయడానికి లేదా ఒత్తిడి వంటి జీవనశైలి సమస్యలను ఎదుర్కోవడానికి వీటిని తరచుగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. విటమిన్ సప్లిమెంట్లు అద్భుత నివారణలు కాదు. అవి వివిధ జీవక్రియ చర్యలలో పాల్గొనే సేంద్రీయ సమ్మేళనాలు. వైద్య సలహా మేరకు సిఫార్సు చేస్తే తప్ప అధిక మోతాదు సప్లిమెంట్లను తీసుకోకూడదు.
యువత, వయసు పైబడిన వారు చురుకుగా, ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు కీలక పోషకాలు, విటమిన్లు అత్యంత ఆవశ్యకమని నిపుణులు చెబుతున్నారు. సమతుల ఆహారం విధిగా తీసుకుంటేనే శారీరకంగా చురుకుగా ఉండటం సాధ్యమవుతుంది. శరీరానికి కీలక పోషకాలు అందకపోవడంతో యువతలో సైతం ఐరన్, అయోడిన్, బీ, డీ వంటి కీలక విటమిన్ల లోపం కనిపిస్తోంది. ఈ సందర్భంలో మాత్రమే మల్టీవిటమిన్లను వైద్యుల సూచన మేరకు తీసుకోవాల్సి ఉంటుంది.
మల్టీవిటమిన్లు గుండె జబ్బు, క్యాన్సర్ ముప్పును తప్పించడంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజువారీ సవాళ్లను ఎదుర్కొనేలా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యకర శరీరానికి అవసరమైన ఒమెగా-3ని ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటి ద్వారా కొలెస్ట్రాల్ కరిగి జీవక్రియల రేటు మెరుగవడంతో పాటు గుండెకు మేలు కలుగుతుంది. ఒమెగా-3 సరిపడినంత శరీరానికి అందితే శ్వాస సమస్యలు తొలగడం, నాడీమండల వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది.
ఇవి కూడా క్యాప్సుల్ రూపంలో అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని తీసుకోవచ్చు.
సాధ్యమైనంత వరకు ఆహారం ద్వారానే ఈ విటమిన్లు, పోషకాలు అందేలా చూసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పనిపరిస్ధితుల్లో విధిగా సప్లిమెంట్ల రూపంలో వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మీరు తినే ఆహారం నుండి మీరు పొందే చాలా విటమిన్లు మాత్రలలో ఉండే వాటి కంటే మంచివని పరిశోధనలు సూచిస్తున్నాయి. సప్లిమెంట్లలోని విటమిన్లు సహజంగా లభించే విటమిన్ల యొక్క ఖచ్చితమైన రసాయన కూర్పుతో సంశ్లేషణ చేయబడిఉంటాయి.
ఆహారం అనేది విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైటోకెమికల్స్ యొక్క సంక్లిష్ట మూలం, ఇవి అన్నీ కలిసి పనిచేస్తాయి. సప్లిమెంట్లు ఒంటరిగా పని చేస్తాయి. శరీరంపై ప్రభావం చూపే ఆహార పదార్థాన్ని వేరుచేసి, సప్లిమెంట్‌గా తీసుకున్నప్పుడు అదే ప్రభావం ఉండకపోవచ్చని పరిశోధనల్లో తేలింది. విటమిన్ మరియు మినరల్ సప్లిమెంట్లను తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారం కోసం ప్రత్యామ్నాయం కాదు.