Vitamin E : విటమిన్ ఇ వల్ల ప్రయోజనాలు తెలుసా?

చర్మసౌందర్య సంరక్షణ కోసం కలబంద తో పాటు ఎన్నో ఉత్పాదనలతో దీన్ని కలుపుతారు. వాటిల్లో ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

Vitamin E : విటమిన్ ఇ వల్ల ప్రయోజనాలు తెలుసా?

Vitamin E

Updated On : December 12, 2021 / 11:44 AM IST

Vitamin E : విటమిన్లలో ఆరోగ్యానికి, సౌందర్యానికి కేరాఫ్ గా విటమిన్ ఇ అని చెప్పవచ్చు. సౌందర్యానికి, ఆరోగ్యానికి కొన్ని విటమిన్లు బాగా పనిచేస్తాయి. శరీరంలో విటమిన్ల పాత్ర కీలకమైనది. శరీరానికి కావల్సిన విటమిన్లలో ఏ ఒక్క విటమిన్ లోపించినా అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.

మహిళల్లో గర్భాధారణ విషయంలో విటమిన్ ఇ ఎంతో అవసరం అవుతుంది. అలాగే పురుషుల్లో వంధ్యత్వం నివారించడానికి విటమిన్ ఇ అవసరం అవుతుంది. హానికరమైన ఫ్రీరాడికల్ అణువును తొలగించడానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఈ విటమిన్ ఇ లో అధికంగా ఉన్నాయి. విటమిన్-ఇ ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు అవి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.

కంటిలో ఏర్పడే శుక్లాలతో పాటు, కంటికి వచ్చే మాక్యూలార్ డీజనరేషన్ అనే వ్యాధిని ఈ విటమిన్ ఇ చాలా వరకూ నివారిస్తుంది. చూపు స్పష్టతకు తోడ్పడుతుంది. వయస్సు పెరిగే కొద్ది మెదడుపై ప్రభావం అల్జైమర్స్ డిసీజ్, మతిమరపు వంటి వ్యాధులను నివారిస్తుంది. మన శరీరంలో జరిగే అనేక కార్యకలాపాలను మెటబాలిక్ యాక్టివిటీస్ అంటారు. ఈ జీవక్రియలు సక్రమంగా జరగడానికి విటమిన్-ఇ దోహదపడుతుంది.

విటమిన్-ఇ ఉండే పదార్థాలు పుష్కలంగా తీసుకునేవారిలో రక్తం త్వరగా గడ్డకట్టే స్వభావం తగ్గుతుంది. దాంతో గుండెజబ్బులు తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది. విటమిన్-ఇ అనేక రకాల క్యాన్సర్ రిస్క్‌లను గణనీయంగా తగ్గిస్తుంది. రొమ్ము క్యాన్సర్, పెద్దపేగుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటివాటిని రాకుండా నివారించటంలో దోహదపడుతుంది. అధిక బరువుతో ఉన్న వారిలో కొవ్వును కరిగించే శక్తి ఈ విటమిన్ ఇ’లో అధికంగా ఉంది. అధిక బరువుతో బాధపడేవారు విటమిన్ ఇ ఉన్న పోషకాలను తీసుకుంటే అధిక బరువును నియంత్రించవచ్చు.

ఊపిరితిత్తులకూ దీనితో ప్రయోజనం చేకూరుతుంది. పొగ తాగే అలవాటు ఉన్నవారికి వచ్చే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ అనే ఊపిరితిత్తుల వ్యాధి రిస్క్‌ను ఇది తగ్గిస్తుంది. ప్రీ-మెనోపాజ్ లక్షణాల నివారణ: మహిళలు ఒక వయసుకు చేరాక రుతుస్రావం ఆగిపోతుంది. రుతుస్రావం ఆగడానికి ముందు మహిళల్లో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. విటమిన్ ఇ కండరాలను దృఢంగా ఉంచి, అవి తేలికగా కదలడానికి తోడ్పడుతుంది.

చర్మసౌందర్య సంరక్షణ కోసం కలబంద తో పాటు ఎన్నో ఉత్పాదనలతో దీన్ని కలుపుతారు. వాటిల్లో ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో వచ్చే అనేక మార్పులను ఇది సమర్థంగా నివారించి దీర్ఘకాలికంగా యౌవనంగా కనిపించడానికి దోహదపడుతుంది. పిల్లల్లో పుట్టుకతో వచ్చే సమస్యలు నివారించడానికి విటమిన్-ఇ ఉపయోగపడుతుంది. మధుమేహగ్రస్తులకు విటమిన్ ఇ చాలా ఉపయోగకరం. మధుమేహ నివారణలో ప్రధాన పాత్ర వహిస్తుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిని నియంత్రిస్తుంది.

విటమిన్ ఇ అధికంగా ఉండే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, నట్స్, ఆకుపచ్చగా ఉండే ఆకుకూరల్లో, గింజ ధాన్యాలలో , తృణధాన్యాలలో , బాదం, వాల్‌నట్స్ వంటి నట్స్, కాటన్ సీడ్ ఆయిల్, పొద్దుతిరుగుడు నూనె, ఆలివ్ ఆయిల్, కుసుమ నూనె, గోధుమ గడ్డి నూనెలో మాంసాహారం, కోడిగుడ్లు, చేపలలో, బ్రకోలీలో మామిడి వంటి పండ్లలో పొద్దతిరుగుడు నూనె, వంటి వాటిని అధికంగా తీసుకోవాలి.