Dried Shrimps : ఎండు రొయ్యలు ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ దరిచేరదు తెలుసా?

రొయ్యల్లో విటమిన్ బీ12 కూడా బాగా ఉంటుంది. దీంతో రక్తనాళాలు శుభ్రపడతాయి. వెయిట్ లాస్ కావాలనుకునేవారు రొయ్యల్ని అప్పుడప్పుడు తీసుకుంటుండాలి. రొయ్యల్లో మెగ్నీషియం కూడా బాగానే ఉంటుంది.

Dried Shrimps : ఎండు రొయ్యలు ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ దరిచేరదు తెలుసా?

Dried shrimps

Dried Shrimps : రొయ్యలతో ఎంతో రుచికరమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. అయితే వీటని తినటం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. చిన్న రొయ్యలు, ఎండబెట్టిన రొయ్య పొట్టులో ప్రోటీన్లు, విటమిన్లు, జింక్, అయోడిన్ లు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువ గా ఉంటాయి. విటమిన్లు, అయోడిన్, ప్రొటీన్లు, జింక్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఎండు రొయ్యలు తింటే బరువు పెరుగుతామన్న భయం అస్సలు ఉండదు. వీటిని తినడం వల్ల బరువు కోల్పోతారు. బరువును తగ్గించుకోవాలని చూస్తున్న వారికి ఇవి మంచి ఎంపిక.

జుట్టు కుదుళ్లు గట్టిగా వుంచడంలో ఎండు రొయ్యలు ఎంతో మేలు చేస్తాయి. రొయ్యల్లో వుండే సెలీనియం క్యాన్సర్‌తో మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు సూచించాయి. రొయ్యల్లో ఉండే జింక్, సెలీనియం మగవారిలో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. వీర్యం కూడా బాగా పెరుగుతుంది. వీర్య కణాల సంఖ్యను పెంచుతాయి. ఎండురొయ్యల్లో విటమిన్ బి12, పొటాషియం, మెగ్నీషియం వున్నాయి. వారానికో, నెలకో ఒకసారి ఎండు రొయ్యలు తింటుంటే మేలు జరుగుతుంది. శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఎండురొయ్యలు సాయం చేస్తాయి.

రొయ్యల్లో విటమిన్ బీ12 కూడా బాగా ఉంటుంది. దీంతో రక్తనాళాలు శుభ్రపడతాయి. వెయిట్ లాస్ కావాలనుకునేవారు రొయ్యల్ని అప్పుడప్పుడు తీసుకుంటుండాలి. రొయ్యల్లో మెగ్నీషియం కూడా బాగానే ఉంటుంది. దీంతో కండరాలు బలపడతాయి. రొయ్యల్లో సెలీనియం బాగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రొయ్యలు తింటే మతిమరుపు నుండి విముక్తి లభిస్తుంది. వీటిని తింటే క్యాల్షియం కూడా బాడీకి బాగా అందుతుంది.

రొయ్యల్లో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. వీటిని తింటే చర్మం నిగనిగలాడిపోతుంది. కాంతివంతంగా మారుతుంది. రొయ్యల్లో ఉండే రాగి ఖనిజం హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెడుతుంది. ముఖ్యంగా జుట్టు ఒత్తుగా, వెంట్రుకలు మందంగా, పట్టుకుచ్చులా మెరిసేలా చేస్తాయి. బలహీనపడిన జుట్టు ను తిరిగి గట్టిగా, పట్టుకుచ్చులా మెరిసి పోయేలా చేయడంలో రొయ్యలు చక్కటి ఔషదంలా పనిచేస్తాయి.