పోలీసులు పట్టేస్తారు జాగ్రత్త : CAA ఆందోళనకారులపై Facial recognition నిఘా!

  • Published By: sreehari ,Published On : January 1, 2020 / 01:22 PM IST
పోలీసులు పట్టేస్తారు జాగ్రత్త : CAA ఆందోళనకారులపై Facial recognition నిఘా!

Updated On : January 1, 2020 / 1:22 PM IST

దేశంలో పౌరసత్వ సవరణ చట్టం (CAA)కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై ప్రభుత్వం కొత్త పంథా ఎంచుకుంది. ఒకవైపు ఆందోళనల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులు షట్ డౌన్ చేసిన ప్రభుత్వం మరోవైపు ఆందోళనల్లో పాల్గొనేవారిపై కూడా ఓ కన్నేసి ఉంచుతోంది. CAA, NRC అమలుకు వ్యతిరేకంగా దేశంలో ఆందోళన చేస్తున్నవారిని గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటోంది.

ఫేషియల్ రికగ్నైనేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆందోళనకారుల ముఖాలను గుర్తుపట్టేందుకు వినియోగిస్తోంది. వేలమందిలో ఉన్నసరే.. ఈజీగా ఆందోళనకారుల ముఖాలను గుర్తు పట్టగల టెక్నాలజీ కావడంతో పోలీసులంతా ఇదే ఫాలో అవుతున్నారు. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఆందోళనకారులను హెచ్చరిస్తూ ఎన్నో పోస్టులు కామెంట్లు దర్శనమిస్తున్నాయి. ఆందోళనలో పాల్గొనేవారంతా తప్పనిసరిగా తమ ముఖానికి మాస్క్ లు ధరించాలని సూచిస్తున్నారు.

ఎందుకంటే.. ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఈజీగా ముఖాన్ని గుర్తుపట్టొచ్చు. ప్రభుత్వం డేటాబేస్‌లో ఒకసారి ఎవరి ముఖాన్ని నైనా యాడ్ చేస్తే ఎప్పటికైనా వారిని పట్టేస్తోంది. అందుకే ఢిల్లీ పోలీసులు ఆందోళకారులను ఈ సాఫ్ట్ వేర్ ద్వారా వీడియో రికార్డులు చేసే పనిలో పడ్డారట. ఈ ఫుటేజీతో ఆటోమాటేడ్ ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్ వేర్ (AFRS) ద్వారా కిడ్నాపర్లు, అల్లరిమూకలు, దురాక్రమణదారులను గుర్తించేందుకు వాడుతున్నారు. అదృశ్యమైన చిన్నారుల కోసం 2018లో ఈ AFRS సాఫ్ట్ వేర్‌ను ప్రవేశపెట్టారు. పక్క దేశమైన చైనాలోని హాంగ్ కాంగ్ లో జరుగుతున్న ఆందోళనల సమయంలో కూడా అక్కడ రికార్డైన సీసీ ఫుటేజీ ద్వారా ఆందోళనకారులను గుర్తించేందుకు AFRS ను వినియోగిస్తోంది.

చైనా తరహాలోనే భారతీయ అధికారులు కూడా ఇదే టెక్నాలజీని ఆందోళనలకు కారణమైనవారిని గుర్తించేందుకు వినియోగిస్తున్నారు. ఇండియాలో ఈ టెక్నాలజీని కేవలం పోలీసులు ఆందోళకారులను గుర్తించేందుకు మాత్రమే వినియోగించడం లేదు.. గతంలో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో జరిగిన ఆందోళనల సమయంలో కూడా పోలీసులు ఇలాంటి వీడియోలను రికార్డు చేస్తూ కనిపించినట్టు ఓ రిపోర్టు తెలిపింది. ఆందోళనలు జరిగిన ప్రతిచోట ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లతో పోలీసులు వెళ్లి ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఆందోళనకారులను గుర్తిస్తారా? అనేదానిపై స్పష్టత లేదు. ఇలాంటి టెక్నాలజీ వినియోగం ద్వారా చాలామంది తమ ప్రైవసీతో పాటు ఉపాధిని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హాంగ్ కాంగ్ కు చెందిన ఓ మ్యాగజైన్ నివేదించింది.

