Monsoon Fever : వర్షకాలంలో వచ్చే జ్వరాలతో జాగ్రత్త!

వ‌ర్షాలు వ‌చ్చిన‌ప్పుడు వ‌ర్షానికి త‌డ‌వ‌డం, అదేవిధంగా బ‌య‌ట ఫుడ్‌ను తీసుకోవ‌డం మంచిది కాదు. అదేవిధంగా వ‌ర్ష‌పు నీరు ఇంట్లో నిలువ‌లేకుండా చూస్తే దోమలు వంటి వాటికి అస్కారంలేకుండా చూసుకోవచ్చు.

Monsoon Fever : వర్షకాలంలో వచ్చే జ్వరాలతో జాగ్రత్త!

Monsoon Fever

Monsoon Fever : వర్షకాలంలో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వ‌ర్ష‌కాలంలో ఎక్కువ‌గా జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం, వైర‌ల్ ఫీవ‌ర్, అతిసారం, మలేరియా, ఫంగల్ ఇన్ ఫెక్షన్, కలర వంటివి వస్తుంటాయి. సీజ‌న్ రోగాల‌కు వర్షకాలం నిల‌యంగా మారుతుంది. వ‌ర్షాల వ‌ల్ల బ్యాక్టీరియాలు అభివృద్ధి చెందుతాయి. తేమ‌, చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం బ్యాక్టీరియా, వైర‌స్‌ల‌కు నిల‌యం. ఇక వ‌ర్ష‌పు నీరు నిల్వతో ఎన్నో ర‌కాల దోమ‌లు, క్రిములు త‌యార‌వుతుంటాయి. ఇక దోమ‌లు కుట్ట‌డం ద్వారా ఈ సీజ‌న్ లో ఎక్కువ వ్యాధులు వస్తాయి. వాటిలో ముఖ్యంగా డెంగ్యూ, చికెన్ గున్యా, మ‌లేరియా, టైఫాయిడ్ వంటివి ఉన్నాయి.

వైర‌ల్ ఫీవ‌ర్ : వర్షకాలంలో ఎక్కువ మంది సాధారణంగా వచ్చే వైరల్ ఫీవర్లు అధికమనే చెప్పాలి. జ్వరానికి సంబందించిన ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి అది ఏర‌కానికి చెందిన‌ద‌ని గుర్తించ‌వ‌చ్చు. జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు ల‌క్ష‌ణాలు వైర‌ల్ ఫీవ‌ర్లో క‌నిపిస్తుంటాయి. సాధారణ చికిత్సతో వైరల్ ఫీవర్ల నుండి బయటపడవచ్చు.

టైఫాయిడ్ జ్వ‌రం : క‌లుషిత‌మైన నీరు, క‌లుషిత ఆహారం ద్వారా వ‌చ్చే జ్వ‌రం. క‌డుపులో వికారం, వాంతులు, నీళ్ల విరేచ‌నాలు క‌నిపిస్తుంటాయి. బ్యాక్టీరియ‌ల్ ఇన్ఫెక్ష‌న్ వ‌ల్ల ఇది సంభ‌విస్తుంది. శ‌రీరంలోని వివిధ అవ‌య‌వాల‌కు వ్యాపించి ప్రాణాంత‌కంగా మారుతుంది. అందుకోసం చికిత్స వెంట‌నే తీసుకోవాలి. బ‌య‌టి ఆహారాన్ని అస్స‌లు తీసుకోకూడదు. ఇంట్లో కూడా ఈసీజ‌న్ లో వండిన వెంట‌నే తీసుకోవ‌డం మంచిది.

మ‌లేరియా : ఇది ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. మ‌నిషి ర‌క్తంలో ప‌రాన్న జీవులు చేరిన‌ప్పుడు మ‌లేరియా సోకుతుంది. ఈ జ్వ‌రంలో చ‌లి, వ‌ణుకు ఎక్కువ‌గా ఉంటుంది. వీటితో పాటు త‌ల‌నొప్పి కూడా క‌నిపిస్తుంటుంది. స‌రైన చికిత్స తీసుకోక‌పోతే మ‌లేరియా కూడా ప్రాణాంత‌క‌మే అవుతుంది. ఎక్కువ‌గా ఏజెన్సీ ఏరియాల్లో మ‌లేరియా మ‌ర‌ణాలు న‌మోదు అవుతుంటాయి. మ‌లేరియా మూలంగా శ్వాస తీసుకోవ‌డం ఇబ్బంది, మెదడు దెబ్బ‌తిన‌డం, శ‌రీరంలోని అవ‌య‌వాలు వైఫ‌ల్యానికి దారి తీసే పరిస్ధితి ఉంటుంది.

డెంగ్యూ జ్వ‌రం : ఈ జ్వ‌రం దోమ కుట్ట‌డం వల్ల వస్తుంది. 102 డిగ్రీల‌కు పైగా జ్వ‌రం న‌మోదు అవుతుంది. ముఖ్యంగా తీవ్ర‌మైన కీళ్ల‌నొప్పులు, ఛాతి వెనుక భాగంలో నొప్పి, త‌ల తిర‌గ‌డం, మూర్చ‌ప‌డిపోవ‌డం, వ‌ణుకు రావ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఈ డెంగ్యూ జ్వ‌రంలో ర‌క‌ర‌కాలుంటాయి. శ‌రీరంలో నీటి శాతం కూడా త‌గ్గిపోతుంటుంది. ర‌క్త క‌ణాలు ప‌డిపోతుంటాయి. ఇది ఎక్కువైతే ప్రాణాలు కూడా కోల్పోయే అవ‌కాశం ఉంటుంది.

చికెన్ గున్యా : ఇది కూడా దోమ కుట్ట‌డం ద్వారానే సంభ‌విస్తుంది. జ్వ‌రం రోజు మొత్తం ఉండ‌దు. జ్వ‌రం వ‌స్తూ పోతూ ఉంటుంది. అదేవిధంగా ఒళ్లునొప్పులు కూడా ఉంటాయి. దోమ‌ల‌తో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. త‌ప్ప‌కుండా వైద్యుల వ‌ద్ద‌కు వెళ్లి చికిత్స తీసుకోవాలి.

వ‌ర్షాలు వ‌చ్చిన‌ప్పుడు వ‌ర్షానికి త‌డ‌వ‌డం, అదేవిధంగా బ‌య‌ట ఫుడ్‌ను తీసుకోవ‌డం మంచిది కాదు. అదేవిధంగా వ‌ర్ష‌పు నీరు ఇంట్లో నిలువ‌లేకుండా చూస్తే దోమలు వంటి వాటికి అస్కారంలేకుండా చూసుకోవచ్చు. ప‌రిస‌రాల‌ను ఎప్ప‌టికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. వ‌ర్షాకాలంలో మ‌నం తాగే నీరు కాచి చ‌ల్లార్చిన త‌రువాత తీసుకోవాలి. మాంసాహారం ఎక్కువ‌గా తీసుకోకూడ‌దు.