Beet Root : చర్మ సమస్యలు రాకుండా నివారించటంతోపాటు ముఖ సౌందర్యాన్ని పెంపొందించే బీట్ రూట్!

మొటిమల సమస్య ఉంటే రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్‌రూట్‌ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్‌ వేసుకోవటం వల్ల పింపుల్స్‌ తోపాటు వాటివల్ల ఏర్పడే మచ్చలు తొలగిపోతాయి.

Beet Root : చర్మ సమస్యలు రాకుండా నివారించటంతోపాటు ముఖ సౌందర్యాన్ని పెంపొందించే బీట్ రూట్!

Beet root that prevents skin problems and improves facial beauty!

Updated On : December 17, 2022 / 3:37 PM IST

Beet Root : బీట్‌ రూట్‌ తీసుకోవటం వల్ల ఆరోగ్యానికే కాదు చర్మానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ A, విటమిన్ B6, ఐరన్, ఫైబర్, ఫొలేట్, విటమిన్ సీ, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటి పోషకాలు అనేక అనారోగ్యాల నుంచి మనల్ని రక్షిస్తాయి. అంతేకాకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొదిస్తుంది.

బీట్‌రూట్‌లో విటమిన్ సి ఉండటం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది, చర్మానికి ప్రకాశవంతమైన మెరుపును ఇస్తుంది, చర్మంపై గీతలు, ముడతలు మరియు వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. బీట్‌రూట్‌లోని యాంటీఆక్సిడెంట్లు UV కాంతి వల్ల కలిగే సూర్యరశ్మి నుండి చర్మాన్ని రక్షించడంలో తోడ్పడతాయి. చర్మ సమస్యలు రాకుండా నివారిస్తాయి.

బీట్ రూట్ తో చర్మసౌందర్యానికి చిట్కాలు ;

ప్రతిరోజూ ముఖానికి బీట్‌రూట్‌ రసం రాసి పది నిమిషాలపాటు మర్దన చేస్తే ముఖం మీద ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం మిలమిల మెరుస్తుంది. బీట్‌రూట్‌లోని విటమిన్‌ సీ, జింక్‌, యాంటీబయోటిక్స్‌ పింపుల్స్‌, మచ్చలను తొలగిస్తుంది.

మొటిమల సమస్య ఉంటే రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్‌రూట్‌ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్‌ వేసుకోవటం వల్ల పింపుల్స్‌ తోపాటు వాటివల్ల ఏర్పడే మచ్చలు తొలగిపోతాయి.

బీట్‌రూట్‌ గుజ్జులో రెండు చెంచాల ముల్తానీ మట్టీ, ఒక స్పూను నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. అరంగటపాటు ఉంచిన తరువాత చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలూ, నల్లమచ్చలు తొలగిపోయి చర్మం నిగనిగలాడుతుంది.
ముఖం క్లీన్‌ అవుతుంది..

రెండు స్పూన్ల బీట్ రూట్ రసంలో ఒక స్పూన్ కలబంద గుజ్జు కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే చర్మానికి పోషణ కలగటమే కాకుండా మంచి ఛాయ కూడా వస్తుంది.

టేబుల్‌ స్పూన్‌ బియ్యప్పిండిలో, ఒక స్పూన్ ఆపిల్‌ గుజ్జు, రెండు చెంచాల బీట్‌రూట్‌ రసం, చెంచా నువ్వుల నూనె వేసి పేస్ట్‌లా కలపాలి. దీన్ని చర్మానికి రాసుకుని నలుగు పెట్టుకుంటే మృతకణాలు తొలగి చర్మం నిగనిగలాడుతుంది.

బీట్‌రూట్‌ రసం, కమలా రసం సమంగా తీసుకుని అందులో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే డెడ్‌ సెల్స్‌ను తొలగిపోతాయి. అదే బీట్‌రూట్‌ రసంలో నిమ్మరసం కలిపి రాసుకుంటే పిగ్మెంటేషన్‌ సమస్య పోతుంది.

బీట్‌రూట్ జ్యూస్, టమాటా రసం కొద్ది మోతాదులో తీసుకొని మచ్చలపై రాసుకోవాలి. ఆరిపోయిన తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల మచ్చలు తొలగిపోతాయి.

బీట్‌రూట్ జ్యూస్‌లో దూదిని ముంచి దానితో కనురెప్పలతో పాటు కళ్ల చుట్టూ అద్దుకోవాలి. తరువాత చల్లని నీటితో కడుక్కుంటే డార్క్‌ సర్కిల్స్‌ తగ్గుముఖం పడతాయి.