Sweat : ఎంత ఉక్కపోసినా మన శరీరంపై చెమట పట్టని భాగం ఏంటో తెలుసా..?
చెమట లేదా స్వేదం చర్మం నుండి ఉత్పత్తి చేయబడిన ఒకరకమైన స్రావం. ఇవి చర్మంలోని స్వేద గ్రంధుల నుండి తయారవుతుంది. కానీ మన శరీరంపై చెమట పట్టని భాగం ఏంటో మీకు తెలుసా..?

human body not sweating part
human body sweating : ఎండాకాలం వచ్చిందంటే ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. చెమటలు ధారగా కారిపోతుంటాయి.మొహం, చేతులు,కాళ్లు, బాడీ అంతా చెమటలు పడతాయి. అదే వ్యాయామం చేసినా, వాకింగ్ చేసినా, జిమ్ చేసినా శరీరం అంతా చెమట పడుతుంది. కానీ ఎంత ఎండలు మండిపోతున్నా..ఎంత ఉక్కపోసినా మన శరీరంలో చెమట పట్టని భాగం ఉందనే విషయం మీకు తెలుసా…?ఈ విషయం ఎప్పుడన్నా ఆలోచించారా..? మీకీ ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా..? అంటే లేదనే చెబుతాం. విచిత్రం కదా..మన శరీరం గురించి తెలియాలంటే కాస్త సైన్స్ పరిజ్ఞానం ఉండాలి. కానీ శరీరం పైభాగం గురించి తెలియాలంటే కాస్త ఆసక్తి ఉండాలి. అటువంటి ఆసక్తికర విషయమే ఇది. మన శరీరంలో చెమట పట్టని భాగం ఏంటో తెలుసుకుందాం..
ఎంత ఎండాకాలం అయినా ఎంత ఉక్కపోసినా మన శరీరంలో చెమట పట్టని భాగం ఏంటంటే మన పెదాలు (LIps) శరీరం అంతా చెమట కారిపోయినా మన పెదాలకు మాత్రం చెమట పట్టదు. ఎందుకంటే పెదవులలో చెమట గ్రంథులు లేవు. అందుకే చెమట పట్టదు. అందుకే పెదాలు పొడిబారతాయి. దాహం వేస్తే ఇక చెప్పనే అక్కర్లేదు. పెదాలు పొడారిపోయి మనకు తెలియకుండానే మనం నాలుకతో పెదాలు తడుపుకుంటాం. పెదాలలో చెమట గ్రంథులు ఉండవు అందుకే పెదవులకు చెమట పట్టదు.
Laughing Buddha : ఎవరీ లాఫింగ్ బుద్ధా .? ఆయనకు ఎందుకా పేరు వచ్చిందో తెలుసా..?
ఎండాకాలంలో శరీరం ఎక్కువ నీరు అడగుతుంది. ఎండాకాలంలో వేడికి మన శరీరంలో ఉండే నీరు చెమట రూపంలో బయటకొచ్చేస్తుంది. వాతావరణంలో వేడికి శరీరంలో తేమ శాతం తగ్గిపోతుంది. అందుకే డీహైడ్రేషన్ వస్తుంది. వేడికి దాహం వేసి పెదాలు పొడిబారిపోతాయి. నీటి కోసం పరితపిస్తాయి. మనం ఇతర పెదాలు పొడిబారీచబేద పగుళ్లు వస్తాయి. ఫలితంగా వాటి సహత్వాన్ని కోల్పోయి కళావిహీనంగా మారిపోతాయి. శీతాకాలంలో కూడా పెదాలు పగిలిపోతాయి. ముఖంమీద చెమట పట్టి పెదవుల మీదకు కారుతుంది గానీ పెదవులకు మాత్రం చెమట పట్టదు.
పెదాలకు చెమట పట్టదనే విషయం చాలామందికి తెలియదు. ఒకసారి మీ స్నేహితులనో అడిగి చూడండీ..ఏంటబ్బా అంటూ ఆలోచించటం మొదలుపెట్టకపోతే అడగండీ..మన శరీరంపై భాగంలో కనిపించే పెదవుల గురించి పెదవులకు చెమట పట్టదనే విషయం తెలిస్తే నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా..!
కాగా పెదవులతో పాటు మన శరీరంలో చెమట పట్టని మరికొన్ని ప్లేసులు కూడా ఉన్నాయి. external ear canal, nail beds, glans penis, clitoris, and labia minora లలో చెమట గ్రంథులు ఉండవు.