High-Fiber Foods : హై-ఫైబర్ ఆహారాలు తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్ఛర్యపోవాల్సిందే ?

ఫైబర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇవి గుండెకు ప్రయోజనకరంగా ఉంటాయి, బలమైన, ఆరోగ్యకరమైన గుండెను నిర్వహించడంలో అంతేకాకుండా గుండెపోటు తర్వాత ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో ఫైబర్ తోడ్పడుతుంది.

High-Fiber Foods : హై-ఫైబర్ ఆహారాలు తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్ఛర్యపోవాల్సిందే ?

eating high fiber

Updated On : April 28, 2023 / 6:32 PM IST

High-Fiber Foods : ఆహారాన్ని తొలుత నోటిలో బాగా నమిలిన తరువాత మింగుతారు. కడుపులోకి చేరిన ఆహారం విచ్ఛిన్నం కావటం ప్రారంభమౌతుంది. అయితే మీరు తీసుకున్న ఆహారంలో ఫైబర్ లేకపోతే తిన్న 45 నిమిషాలతరువాత బ్లడ్ షుగర్ లో అసమతుల్యతను చవిచూడాల్సి వస్తుంది. ఈ పెరుగుదల, తగ్గుదలను నివారించడానికి కీలకంగా అధిక ఫైబర్ ఆహారం ఉపయోగపడుతుంది. ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకుంటే రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. తిన్న తర్వాత చాలా గంటలపాటు కడుపు నిండిన భావాన్ని కలిగిస్తుంది.

హై-ఫైబర్ ఆహారాన్ని తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ;

1. ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చు ; డైటరీ ఫైబర్ తీసుకోవడం అన్నది బరువు తగ్గాలన్న ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి మేలు చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. ఎక్కువ సమయం ఆకలి లేకుండా చేస్తాయి. ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం, ఫైబర్ డైట్‌ను పెంచడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుందని నిర్ధారణ అయింది.

2. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ; ఫైబర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇవి గుండెకు ప్రయోజనకరంగా ఉంటాయి, బలమైన, ఆరోగ్యకరమైన గుండెను నిర్వహించడంలో అంతేకాకుండా గుండెపోటు తర్వాత ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో ఫైబర్ తోడ్పడుతుంది.

3. ఫైబర్ మంచి నిద్ర పట్టేలా చేస్తుంది ; నిద్రపై అనేక ఆహారాల ప్రభావం ఉంటుంది. జర్నల్ ఆఫ్ క్లినికల్ స్లీప్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో సంతృప్త కొవ్వు మరియు చక్కెర తక్కువగా ఉన్న అధిక-ఫైబర్ ఆహారాలను తీసుకున్నవారు ఎక్కువసమయం గాఢంగా నిద్రించేందుకు సహాయపడుతుందని కనుగొన్నారు.

4. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ; ఇటీవలి హార్వర్డ్ అధ్యయనం ప్రకారం, ఒక మహిళ యుక్తవయస్సులో ఉన్నప్పుడు ప్రతిరోజూ తీసుకునే ప్రతి అదనపు 10 గ్రా డైటరీ ఫైబర్‌కు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 13% తగ్గుతుందని తేలింది.

5. ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది ; ఫైబర్ క్రమబద్ధతను ప్రోత్సహించడానికి, మలబద్ధకం నుండి ఉపశమనానికి సహాయపడుతుంది. ఇది ప్రకోప ప్రేగు సిండ్రోమ్, మలబద్ధకం లక్షణాలను మెరుగుపరుస్తుంది.