Asthma : ఉబ్బసంతో ఉక్కిరిబిక్కిరి….జాగ్రత్తలు తప్పనిసరి

యువతీయువకులు స్నేహితులతో సరిగ్గా కలవలేరు. ఆస్తమాకు నాటు వైద్యాల వల్ల పెరిగేది అనారోగ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Asthma : ఉబ్బసంతో ఉక్కిరిబిక్కిరి….జాగ్రత్తలు తప్పనిసరి

Asthma

Asthma : ఉబ్బసం అనేది ఊపిరితిత్తులలోని వాయునాళాలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధి. శరీరతత్వాలు, వాతావరణంలో మార్పులు, కాలుష్యం, ఇంటిబూజు, దుమ్ము, ధూళి, పొగ, రసాయనాలు, సెంటులు, పుప్పొడి, కొన్నిరకాల మందులు, చివరికి మానసిక ఒత్తిడులు, భావోద్వేగాలు ఇవన్నీ ఊపిరి సలపని ఉబ్బసానికి దారి తీస్తాయి. ఈ ఉబ్బసం ఏ వయసువారినైనా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మనిషి గుండె నిబ్బరాన్ని దెబ్బతీస్తుంది. మనిషిని ప్రశాంతంగా బతకనివ్వక ఆర్థికంగా, శారీరకంగా, సామాజికంగా కృంగదీస్తుంది. వాయునాళాలు మూసుకుపోయి గాలి పీల్చడం, వదలడం కష్టంగా మారుతుంది. దీనినే ఆస్తమా, అలర్షీ, ఇస్నోఫీలియా, అలర్జీ, సర్ది, ఆర్తి, ఆయాసం అనే రకరాల పేర్లతో పిలుస్తుంటారు.

ఉద్బనం వ్యాధి లక్షణాలు : పిల్లలకు చీటికీ, మాటికీ జలుబు చేయడం, ఆసుపత్రుల చుట్టూ తిరగడం, అది ఎంతకీ తగ్గకపోవడం, తగ్గిన, మళ్లీమళ్లీ రావడం, దగ్గు, ఆయానం, గొంతులో గరగర, నిద్రపోలేకపోవటం, పాలు తాగలేక పోవడం, తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఆస్థమా, అలర్జీ లక్షణాలు ఉంటే అది పాల ఉబ్బసం కావచ్చు. దీనిని తొలిదశలోనే అరికట్టాలి. లేదంటే వూర్తిస్తాయి ఉబ్బసానికి దారి తీయవచ్చు. దుమ్ము, ధూళి, పొగ, ఇంకా ఏది సోకినా వరునగా తుమ్ములు రావడం, ముక్కు చీదడం, కారడం జరుగుతుంటాయి. ఇవన్నీ అలర్జీ-ఆస్తమా లక్షణాలే.

ఆస్తమా ఎవరిలో వస్తుంది : 80శాతం మంది ఉబ్బసం రోగుల్లో ఈ వ్యాధి వారికి 18 సంవత్సరాల వయనులోనే మొదలవుతుంది. ముఖ్యంగా 10 సంవత్సరాలలోపు వయసులో ఉండాల్సిన పెరుగుదల ఆగిపోతుంది. ఆటలు అడలేరు, చదవాలని ఉన్నా చదవలేకపోతారు. యువతీయువకులు స్నేహితులతో సరిగ్గా కలవలేరు. ఆస్తమాకు నాటు వైద్యాల వల్ల పెరిగేది అనారోగ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉబ్బసానికి వైద్యం రోగులను మభ్యపెట్టేదిగా, అనారోగ్యాన్ని ఇంకా పెంచేలా ఉండకూడదు. అశాస్త్రీయ, నకిలీ నాటు వైద్యాలు, చేప మందులు, పౌడర్‌ మందులు, పనరు ఉండలు, రంగునీళ్లు ఉబ్బనంరోగిలో మార్పును కలిగించలేవు. నాటువైద్యానికి, ఉబ్బసానికి ఎలాంటి సంబంధంలేదు.

ఉద్దిసం రోగులు ఆనందంగా, ఆరోగ్యంగా అందరిలా శాస్త్రీయంగా జీవించాలంటే శాస్త్రీయమైన ఏకైక మార్గం ఇన్ హేలర్ థెరపీ మాత్రమే. పూర్తి అవగాహనతో ఈ మందులు వాడగలిగితే ఇవి పూర్తిగా సమర్ధవంతమైనవి. సురక్షితమైనవి. వీటిపై అపోహలు, అనుమానాలు కేవలం వీటి గురించి తెలియక, తెలుసుకోక, తెలియచెప్పకపో వడం వల్ల మాత్రమే ఏర్పడుతాయి. కంప్యూటర్‌ పరీక్షల ద్వారా ఉబ్బసం వ్యాధి తీవ్రతను, ఊపిరితిత్తుల పనితీరును తెలుసుకుని ఏ మందులు, ఏ మోతాదులో, వాడాలో తెలియచేస్తారు. పసి పిల్లలు మొదలుకుని వేలాదిమంది ఉబ్బసం రోగులు ఇన్‌హేలర్‌ థెరపీ ద్వారా ఉబ్బసాన్ని జయించి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.