Broccoli Cure Breast Cancer : బ్రోకలీ రొమ్ము క్యాన్సర్‌ను నయం చేస్తుందా? అధ్యయనాలు ఏమి చెబుతున్నాయంటే ?

బ్రోకలీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలను మహిళలు ఎక్కువగా తీసుకుంటారని గతంలో అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. కాలీఫ్లవర్, క్యాబేజీ , కాలే వంటివి రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అటువంటి ఆహారాలలో అత్యధిక స్థాయిలో కనిపించే సల్ఫోరాఫేన్, క్యాన్సర్ కారకాల యొక్క అనేక దశలలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలదని పరిశోధనలో తేలింది.

Broccoli Cure Breast Cancer : బ్రోకలీ రొమ్ము క్యాన్సర్‌ను నయం చేస్తుందా? అధ్యయనాలు ఏమి చెబుతున్నాయంటే ?

Broccoli Cure Breast Cancer

Broccoli Cure Breast Cancer : సల్ఫోరాఫేన్ అనేది బ్రోకలీ తోపాటు క్రూసిఫెరస్ కూరగాయలలో కనిపించే సహజమైన మొక్కల సమ్మేళనం, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఆహారంలో బ్రోకలీని చేర్చడం ద్వారా మొత్తం ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అంతేకాకుండా జీవనక్రియలను మెరుగుపరచడానికి ఒక పోషకమైన మార్గంగా చెప్పవచ్చు. బ్రోకలీ ఇతర క్రూసిఫెరస్ కూరగాయలలో కనిపించే ఈ సల్ఫోరాఫేన్ సమ్మేళనం రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తుంది, ముఖ్యంగా ప్రారంభ దశలో ఉన్నవారిలో ఇది బాగా ఉపకరిస్తుందని ఇటీవలి అధ్యయనం ద్వారా స్పష్టమైంది.

READ ALSO : Healthy Heart : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పోషకాలను మీ ఆహారంలో చేర్చుకోండి !

ఐఎన్ సీ RNAలు జన్యు వ్యక్తీకరణను నియంత్రించగలవని అధ్యయనాలు సూచిస్తున్నాయి. జన్యువులు తమ పనులను చేయడానికి స్విచ్ ఆన్ లేదా ఆఫ్ చేసే ప్రక్రియ. ఐఎన్సీ RNAలు క్రమబద్ధీకరించబడనప్పుడు రొమ్ము క్యాన్సర్ వ్యాధి రావటం ప్రారంభం అవుతుంది. కొత్త అధ్యయనం క్యాన్సర్‌లో ఎల్‌ఎన్‌సిఆర్‌ఎన్‌ఏలు పోషిస్తున్న పాత్రను సాక్ష్యాలతో నిరూపించటమే
కాకుండా సల్ఫోరాఫేన్ యొక్క యాంటీకాన్సర్ ప్రభావాలను ఉన్నట్లు పరిశోధనల ద్వార స్పష్టత వస్తుంది. బ్రోకలీలో అత్యధిక స్థాయిలో కనిపించే ఈ ఆహార సమ్మేళనం ఎల్‌ఎన్‌సిఆర్‌ఎన్‌ఎలను ప్రభావితం చేస్తుందనే విషయం ఆసక్తిని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

బ్రోకలీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలను మహిళలు ఎక్కువగా తీసుకుంటారని గతంలో అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. కాలీఫ్లవర్, క్యాబేజీ , కాలే వంటివి రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అటువంటి ఆహారాలలో అత్యధిక స్థాయిలో కనిపించే సల్ఫోరాఫేన్, క్యాన్సర్ కారకాల యొక్క అనేక దశలలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలదని పరిశోధనలో తేలింది. ప్రత్యేకించి, సల్ఫోరాఫేన్ హిస్టోన్ డీసిటైలేస్‌లను, HDACలను నిరోధిస్తుంది.

READ ALSO : Meal Maker : చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచే మీల్ మేకర్ !

ఈ క్యాన్సర్ పై పోరాటంలో ఈ కూరగాయలను ఆహారంలో చేర్చుకోవటం మంచిది ;

1. టమోటాలు ; టమోటాలు రుచికరమైనవి మాత్రమే కాక, పోషక విలువలు కలిగినవి. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఆహారంలో ప్రధానమైనవిగా చేసుకోవాలి. టమోటాల క్యాన్సర్ పై పోరాటంలో ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పండు క్యాన్సర్ పై పోరాటంలో సూపర్‌ఫుడ్ గా చెప్పవచ్చు. టొమాటోలు లైకోపీన్‌ను కలిగి ఉండటమే కాకుండా, గుండె జబ్బులను నివారించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్ ఫైటోకెమికల్ తోపాటు విటమిన్లు A, C మరియు E యొక్క మంచి మూలంగా చెప్పవచ్చు.

READ ALSO : Fatty Liver Problem : కాలేయ ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు ఇంటి చిట్కాలు ఇవే ?

2. కాలే ; కాలే వంటకాలు ఆహారా ప్రియులందరినీ ఆకర్షిస్తాయి. రెస్టారెంట్‌లో వారి మెనూలో కాలే సలాడ్, కాలే సైడ్ డిష్ లు తప్పనిసరిగా కనిపిస్తాయి. కాలే ఒక మంచి రుచిని కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది, అవసరమైన పోషకాలను అందిస్తుంది. క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడుతుంది.

3. క్యాబేజీ ; క్యాబేజీని వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మన శరీరంలోని క్యాన్సర్‌తో పోరాడటానికి ఇది సహాయపడుతుంది. క్యాబేజీ రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు, మల
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది.