Fatty Liver Problem : కాలేయ ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు ఇంటి చిట్కాలు ఇవే ?

కాలేయంలో అధిక కొవ్వు సమస్య చికిత్సకు ఉసిరి ఒక ఉత్తమమైన ఆయుర్వేద నివారణలలో ఒకటి. విటమిన్ సి దీనిని అధికంగా ఉండటం వలన, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కాలేయం నుండి వ్యర్ధాలను తొలగించడంలో ,మరింత నష్టం జరగకుండా రక్షించడంలో సహాయపడుతుంది.

Fatty Liver Problem : కాలేయ ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు ఇంటి చిట్కాలు ఇవే ?

Fatty Liver Problem

Fatty Liver Problem : కాలేయంలో కొంత మొత్తంలో కొవ్వు ఉండటం సాధారణం, కానీ కాలేయం బరువులో 5 నుండి 10% కంటే ఎక్కువ కొవ్వు ఉంటే, దానిని ఫ్యాటీ లివర్ లేదా హెపాటిక్ స్టీటోసిస్ అంటారు. కాలేయం అధిక కొవ్వు, సిర్రోసిస్ గా మారి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. హెపటైటిస్ వంటి కాలేయ అంటువ్యాధుల్లా కాకుండా , ఫ్యాటీ లివర్ సమస్య ఉత్పన్నం అయితే ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇది శారీరక, జీవక్రియ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. అయితే ఈ పరిస్ధితి నుండి ఉపశమనం కలిగించేందుకు కొన్ని వంటగది పదార్థాలతో ఇంట్లోనే కొన్ని చిట్కాలు ప్రయత్నించి చూడండి. వీటితో దెబ్బతిన్న కాలేయాన్ని తిరిగి ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Diabetes : మధుమేహులు కాలేయం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

ఫ్యాటీ లివర్ సమస్యకు ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ;

1. ఉసిరి ; కాలేయంలో అధిక కొవ్వు సమస్య చికిత్సకు ఉసిరి ఒక ఉత్తమమైన ఆయుర్వేద నివారణలలో ఒకటి. విటమిన్ సి దీనిని అధికంగా ఉండటం వలన, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కాలేయం నుండి వ్యర్ధాలను తొలగించడంలో ,మరింత నష్టం జరగకుండా రక్షించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా దీనిలోని ఫైటోన్యూట్రియెంట్ క్వెర్సెటిన్ కాలేయ కణాలపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది, కొవ్వు కణాలను కరిగిస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఆల్కహాల్-ప్రేరిత కొవ్వు నుండి కాలేయాన్ని రక్షిస్తుంది.

2. ఆపిల్ సైడర్ వెనిగర్ ; యాపిల్ సైడర్ వెనిగర్ ఫ్యాటీ లివర్ నయం చేయడానికి ఒక సహజమైన నివారణ. ఆపిల్ సైడర్ వెనిగర్ కాలేయ సాధారణ విధులకు ఆటంకం కలిగించే హానికరమైన టాక్సిన్‌లను బయటకు పంపడానికి తోడ్పడుతుంది. దీనిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. వాపును తగ్గిస్తుంది. కాలేయం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

READ ALSO : కాలేయం దెబ్బతినకుండా నివారించాల్సిన హానికరమైన అలవాట్లు ఇవే?

3. పసుపు ; పసుపులో ఉండే కర్కుమిన్  నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) నుండి కాలేయ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. పుష్కలమైన బయోయాక్టివ్స మ్మేళనం కలిగిన కర్కుమిన్ పసుపు సరైన మోతాదులో తీసుకున్నప్పుడు కాలేయ కణాలను హెపాటిక్ స్టీటోసిస్ నుండి కాపాడుతుంది.

4. దాల్చిన చెక్క ; దాల్చినచెక్కలో బలమైన శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి, ఇవి కాలేయంలో మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా తోడ్పడతాయి.

5. నిమ్మకాయ ; నిమ్మరసం విటమిన్ సి యొక్క పవర్‌హౌస్‌. కాలేయ కణాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను నివారించి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటుంది. ఇది కాకుండా, నిమ్మకాయ యొక్క సహజ హెపాటోప్రొటెక్టివ్ లక్షణాలు లిపిడ్ ప్రొఫైల్ స్థాయిలను తగ్గించడం ద్వారా ఆల్కహాలిక్-ప్రేరిత కొవ్వు కాలేయంపై మంచి ప్రభావాన్ని చూపుతాయి.

READ ALSO : Giloy Liver : తిప్పతీగ వాడితే కాలేయం దెబ్బతింటుందా? వాస్తవం ఏంటో చెప్పిన ఆయుష్ మంత్రిత్వ శాఖ

6. గ్రీన్ టీ ; ఈ రిఫ్రెష్ డ్రింక్‌లో పుష్కలమైన కాటెచిన్‌లు ఉన్నాయి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరిచి కొవ్వు పెరగకుండా నిరోధించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగిఉంది. కాలేయంలో నిల్వ ఉన్న కొవ్వు మొత్తాన్ని నిరోధిస్తుంది. కొవ్వును కరిగించి జీవక్రియను ప్రేరేపిస్తుంది. క్రమం తప్పకుండా 2 నుండి 3 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయం ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంతోపాటు ఫ్యాటీ లివర్ వ్యాధిని దూరం చేస్తుంది.

గమనిక ; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిని సూచనలు, సలహాలు పొందటం మంచిది.