Corn : వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెంచే మొక్కజొన్న పొత్తులు!

మొక్కజొన్నలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. అధిక రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది. మొక్కజొన్నలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లం వంటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి.

Corn : వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెంచే మొక్కజొన్న పొత్తులు!

Monsoons

Updated On : July 20, 2022 / 3:21 PM IST

Corn : వర్షాకాలం సీజన్ లో మొక్క‌జొన్నవిరివిగా ల‌భిస్తుంది. ఉడ‌క‌బెట్టినా, నిప్పుల‌పై కాల్చుకుని తిన్నా మొక్కజొన్న అంటే ఇష్టపడని వారు ఉండరు. మొక్క‌జొన్న‌లో విట‌మిన్ సి, బ‌యో ఫ్లేవ‌నాయిడ్స్‌, కెరోటినాయిడ్స్‌, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటాయి. అంతేకాకుండా జింక్‌, పాస్ఫ‌ర‌స్‌, మెగ్నిషియం, ఐర‌న్‌లు, ఇత‌ర మిన‌రల్స్ మొక్క‌జొన్న‌లో ఉంటాయి. వర్షకాలంలో వచ్చే వ్యాధుల నుండి రక్షణ కల్పించటంలో మొక్కజొన్న దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెంచటంలో వీటిని మించింది లేదు. తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయయి.

మొక్కజొన్నలో విటమిన్ బి 5, విటమిన్ బి6, జింక్, మాంగనీస్, ఫాస్ఫరస్ లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. రక్తహీనత ససమ్యను పోగొడతాయి. గుండెకు, ఎముకలకు ప్రయోజనకరం. మొక్కజొన్నలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అలాగే ఆకలిని కూడా నియంత్రణలో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి మొక్కజొన్నతీసుకోవటం ఉపయోగకరం.

మొక్కజొన్నలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. అధిక రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది. మొక్కజొన్నలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లం వంటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి ముఖంపై ఉండే ముడతలను పోగొడుతాయి. పీచు, కార్బొహైడ్రేట్లు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల మొక్క‌జొన్న‌ల‌తో శ‌రీరానికి శ‌క్తి బాగా ల‌భిస్తుంది.

మొక్క‌జొన్న‌ల్లో ఐర‌న్ పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతోపాటు ఎర్ర ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తికి ఉప‌యోగ‌ప‌డే ఫోలిక్ యాసిడ్ కూడా మొక్క‌జొన్న‌ల్లో అధికంగానే ఉంటుంది. మొక్క‌జొన్న‌ల‌ను గ‌ర్భిణీలు తింటే పుట్ట‌బోయే పిల్ల‌ల‌కు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రావు. బీటా కెరోటిన్‌, విట‌మిన్- ఎ లు ఉండ‌డం వ‌ల్ల మొక్క‌జొన్న‌ల‌తో కంటి ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.