Much Exercise : వ్యాయామాలు అతిగా చేస్తే ఏంజరుగుతుందో తెలుసా?

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది, కానీ ప్రతిరోజూ చేయాలన్న నియమం ఏమీ లేదు. ఒకవేళ ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తుంటే ఓ పరిధికి లోబడి మాత్రమే వ్యాయామాలు ఉండేలా చూసుకోవాలి. వ్యాయామాలు అనేవి కండరాలు ఉత్తేజితమై, మీకు మానసిక ప్రశాంతత లభించేలా ఉండాలి.

Much Exercise : వ్యాయామాలు అతిగా చేస్తే ఏంజరుగుతుందో తెలుసా?

Did you know that too much exercise can make you sick?

Updated On : January 18, 2023 / 3:54 PM IST

Much Exercise : వ్యాయామం వల్ల గుండె ఆరోగ్యం, ఎముకల ఆరోగ్యం, బరువు నియంత్రణ, మానసిక స్థితి మరియు భావోద్వేగ ఆరోగ్యం మరియు మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే అతిగా వ్యాయామం చేయడం ప్రతికూలమైనది. వాస్తవానికి ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇదే విషయాన్ని నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు.

పెద్దలు ప్రతి వారం 150 నుండి 300 నిమిషాల మితమైన శారీరక శ్రమ లేదంటే 75 నుండి 150 నిమిషాల తీవ్రమైన ఏరోబిక్ ఫిజికల్ యాక్టివిటీ మంచిదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. సాధారణంగా వర్కవుట్‌ల మధ్య తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం ,చేస్తున్న వ్యాయామానికి తగిన పోషకాహారం తీసుకోకపోవడం, తగినంత నిద్ర పొకపోవడం, చాలా తీవ్రంగా వ్యాయామం చేయడం ,అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా ఇతర ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పుడు వ్యాయామాలు చేయటం వల్ల కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది, కానీ ప్రతిరోజూ చేయాలన్న నియమం ఏమీ లేదు. ఒకవేళ ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తుంటే ఓ పరిధికి లోబడి మాత్రమే వ్యాయామాలు ఉండేలా చూసుకోవాలి. వ్యాయామాలు అనేవి కండరాలు ఉత్తేజితమై, మీకు మానసిక ప్రశాంతత లభించేలా ఉండాలి. అలా కాకుండా పరిమితికి మించి అధికంగా వ్యాయామాలు చేయటం వల్ల తలనొప్పి, డిప్రెషన్ సహ ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అతిగా వ్యాయామం చేయటం వల్ల ఆ ప్రభావం గుండెపైన పడే ప్రమాదం ఉంటుంది. ఏలాంటి విశ్రాంతి లేకుండా వ్యాయామాలు చేసేవారు కొన్ని సందర్భాల్లో అకస్మిక మరణానికి గురైన సందర్భాలు ఉన్నాయి.

బరువు కోల్పోవడం కోసం వ్యాయామం చేయాలనుకునే వారికి, కీలకమైన పోషకాలను తీసుకోవటం ద్వారా కాలక్రమేణా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అతిగా వ్యాయామం చేసే వారిలో కండరాల నొప్పులు వ్యాయామం తర్వాత కండరాల నొప్పి మూడు రోజులు, గరిష్టంగా నాలుగు రోజులు ఉంటుంది, రోగనిరోధక ప్రతిస్పందన తగ్గడం సాధారణం కంటే ఎక్కువగా అనారోగ్యం బారిన పడటం జరుగుతుంది. అతి వ్యాయామాల వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఇది హృదయనాళ మార్పుకు సంకేతం కావచ్చు.