లేటు వయసులో 65ఏళ్ల బామ్మ రికార్డ్
పండండి పాపకు ఈ 65ఏళ్ల వయసు బామ్మ జన్మనిచ్చింది. అత్యంత లేటు వయసులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళగా స్పెయిన్‌కు చెందిన 66 ఏళ్ల మారియా డెల్ కార్మెన్ బౌసదా దెలారా రికార్డులకెక్కింది.
పండండి పాపకు ఈ 65ఏళ్ల వయసు బామ్మ జన్మనిచ్చింది. అత్యంత లేటు వయసులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళగా స్పెయిన్‌కు చెందిన 66 ఏళ్ల మారియా డెల్ కార్మెన్ బౌసదా దెలారా రికార్డులకెక్కింది.
జమ్ముకశ్మీర్ : 65 ఏళ్ల బామ్మ పండంటి పాపాయికి జన్మనిచ్చింది. మెడికల్ హిస్టరీలో ఇలాంటి సంఘటనలు చాలా చాలా అరుదుగా జరుగుతుంటాయి. భర్త హకీం దిన్ వయసు 80 ఏళ్లు.. భార్యకు 65 ఏళ్ల వయసులో కశ్మీర్ ప్రాంతంలోని పూంచ్ ఆసుపత్రిలోని డాక్టర్స్ ఆమెకు డెలివరీ చేయగా పండంటి పాపకు ఈ 65 ఏళ్ల వయసు బామ్మ జన్మనిచ్చింది. ఇది వైద్య చరిత్రలో అత్యంత అరుదైన ఘటన అని డాక్టర్స్ తెలిపారు. సాధారణంగా మహిళలకు మెనోపాజ్ ఏజ్ లో రుతుక్రమం నిలిచిపోతుంది. తరువాత పిల్లలు పుట్టం దాదాపు అసాధ్యం. రుతు క్రమం నిలిచిపోయిన తర్వాత గర్భం దాల్చటం పాపకు జన్మనిచ్చిన ఈ బామ్మకు ఇప్పటికే పదకొండేళ్ల కుమారుడు ఉండటం మరో విశేషం. ఈ పాప ఈ బామ్మగారు రెండో సంతానం.
అత్యంత లేటు వయసులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళగా స్పెయిన్‌కు చెందిన 66 ఏళ్ల మారియా డెల్ కార్మెన్ బౌసదా దెలారా రికార్డులకెక్కింది. మారియా డెల్ ఐవీఎఫ్ విధానంలో గర్భం దాల్చి జన్మనిచ్చింది. మన కశ్మీర్ బామ్మ మాత్రం సహజ సిద్ధంగా బిడ్డకు జన్మనిచ్చింది. కాబట్టి ఆమె పేరు ప్రపంచ రికార్డులకెక్కనుంది.