2019లో బాలీవుడ్ చమక్కులు.. హత్తుకుపోయే లుక్కులు

సంవత్సరం పూర్తి అయిపోయింది.. ప్రతి సంవత్సరం కంటే అద్భుతంగా రంగులతో నిండిపోయింది 2019. గ్లామరస్‌గా సాగిపోయిన సినీ లోకంలో.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రయోగాలకు సిద్ధపడ్డ బాలీవుడ్ బ్యూటీలు కన్నార్పకుండా చేస్తున్నారు. మరి ఈ న్యూ ఇయర్ వేడుకలకు మీకూ ఈ ఫ్యాషన్ డ్రెస్ లు సెట్ అవుతాయేమో చూసుకోండి..
ప్రేయసిల తళుక్కులు:
చలికాలంలో చెమట పుట్టించే చూపులతో కట్టేస్తున్నారు ఈ ప్రేయసిలు. రణవీర్ సింగ్ లవర్ దీపికా పదుకొణే, విరాట్ కోహ్లీ లవర్ అనుష్క శర్మ, సైఫ్ అలీ ఖాన్ లవర్ కరీనా కపూర్ తళుక్కుమంటున్నారు.
జాన్వీ నేచరల్ బ్యూటీ:
కనురెప్పల పక్కనే మత్తు పెట్టుకుని ఉంటుందీ బేబీ. శ్రీదేవి గారాలపట్టి జిమ్‌కు వెళ్లి వచ్చే దుస్తులు వందల సంఖ్యలో వైరల్ గా మారాయి. విల్లును పోలి ఉండే పెదాలతో ఏ డ్రెస్ వేసినా ట్రెండీగా కనిపించడం జాన్వీ స్పెషల్.
హెయిర్ స్టైల్ తోనూ హీట్:
కళ్లే కాదు.. హీట్ పుట్టించడానికి జుట్టూ తక్కువేం కాదు. వెట్ లుక్‌తో.. కళ్ల అంచుల్లో కాజల్‌ను మందంగా అద్ది గుండెను గుచ్చేస్తున్న ఈ లుక్‌ను ఎవరైనా మరిచిపోగలరా..
విదేశీ నెలవంక.. ప్రియాంక
నిక్ జోనస్‌ను పెళ్లాడిన ఈ విదేశీ కోడలు.. వయస్సును ఏ మాత్రం పట్టించుకోదు. పెళ్లికే కాదు డ్రెస్సింగ్ కు కూడా ఇదే ఫార్ములా ఈమెది. చింపిరి జుట్టుతో వైరల్‌గా మారిన ఫొటోలు ఎలా ఉండకూడదో నేర్పిస్తుంటే మందహాసంగా నవ్వుతున్న కళ్లు ఎలా ఆకట్టుకోవాలో చూపిస్తుంటాయి.
అలియా.. ఇదేం మాయ:
అలియా భట్ కళ్లకు తగ్గట్లుగా హెయిర్ స్టైల్ రెడీ చేసుకుంటుంది. మత్తుగా ఉన్నప్పుడు, అలసిపోయినట్లు కనిపించాలనుకున్నప్పుడు, ఎదురుచూస్తూ ఉన్నట్లు చెప్పాలనుకున్నప్పుడు ఆమె కళ్లకు సరిపడ హెయిర్ స్టైల్ సిద్ధమవుతోంది.
కరీనా కరీజ్మా:
ఈ ఏడాది కరీనా కపూర్ బయట కనిపించిన సందర్భాల్లో చాలా శాతం హెయిర్ స్టైల్ ఒకే రకంగా కనిపించడంతో పాటు డ్రెస్సింగ్ లోనూ మార్పులు చూపించలేదు. సాధారణంగా వెనుకకు దువ్వినట్లు కనిపించిన జుట్టుతో జీన్స్ బ్లేజర్, మోడ్రన్ వేర్ లతో ట్రెండీ లుక్ తీసుకొచ్చింది.
సోయగాల సోనమ్..
ప్రతి ఫొటోలోనూ సోనమ్ కపూర్ కనురెప్పలు ప్రత్యేకంగానే ఉంటాయి. రెయిన్ బో ఐ మేకప్‌తో క్యాట్ ఈ లైనర్‌ను వాడి ప్రతి ప్రయోగాన్ని క్లిక్‌మనిపిస్తోంది.
కృతిసనన్ కొత్తదనం:
హెయిర్ స్టైల్స్ తో ప్రయోగం చేయాలనుకునేవారు కృతిసనన్ ఫాలో అయిపోవచ్చు. చక్కగానప్పేలా జుట్టుపై ప్రయోగాలు చేసింది.