Eating Almonds : బాదం తినే విషయంలో అపోహపడుతున్నారా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

బరువు తగ్గడం‌లో బాగా సహాయపడుతుంది, నడుము చుట్టుకొలతను తగ్గించడం‌లో మరియు ఊబకాయం నివారించడం‌లో కూడా బాదం సహాయపడుతుంది.

Eating Almonds : బాదం తినే విషయంలో అపోహపడుతున్నారా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Confused about eating almonds? What do the experts say?

Updated On : November 3, 2022 / 5:03 PM IST

Eating Almonds : బాదం పోషకాలతో నిండి ఉంటుంది. ప్రొటీన్లు, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులను దీనిలో సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం మరియు ఫాస్ఫరస్ వంటి ఖనిజాలకు బాదం నిలయం. వీటిని రోజువారిగా నిర్ణీత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు.

రాత్రంతా నానబెట్టిన బాదం పప్పుల్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. బాదం నానబెట్టడం వల్ల లైపేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తవుతుంది. ఇది మన ఆహారం ద్వారా తీసుకున్న కొవ్వులు కరిగేందుకు దోహదపడుతుంది.

బాదంలోని మెగ్నీషియం రక్తంలోని చక్కెరల్ని అదుపు చేస్తుంది. తద్వారా ఆహారం ఎక్కువగా తినాలన్న కోరిక తగ్గుతుంది. బాదం కాయలు ఎల్‌డి‌ఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడం‌లో సహాయం చేస్తాయి. అదే సమయం‌లో, మంచి రకమైన కొలెస్ట్రాల్ అయిన హెచ్‌డి‌ఎల్ ను బాగా పెంచుతాయి.

భోజనం తర్వాత రక్తం‌లో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి బాదం కాయలు మేలు కలిగిస్తాయి. మధుమేహుల్లో ఆక్సీకరణ ఒత్తిడి, మంట తగ్గించడం‌లో కూడా సహాయపడతాయి. రొమ్ము క్యా‌న్సర్, ప్రొస్టేట్ క్యా‌న్సర్, పురీష క్యా‌న్సర్ మరియు పెద్ద ప్రేగు క్యా‌న్సర్‌లతో కలిపి అనేక రకాల క్యా‌న్సర్ల నుండి మనల్ని రక్షిస్తాయి.

జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం‌లో సహాయం చేయటంతోపాటు పార్కి‌న్స‌న్స్ మరియు అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తూ మతిమరుపును నివారించటంలో సహాయపడుతుంది.

జుట్టు పెరుగుదలకు కావాల్సిన అన్ని రకాల విటమిన్లూ, పోషకాలూ బాదంలలో ఉంటాయి. జుట్టును ఒత్తుగా, గట్టిగా, బలంగా, ధ్రుడంగా పెంచే మెగ్నీషియం, జింక్ వంటివీ, విటమిన్ ఈ దీనిలో ఉన్నాయి. చర్మాన్ని కోమలంగా, అందంగా, ముడతలు లేకుండా చేస్తుంది.