Calcium Is Essential : ఎముకల గట్టితనానికే కాదు, గుండె ఆరోగ్యానికి కాల్షియం అవసరమే!
గుండె సాధారణంగా కొట్టుకునేలా చేయడానికి కూడా ఈ కాల్షియం ఎంతో సహాయపడుతుంది. ఇది చాలావరకు ఎముకలలోనే ఉంటుంది. ఎముకలకు తగినంత కాల్షియం లేకపోతే రక్తపోటు పెరిగే అవకాశం ఉంది.

Calcium Is Essential :
Calcium Is Essential : మనిషి దైనందిన జీవితంలో ఎముకలు, దంతాలు, గుండె లయను నియంత్రించడం, నరాల పనితీరు మెరుగుపర్చడంలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. తగినంత మోతాదులో కాల్షియం లేకపోవడంతో పిల్లల నుంచి పెద్దల వరకు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా అలసిపోయినట్లు అనిపించడం, దంత సమస్యలు, పొడి చర్మం, కండరాల తిమ్మిరి తదితర లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా థైరాయిడ్, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు, జీవక్రియ మందగించడం, హార్మోన్ల సమస్యలు, హెచ్‌ఆర్‌టి, నెలసరి సమస్యలు వంటి లక్షణాల ద్వారా శరీరంలో కాల్షియం లోపం ఉందో లేదో తెలుసుకోవచ్చు.
విటమిన్-డి తక్కువగా ఉంటే ఆహారంలోని కాల్షియాన్ని శరీరం సమర్థవంతంగా గ్రహించలేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిబట్టి శరీరానికి కాల్షియంతో పాటు విటమిన్-డి కూడా అవసరమే. ఇందుకోసం ప్రతి రోజు ఎండలో 20 నిమిషాలు ఉంటే శరీరానికి కావాల్సిన కాల్షియం లభిస్తుంది. మనిషి శరీరానికి ప్రతిరోజు క్యాల్షియం తగిన పరిమాణంలో అవసరమవుతుంది. క్యాల్షియం అనగానే ఎముకలు గట్టితనానికి మాత్రమే ఉపయోగపడుతుందని చాలామంది భావిస్తుంటారు.. అయితే ఇది ఒక్క ఎముకలు, దంతాల ఆరోగ్యానికే కాకుండా రక్తం గడ్డ కట్టేలా చూడటం లాంటి ఎన్నో సమస్యలకు ఉపయోగపడుతుంది. శరీర కండరాలు, నాడులు సక్రమంగా పనిచేయడానికి క్యాల్షియం తోడ్పడుతుంది.
గుండె సాధారణంగా కొట్టుకునేలా చేయడానికి కూడా ఈ కాల్షియం ఎంతో సహాయపడుతుంది. ఇది చాలావరకు ఎముకలలోనే ఉంటుంది. ఎముకలకు తగినంత కాల్షియం లేకపోతే రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా గుండె పై ఆప్రభావం పడుతుంది. దీని పర్యవసానంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందువల్ల మన శరీరానికి ఎప్పుడూ తగినంత క్యాల్షియం లభించేలా చూసుకోవటం మంచిది.
పెద్దవారికి సగటున రోజుకు 1,000 నుంచి 1,200 మి.గ్రా.క్యాల్షియం అవసరం అవుతుంది.అందువల్ల మనం రోజు తీసుకునే ఆహారంలోనే తగినంత క్యాల్షియం లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది.వాటిలో పాలు పెరుగు చీజ్ బాదం సోయా జీడిపప్పు లాంటి వాటిలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి క్యాల్షియం లభించే ఆహార పదార్థాలను రోజువారిగా తీసుకోవడం వల్ల శరీరానికి క్యాల్షియం బాగా అంది ఎముకలతోపాటు, గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.