ఇంట్లో ఉన్నది చాలు.. ఆఫీసుకెళ్లి పనిచేయండి.. లేదంటే ఉద్యోగం ఊడుతుంది.. ప్రధాని వార్నింగ్

go back to work or risk losing your job : కరోనా సంక్షోభంతో ప్రపంచమంతా లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయింది. కోవిడ్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు మూతపడ్డాయి. ఫలితంగా ఆర్థిక సంక్షోభం తలెత్తింది. కరోనా తీవ్రతను నియంత్రించడానికి సాధ్యమైనంతవరకు బయటకు రాకుండా ఇళ్లలోనే పరిమితం కావాల్సి వచ్చింది. వ్యాపారపరంగా చాలా కంపెనీలు నష్టాలను చవిచూశాయి.. ఇప్పుడెప్పుడే ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి..
ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు సైతం వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యాన్ని కల్పించాయి. తమ ఉద్యోగులను ఇంట్లో నుంచే పనిచేసేలా ప్రోత్సహించాయి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. కొన్ని నెలులగా ఇంట్లో నుంచే పనిచేయడం ద్వారా ఆఫీసుల్లో మాదిరిగా పని వాతావరణం అసౌకర్యంగా మారుతోంది.
పని విషయంలో నాణ్యత కూడా దెబ్బతింటుందని పలు కంపెనీలు భావిస్తున్నాయి.. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ప్రభావం కూడా అలానే ఉంది.. అయినప్పటికీ ఉద్యోగపరంగా ఆఫీసులకు వెళ్లడమే ఉత్తమమనే అభిప్రాయాలు పలువురు ఉద్యోగుల్లోనూ వ్యక్తమవుతోంది.. అందరూ ఇంట్లోనే ఉంటే ఆఫీసుల పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.. అందుకే అందరూ ఆఫీసులకు రావాలని కంపెనీలు తమ ఉద్యోగులకు సూచిస్తున్నాయి..
కరోనా ప్రభావం కొనసాగుతున్న సమయంలో చాలామంది ఉద్యోగులు భయపడి ఇంట్లో నుంచి ఆఫీసులకు వెళ్లాలంటే జంకుతున్నారు.. కానీ, ఉద్యోగ పరంగా చిక్కులు తప్పడం లేదు.. ఇదే విషయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా తమ బ్రిటన్లను తిరిగి ఆఫీసుల్లోకి రావాలని ఒక క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నారు. మినిస్టర్లు ఇంట్లో నుంచి పని చేయడం వలన వారి ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఆఫీసుల్లోకి రాకుంటే వారి ఉద్యోగం ఊడిపోతుందని జాన్సన్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే వారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.. మిగిలిన వారంతా తిరిగి ఆఫీసుల్లోకి తిరిగి రావాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. కార్యాలయాల భద్రతపై కూడా దృష్టిపెడుతున్నామని చెబుతున్నారు.
సహోద్యోగులతో పనిచేసే సమయంలో మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పరిశీలిస్తున్నారు. కరోనావైరస్ లాక్ డౌన్ తరువాత యూకేలో ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడీలో పెట్టాలంటే తప్పకుండా అన్ని ఆఫీసులు ఎప్పటిలానే పనిచేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనానికి దారితీస్తుందని ప్రధాని ఆందోళన చెందుతున్నారు.
ఇంటి నుండి దీర్ఘకాలం పనిచేయడమనేది సరైన ఎంపిక కాదని అందరూ అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. రాబోయే వారాల్లో ఆయా కంపెనీల యజమానులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అనేదానిపై వర్కర్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఆఫీసులకు రాకుండా ఇంట్లోనే ఉండి నెలకు ఒకసారి మాత్రమే కార్మికులను చూస్తుంటే భవిష్యత్తులో కొంతమంది ఉద్యోగులకు సమస్యాత్మకంగా మారుతుందని జాన్సన్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు అంగీకరించే పని ఏర్పాట్లు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. రాకపోకలలో రద్దీగా ఉండే రైళ్లు, బస్సులను నివారించడంలో సాయపడేందుకు వీలుగా కొత్త ఆన్‌లైన్ టూల్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.
కరోనా ప్రభావంతో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను వారి డెస్క్‌ల వైపుకు తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.. కానీ, చాలా కంపెనీలు వచ్చే ఏడాది వరకు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రమ్మనడం ఎంతవరకు సురక్షితమనే డైలమాలో కనిపిస్తున్నాయి.. ప్రతిఒక్కరికీ ఇంటి నుండి పని చేయడానికి అవసరమైన స్థలం కావొచ్చు.
మానసికపరమైన ప్రశాంతత వాతావరణం తప్పక ఉండాలి. అప్పుడే పనిని పూర్తి చేయడం సాధ్య పడుతుంది.. చాలా మంది ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు రావడానికి ఇష్టపడతారు. కానీ ఆఫీసులకు తిరిగి రావడం సురక్షితమేనా అనేది వారిలో విశ్వాసం కలిగించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.