Air Hostesses : ఎయిర్ హోస్టెస్ అవ్వాలంటే గ్లామరస్‌గా ఉంటే చాలా?

ఎయిర్ హోస్టెస్ కావాలంటే అందంగా ఉంటే చాలా? అసలు వారికి ఎలాంటి బాధ్యతలు ఉంటాయి ? ఎలాంటి వారిని విమాన సంస్థలు ఎయిర్ హోస్ట్‌లు‌గా ఎంపిక చేసుకుంటాయి?

Air Hostesses : ఎయిర్ హోస్టెస్ అవ్వాలంటే గ్లామరస్‌గా ఉంటే చాలా?

Air Hostesses

Updated On : July 19, 2023 / 3:28 PM IST

Air Hostesses : ఎయిర్ హోస్టెస్ కెరియర్‌పై కొంతమంది యువతులు ఆసక్తి చూపుతారు. మంచి జీతంతో పాటు జీవితం కూడా బావుంటుంది అని భావిస్తారు. అయితే ఎయిర్ హోస్టెస్ కావాలంటే అందంగా ఉండటం, డబ్బు సంపాదించుకోవడమే కాదు.. వారి ఉద్యోగ బాధ్యతలో ఆశ్చర్యపరిచే అనేక అంశాలు ఉన్నాయి.

Viral Video : హైటెక్ బిచ్చగాడు.. విమానంలో భిక్షాటన చేసిన వ్యక్తి వీడియో వైరల్

ఎయిర్ హోస్టెస్ అనగానే ముందుగా చాలా గ్లామరస్‌గా ఉంటారు అనుకుంటాం. అందం అనేది పరిగణనలోకి తీసుకునే అంశమే కానీ వారి బాధ్యతలు చాలా పెద్దవి. ప్రయాణికులు, పైలట్ సిబ్బంది.. భద్రత, సౌకర్యానికి ఎయిర్ హోస్టెస్‌లు బాధ్యత వహిస్తారు. సంస్థలో ఎంతో నైపుణ్యంతో పనిచేయడం, ప్రశాంతంగా, ఓపికగా ఉండే మానసిక స్థితి, కమ్యూనికేషన్ నైపుణ్యం ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని యజమానులు ఎయిర్ హోస్టెస్‌లను ఎంపిక చేస్తారు. అందంతో పాటు అందరితో స్నేహ పూర్వకంగా, సమర్థవంతంగా ఉండేవారికి ప్రాధాన్యతను ఇస్తారు.

 

ఎయిర్ హోస్ట్‌‌స్‌లు ఎప్పుడూ ప్లెజెంట్‌గా ఉంటారు. దేశ, విదేశీ ఉన్నతస్ధాయి క్లయింట్లు, మరియు సిబ్బందితో ఇంటరాక్ట్ అవుతారు. అందువల్ల విమానయాన సంస్థల యజమానులు వారు క్లీన్ రూపాన్ని కలిగి ఉండాలని భావిస్తారు. చక్కటి ఆహార్యం కలిగి ఉండటం.. వారందరికీ సేవలు అందించేటపుడు మర్యాద పూర్వక సంభాషణ చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇండియాలోని ఎయిర్ హోస్టెస్ శిక్షణా సంస్థలు క్యాబిన్ క్రూ కోర్సులలో శిక్షణ ఇచ్చి విజయవంతమైన మార్గం వైపు నడిపిస్తున్నాయి. అక్కడ ఎయిర్ హెస్టెస్ కావాలనుకునే వారి వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచే కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వస్త్రధారణ పద్ధతులపై శిక్షణ ఇస్తారు.

Airline Baggage : విమానంలో అదనపు లగేజీకి డబ్బు కట్టకుండా యువతి అతి తెలివి .. కట్ చేస్తే..

ఎయిర్ హోస్టెస్ అంటే అందంగా ఉండాలనేది తప్పని సరి కాదు. చాలామంది ఒక్కోసారి అందాన్ని, వస్త్రధారణతో మిక్స్ చేసి చెప్తారు.. రెండు భిన్నమైన విషయాలు. వస్త్రధారణ అనేది కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్, ఫిట్ నెస్, మంచి దుస్తులు వేసుకోవడం.. ఇవే ఎయిర్ హెస్టెస్ కావాలనుకునేవారికి విజయాలు తెచ్చిపెడతాయి. ఇక ఎయిర్ హెస్టెస్ అవ్వాలనుకునే వారికి ముఖంపై మచ్చలు, టాటూలు, ఉండకూడదు. ప్రతి నెల బరువు చెక్ చేస్తారు. ఏ మాత్రం బరువు పెరిగినా తిరిగి బరువు తగ్గిన తరువాతే విధుల్లోకి తీసుకుంటారట.