Cucumber : మండే ఎండలకు చల్లదనం కోసం కీరదోస
కీరదోస ముక్కల్ని తినడం వల్ల జూస్ తాగితే కొంతమేర బరువు తగ్గవచ్చు. రోగనిరోధక శక్తిని ఇందులో ఉండే విటమిన్ సి పెంచుతుంది. కీరదోస తీసుకోవడం వల్ల డీహైడ్రేట్ అవకుండా నియంత్రిస్తుంది.

Cucumber
Cucumber : ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు శరీరాన్ని అలసటకు, నీరసానికి గురిచేస్తాయి. వడగాలుల కారణంగా అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయి. వేసవిలో శరీరానికి మేలు చేసే వాటిలో కీరదోస ఒకటి. కీరాలో విటమిన్ కె, ఏ, సి లు లభిస్తాయి. కీరాదోసను జూస్ గా చేసుకుని తాగవచ్చు. జీర్ణ వ్యవస్ధ మెరుగు పరచటంతోపాటు, ఎండవేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది.దాహాన్ని తీర్చటంలో ఉపయోగపడుతుంది.
కీరదోస వేసవిలో తడారిపోతున్న నోటి నుండి వచ్చే దుర్వాసనను లేకుండా చేయటంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎండ వేడి కారణంగా తలనొప్పిగా ఉండే కీరదోస ముక్కలను తినటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చర్మానికి కీరదోస ఎంతో మేలు చేస్తుంది. వేసవి వేడిలో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచటంలో కీరదోస అద్భుతంగా ఉపకరిస్తుంది.
కీరదోస ముక్కల్ని తినడం వల్ల జూస్ తాగితే కొంతమేర బరువు తగ్గవచ్చు. రోగనిరోధక శక్తిని ఇందులో ఉండే విటమిన్ సి పెంచుతుంది. కీరదోస తీసుకోవడం వల్ల డీహైడ్రేట్ అవకుండా నియంత్రిస్తుంది. వేసవిలో రోజూ రాత్రి పడుకునే ముందు కొన్ని కీరదోస ముక్కలు తినడంవల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. శరీరం చల్లబడుతుంది. కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలను నిరోధిస్తుంది. శిరోజాల ఎదుగుదలకు దోసలోని సల్ఫర్ , సిలికాన్ , దోహదపడి జుట్టు ను ఆరోగ్యంగా ఉంచుతుంది. వాతావరణం పొడిగా , వేడిగా ఉన్న రోజుల్లో కీరదోసకాయ జ్యాస్ ఏవైనా ఆకుకూరల రసం తో కలిపి తీసుముంటే చలువ చేస్తుంది . శరీర ఉష్ణోగ్రతను సమతుల్యము గా ఉండేలా చేస్తుంది .