Bitter Gourd : వర్షకాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే కాకరకాయ!

వర్షకాలంలో కాకరకాయను తినటం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చూస్తాయి. బరువు తగ్గడానికి సహకరిస్తుంది. కాకరకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.

Bitter Gourd : వర్షకాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే కాకరకాయ!

Bitter Gourd

Updated On : July 22, 2022 / 6:18 PM IST

Bitter Gourd : కాకరకాయ కూర అంటే చాలా మంది అయిష్టత ప్రదర్శిస్తుంటారు. చేదుగా ఉండటమే ఇందుకు కారణంగా చెప్తారు. అయితే చేదుగా ఉన్నప్పటికీ కాకరకాయను కూరగా చేస్తే దాని రుచిలో మార్పు వస్తుంది. చాలా మంది కాకరకాయ కూర, కాకరకాయ కారం ఇలా వివిధ రూపాల్లో వండుకుని తింటారు. కాకరను ఎలా తిన్నా అందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో కాకరకాయను ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఆరోగ్యానికి మంచి మేలు కలుగుతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

కాకర కాయలోని యాంటీఆక్సిడెంట్లు శరీరం నుంచి ట్యాక్సిన్లు బయటకు పోయేలా చూస్తాయి. ఫలితంగా జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసి బరువు తగ్గుతారు. కాకర కాయలో కెలరీలు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. వర్షకాలంలో కాకరకాయను తినటం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చూస్తాయి. బరువు తగ్గడానికి సహకరిస్తుంది. కాకరకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. వర్షకాలంలో ఇన్ ఫెక్షన్స్ దరిచేరకుండా కాపాడుతుంది. కాకరకాయ తినటం వల్ల వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి. పొట్ట అల్సర్ లకు కారణమైన బ్యాక్టీరియాను చంపుతుంది. కాలేయ సమస్యలు, చర్మ వ్యాధులకు కాకరకాయ బాగా ఉపకరిస్తుంది.

కాకరకాయలో క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు, పీచు, కొవ్వుపదార్థాలు, నీటి శాతం, విటమిన్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ వంటి ఖనిజాలు అధికంగా ఉన్నాయి. కాకరలోని యాంట్రీ మైక్రోబియాల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేయడంలో తోడ్పడతాయి. కాకరను తరచుగా తినడం వల్ల చర్మ, రక్త సంబంధ సమస్యలు రావు. కాకరలోని ఆల్కలైడ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఇందులోని చార్న్‌టిన్ పెప్‌టైడ్లు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. వర్షకాలంలో చాలా మంది ఆస్తమా, బ్రాంకైటిస్, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు కాకరను ఆహారంలో భాగం చేసుకుంటే వాటి నుండి కొంతమేర ఉపశమనం పొందవచ్చు.