Basil Benefits : గొంతునొప్పి, నోటి సమస్యలను తగ్గించే తులసి

చాలా మందికి రాత్రిళ్ళు నిద్ర పట్టదు. అలాంటి వారు ప్రశాంతంగా నిద్రపోయేందుకు తులసిని వినియోగించ వచ్చు. తులసి ఆకులను చక్కెరతో కలసి తీసుకుంటే నిద్రలేమి వం

Basil Benefits : గొంతునొప్పి, నోటి సమస్యలను తగ్గించే తులసి

Tulasi

Updated On : August 15, 2021 / 10:40 AM IST

Basil Benefits : హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు విశేషమైన స్ధానం ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే ఇంటి ముంగిట ఉండే తులసి కోటకు మహిళలు పూజలు చేస్తారు. ముఖ్యంగా వైష్ణవ దేవాలయాల్లో తులసి తీర్ధాన్ని భక్తులకు అందిస్తారు. సర్వరోగ నివారిణీగా దీనిని భావిస్తారు. తులసి చెట్టు 24గంటలు ప్రాణవాయువును వదులుతుందని చెబుతుంటారు. ఆయుర్వేద వైద్యంలో తులసిని విరివిగా వినియోగిస్తుంటారు.

తులసి మొక్కలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. గొతు,నోటి సమస్యలకు తులసి చక్కని ఔషదంగా పనిచేస్తుంది. తులసి ఆకులు, రసం ఇలా ఏరూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి ప్రయోజనకారిగా ఉపయోగపడుతుంది. చాలా మంది అధిక కొవ్వుతో బాధడుతుంటారు. అలాంటి వారికి తులసి బాగా పనిచేస్తుంది. తులసిలో కొవ్వును తగ్గించే గుణం ఉంది. తులసి ఆకులను ప్రతిరోజు పల్చని మజ్జిగలో కలుపుకుని తాగితే శరీరంలోని అనవసరమైన కొవ్వు కరిగిపోవటంతోపాటు, బరువు నియంత్రణలో ఉంచవచ్చు.

చాలా మందికి రాత్రిళ్ళు నిద్ర పట్టదు. అలాంటి వారు ప్రశాంతంగా నిద్రపోయేందుకు తులసిని వినియోగించ వచ్చు. తులసి ఆకులను చక్కెరతో కలసి తీసుకుంటే నిద్రలేమి వంటి సమస్యలు దూరమై ప్రశాంతమైన నిద్రకు అవకాశం ఉంటుంది. తులసిలో యాంటి సెఫ్టిక్ గుణాలు కలిగి ఉండటంతో చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు తులసి రసంలో తేనె కలుపుకుని తీసుకుంటే చక్కని ప్రయోజనం ఉంటుంది.

అనేక మంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతుంటారు. పదిమందిలో మాట్లాడే సమయంలో నోటి నుండి వస్తున్న దుర్వాసన ఇతరులను ఇబ్బందికలిగిస్తుంటుంది. ఇలాంటి వారు ప్రతిరోజు రాత్రి నీళ్ళల్లో తులసి ఆకులను నానబెట్టి ఉదయాన్నే ఆనీటితో పళ్ళు తోమటంతోపాటు, నోటిలో బాగా పుక్కిలించాలి. ఇలా చేయటం వల్ల నోటి దుర్వాసన పోతుంది.

గొంతునొప్పి, నోట్లు చిన్నచిన్న పొక్కుల వంటి సమస్యలకు తులసి చక్కని పరిష్కారంగా దోహదపడుతుంది. గొంతునొప్పి సమస్య కారణంగా ఏమి తినాలన్నా, తాగాలన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి సమస్యతో బాధపడుతున్నవారు. తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి గోరు వెచ్చగా ఉన్ననీటిని మెల్లమెల్లగా తాగాలి. అలా నాలుగైదు రోజులు చేస్తే చాలు గొంతునొప్పి, నోటిలో పొక్కుల సమస్య తగ్గిపోతుంది.

ప్రతిరోజు తులసి ఆకులను నమిలి తినటం వల్ల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. చిన్న పిల్లల్లో సాధారణంగా కనిపించే జలుబు, దగ్గు, జ్వరం, వాంతులుకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. కడుపులో నులిపురుగులు, దగ్గు ఉన్నవారు తులసి ఆకులుకు, మిరియాలు, దనియాలు కలిపి చేరి మేత్తగా నూరి తింటే మంచి ఫలితం ఉంటుంది.