Coronavirus Stress : కరోనా ఒత్తిడితో తీవ్ర ఆందోళన.. పెరిగిపోతున్న ఆత్మహత్య ఆలోచనలు..
ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. రోజురోజుకీ కొత్త స్ట్రెయిన్లు, వేరియంట్లతో ప్రపంచ దేశాలను వణికిస్తోంది.

Coronavirus Stress Led To Effective Anxiety, Suicidal Thoughts, Study Finds
Coronavirus Stress : ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. రోజురోజుకీ కొత్త స్ట్రెయిన్లు, వేరియంట్లతో ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. కరోనా భయాలతో ప్రపంచ జనాభాను శారీరకంగానే కాదు.. మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది.
కరోనావైరస్ ఒత్తిడితో చాలామందిలో తీవ్ర ఆందోళన, నిరాశ, ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. స్వాన్సీ యూనివర్శిటీకి చెందిన కార్డిఫ్ యూనివర్శిటీ, వేల్స్లోని NHS నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.
కొవిడ్-సంబంధిత ఒత్తిళ్లు, ఆత్మహత్య ఆలోచనలను ప్రేరేపించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సర్వేలో 12వేల మందికిపైగా పాల్గొన్నరు. ఇందులో భాగంగా మొదటి యూకే లాక్‌డౌన్ సమయంలో కరోనాపై తమ అనుభవాలను పంచుకోవాలని వాలంటీర్లను కోరింది. దీనికి సంబంధించిన ఫలితాలను అధ్యయనం వెల్లడించింది.
ఒంటరితనం, గృహహింస సంబంధ సమస్యలు, ఆర్థిక సమస్యలు వంటి అనేక ఒత్తిళ్లు ఆత్మహత్య ఆలోచనలతో ముడిపడి ఉన్నాయని గుర్తించారు. ఇదే తరహా సమస్యలను ఎదుర్కొన్న ప్రతి ఒక్కరిలోనూ ఆత్మహత్య ఆలోచనలు ప్రేరేపించినట్టు కనిపించలేదు. కాకపోతే.. మానసికంగా కృంగదీసినట్టు పరిశోధక బృందం తెలిపింది.