Tomatoes Bad For Arthritis : ఆర్థరైటిస్‌తో బాధపడేవారు ఆహారంలో టమోటాలను తీసుకోకూడదు ఎందుకో తెలుసా ?

ఆర్థరైటిస్ పేషెంట్ రోజూ టొమాటోలు తీసుకుంటే కీళ్ల నొప్పులు వేగంగా పెరుగుతాయి. దీని వల్ల వాపు వస్తుంది. ఇది కాకుండా, టమోటాలు శరీరంలోని ఇతర భాగాలలో వాపును కలిగిస్తాయి.

Tomatoes Bad For Arthritis : ఆర్థరైటిస్‌తో బాధపడేవారు ఆహారంలో టమోటాలను తీసుకోకూడదు ఎందుకో తెలుసా ?

Tomatoes Bad For Arthritis

Tomatoes Bad For Arthritis : ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి. దీనిలో మన రోగనిరోధక వ్యవస్థ మన ఎముకలు, కండరాలపై దాడి చేస్తుంది. నెమ్మదిగా కీళ్ళ పై ప్రభావం చూపుతుంది. వాటి పనితీరు మందగించేలా చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత, ఇది చాలా తీవ్రమైన పరిస్థితిగా మారుతుంది. నడవడం కూడా కష్టమౌతుంది. కీళ్ల వాపుకు కారణమవుతుంది. ఈవ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు కీళ్ల గట్టితనం, వాపు వంటి కొన్ని అసౌకర్య లక్షణాలను కలిగి ఉంటారు.

READ ALSO : Arthritis Problems : ఆర్ధరైటిస్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారంలో చేపలు చేర్చుకోండి!

ఈ పరిస్ధితుల్లో కొన్ని రకాల ఆహారాలు సమస్యలను మరింత ఝటింలం చేస్తాయి. అలవాటి వాటిలో టమోలు కూడా ఒకటని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. టమోటాలు కీళ్ల నొప్పులను మరింత తీవ్రతరం చేస్తాయని ఆర్థరైటిస్ రోగులు టమోటాలు తినకూడదని సూచిస్తున్నారు.

READ ALSO : Rheumatoid Arthritis : రుమటాయిడ్ ఆర్ధరైటిస్ ప్రమాదకరమైనదా!

ఆర్థరైటిస్‌కు టమోటాలు మధ్య సంబంధం ఏంటి?

ఆయుర్వేదంలో వ్యాధికి, శరీరాన్ని బట్టి ఆహారం అందించబడుతుంది. ఉదాహరణకు, ఆర్థరైటిస్ రోగులకు, టొమాటోలు వారి శారీరక ఆరోగ్యాన్ని మరింత ఇబ్బందికరంగా మారుస్తాయి. ఎందుకంటే అవి కీళ్ల నొప్పులను వేగంగా పెంచుతాయి. టొమాటోలో విటమిన్ సి , ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటాయి, దీని వలన కాల్షియం క్షీణిస్తుంది. తద్వారా ఎముకలు లోపలి నుండి బోలుగా మారుతాయి. ఆర్థరైటిస్ పేషెంట్ రోజూ టొమాటోలు తీసుకుంటే కీళ్ల నొప్పులు వేగంగా పెరుగుతాయి. దీని వల్ల వాపు వస్తుంది. ఇది కాకుండా, టమోటాలు శరీరంలోని ఇతర భాగాలలో వాపును కలిగిస్తాయి. ఆర్థరైటిస్ ఫౌండేషన్ ప్రకారం, టొమాటోలు సోలనిన్ అనే రసాయనాన్ని కలిగి ఉంటాయి. ఇది వాపు పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Arthritis : మహిళలకు ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎందుకు ఎక్కువ ?

కూరగాయలు తీసుకోవడం సురక్షితం ;

కీళ్లనొప్పులతో బాధపడుతుంటే ఆకుకూరలను ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి. వెల్లుల్లి, పచ్చి పసుపు, బ్రోకలీ వంటి వాటిని తీసుకోవాలి. వీటితోపాటు ఆహారంలో లవంగం , దాల్చినచెక్క వంటి సుగంధాలను కూడా చేర్చుకోవచ్చు, ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. కాబట్టి, ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ఆర్థరైటిస్ రోగులు టమోటాలను అస్సలు తినకూడదు. ఆకుపచ్చ ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవాలి, ఇది వాపు, నొప్పిని తగ్గిస్తుంది.