facial recognition విషయంలో ప్రజలు ఏం చేయొచ్చు :
గత కొన్నివారాలుగా ఎక్కువ సార్లు ఆందోళనల్లో పాల్గొన్నవారినే ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. సోషల్ ప్లాట్ ఫాంల్లో చాలావరకు ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ వీడియోలు, ఫేస్ బుక్, ట్విట్టర్ టైమ్ లైన్లలో ఆందోళనకారులకు సంబంధించి ఎన్నో ఫొటోలు, వీడియోలు షేర్ అయ్యాయి. కొంతమంది వారికి సంఘీభావం తెలుపుతూ పాటలు, నినాదాలతో కూడిన వారి పోస్టర్లను వీడియోలను షేర్ చేసి ఉంటారు. కానీ చాలా మంది ఇప్పుడు వారి సమ్మతిని స్పష్టంగా తెలియజేయకుండానే ఆందోళకారుల ఫోటోలు, వీడియోలను బహిర్గతం చేశారు.

కొన్నిసార్లు ఇది వారి ప్రమేయం లేకుండానే ప్రతికూల పరిస్థితులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్నవారి ఫొటోలు ఓపెన్ ఇంటర్నెట్ లోకి వచ్చేశాయి. దీంతో వారికి రిస్క్ లేకపోలేదు. ఎందుకంటే.. యూపీ పోలీసులు.. CAA ఆందోళకారుల ఫొటోలు, వీడియోలను ప్రజలకు రిలీజ్ చేస్తూ వారిని గుర్తుపట్టాలని సూచిస్తున్నారు. పోస్టర్లలో ఫొటోలు ఫ్రింట్ చేసి మరి పంచుతున్నారు. ప్రతి ముగ్గురి ఆందోళనకారులను గుర్తించినవారికి రూ.25వేల వరకు రివార్డు ప్రకటిస్తున్నారు.

ముఖాలకు పెయింట్..మాస్క్ :
ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో తలెత్తే సమస్యలను నివారించాలంటే ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తమ ప్రైవసీకి ముప్పు లేకుండా ఉండాలంటే హాంగ్ కాంగ్ లో ఆందోళనకారుల తరహాలో చేయొచ్చు. అక్కడి అందోనళకారులంతా తమను గుర్తుపట్టకుండా ఉండేలా ముఖాలకు మాస్క్‌లు ధరిస్తున్నారు. ముఖాలకు రంగులు వేసుకుంటున్నారు. త్వరలో పోలీసులు వీటిని సైతం నిషేధించనున్నారు. మరోవైపు కొంతమంది ఆందోళనకారులు తమను కెమెరాలకు దొరక్కుండా ఉండేలా లేజర్లు వాడటం మొదలుపెట్టేశారు. ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్ వేర్.. ఆందోళనల సమయంలో ఎలా వాడుతారో ఓ స్వతంత్ర సెక్యూరిటీ రీసెర్చర్ శ్రీనివాస్ కొడాలి తన ట్విట్టర్ వేదికగా తెలిపారు.

ఉదాహరణకు .. హైదరాబాద్ పోలీసులు.. TSCOP అనే యాప్ వాడుతున్నారు. మీ ఫొటో ఒకవేళ క్రైమ్ డేటా బేస్ లో ఉందో లేదోనని చెక్ చేస్తుంటారు. అందుకే హైదరాబాద్ పోలీసులు చాలామందిని రోడ్లపై ఆపి వారు క్రిమిన్సల్ కాదో చెక్ చేసి పంపిస్తుంటారు’ అని తెలిపారు.దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘తమ ముఖాలపై నేరుగా మాస్క్ లేదా? పెయింట్ వాడొచ్చు.

ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను కన్ఫ్యూజ్ చేసేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. ఏదైనా జంతువు పొలికలతో కూడిన మాస్క్ లు ధరించవచ్చు. ఏదిఏమైనా.. ఇది కూడా చాలా కష్టమని చెప్పవచ్చు. ఎందుకంటే.. AI టెక్నాలజీ ద్వారా ఒక వ్యక్తి నడక విధానం ద్వారా కూడా గుర్తించే వీలుంది’ అని చెప్పారు.