WFH Life Long: జీవితాంతం ఇళ్లలో ఉండే పని చేసుకోండి.. ఎంప్లాయీస్‌కు బంపర్ ఆఫర్

ప్రైజ్‌ వాటర్‌హౌజ్‌ కూపర్స్‌(పీడబ్ల్యూసీ) తమ కంపెనీ ఉద్యోగులైన 40 వేల యూఎస్‌ క్లయింట్‌ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది.

WFH Life Long: జీవితాంతం ఇళ్లలో ఉండే పని చేసుకోండి.. ఎంప్లాయీస్‌కు బంపర్ ఆఫర్

Wfh Pwc

Updated On : October 2, 2021 / 6:19 PM IST

WFH Life Long: కరోనా విజృంభణ తగ్గడం.. మహమ్మారి ప్రభావం పెద్దగా కనిపించకపోవడంతో సానుకూల పరిస్థితులు ఉన్నాయని భావించి దాదాపు కార్పొరేట్ కంపెనీలన్నీ ఉద్యోగులను ఆఫీసులకు పిలుస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోంకు స్వస్తి చెప్పి నెలల విరామం తర్వాత ఆఫీస్ ముఖం చూస్తున్నారు ఉద్యోగులు. అయితే పీడబ్ల్యూసీ మాత్రం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.

ప్రముఖ అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ ప్రైజ్‌ వాటర్‌హౌజ్‌ కూపర్స్‌(పీడబ్ల్యూసీ) తమ కంపెనీ ఉద్యోగులైన 40 వేల యూఎస్‌ క్లయింట్‌ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. జీవితాంతం ఆఫీసులకు రాకుండానే ఎక్కడి నుంచైనా వర్చువల్ పద్ధతిలో పనిచేసుకోవచ్చని ప్రకటనలో తెలిపింది.

వర్చువల్‌గా పనిచేసే ఉద్యోగులు నెలలో మూడు రోజుల పాటు కచ్చితంగా ముఖ్యమైన క్లయింట్‌ మీటింగ్‌లకోసం, లెర్నింగ్‌ సెషన్ల కోసం ఆఫీసులకు రావాలనే షరతును కొనసాగిస్తున్నారు. పూర్తి సమయం వర్చువల్ వర్క్ అందిస్తున్న తొలి సంస్థగా పీడబ్ల్యూ నిలిచింది. హ్యూమన్‌ రిసోర్స్‌, అకౌంటింగ్‌ విభాగాల్లో ఉద్యోగులు దాదాపు పూర్తి సమయం పనిచేసే అవకాశాన్ని కలిగి ఉన్నారు’ అని పీడబ్య్లూసీ డిప్యూటీ పీపుల్ లీడర్, యోలాండా సీల్స్-కాఫీల్డ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

…………………………………………………………. : పెళ్లిలో తిన్న కేకు ముక్కకు డబ్బులు కట్టమని అతిధి డిమాండ్ చేసిన కొత్తజంట..

ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2లక్షల 84వేల మందితో పనిచేస్తోంది. ఇతర ప్రధాన అకౌంటింగ్ సంస్థలైన డెలాయిట్, కేపీఎమ్‌జీలు కూడా ఉద్యోగులను రిమోట్‌గా పనిచేసేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయి.