Sleep : ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రిస్తున్నారా! ఏం జరుగుతుందంటే?
దక్షిణ, ఉత్తర దిశలోపడుకుంటే యమదూతలు ఉంటారని హిందువుల విశ్వాసం. అలాగే పడమర ,ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవడం వల్ల మృత్యువు సంభవిస్తుందని నమ్ముతారు. పడమర వైపు తల పెట్టి పడుకోవడం వల్ల కాళ్లు తూర్పు వైపు ఉంటాయి. మన కాళ్లు సూర్యునికి చూపిస్తున్న దోషం కలుగుతుంది.

Sleep
Sleep : ఉత్తరం దిక్కున తలపెట్టి నిద్రించరాదని పూర్వం నుండి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే చాలా మంది దీనిని మూడనమ్మకంగా కొట్టిపారేస్తారు. అయితే మరికొందరు మాత్రం నేటికీ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. వాస్తవానికి భూమికి గురుత్వాకర్షణశక్తి ఉందని సైన్స్ చెబుతుంది. భూమికి ఉత్తర దక్షిణాల వైపు నార్త్ పోల్,సౌత్ పోల్ అనే రెండు ధృవాలు అయస్కాంత శక్తిని కలిగి ఉంటాయి. శరీరంలో ఐరన్ ఉంటుంది. ఇనుము,అయస్కాంత పదార్ధాలు ఒకే దిశలో ఉంటే ఆకర్శించుకుంటాయి.రెండు అయస్కాంతం ముక్కలను గమనిస్తే ఒక వైపు అతుక్కునే ఆకర్షణను కలిగి ఉంటాయి. రెండవ వైపు పెడిటే వికర్షణ చెందుతాయి.
ఉత్తరం వైపు తల పెట్టి పడుకోవడం వల్ల ఉత్తర , దక్షిణ దిశలో ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు మన మెదడులో శక్తివంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించి వేస్తాయి. మన శరీరంలో అత్యంత విలువైన శక్తి వంతమైన మెదడు ఉత్తర దిశలో ఉన్న ఆయస్కాంత శక్తి ప్రభావంతో శక్తిని కోల్పోవడం జరిగి తరచు పీడకలలు రావడం, అర్ధరాత్రి మేలుకువ రావడం,సరిగ్గా నిద్ర పట్టక పోవడం,మానసిక ఆందోళనలకు లోను కావాల్సి వస్తుంది.
అంతేకాకుండా దక్షిణ, ఉత్తర దిశలోపడుకుంటే యమదూతలు ఉంటారని హిందువుల విశ్వాసం. అలాగే పడమర ,ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవడం వల్ల మృత్యువు సంభవిస్తుందని నమ్ముతారు. పడమర వైపు తల పెట్టి పడుకోవడం వల్ల కాళ్లు తూర్పు వైపు ఉంటాయి. మన కాళ్లు సూర్యునికి చూపిస్తున్న దోషం కలుగుతుంది. పడమర వైపు తల పెట్టి పడుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. ఉత్తరం దిక్కున తల పెట్టుకోవడం వల్ల పాదాలు దక్షిణ వైపు ఉంటాయి. ఉదయం కళ్ళు తెరవగానే దక్షిణమైనటువంటి యమ స్థానం కనిపిస్తుంది. యమ స్థానం చూడడం మృత్యు ప్రమాదం భావిస్తారు. తూర్పు లేదా దక్షిణం వైపు తల పెట్టుకొని పడుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుందని హిందువులు విశ్వసిస్తారు.
తూర్పు ,పడమర దిశలో పడుకుంటే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. రక్త ప్రసరణ సరిగా జరిగి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉత్తరానికి తలపెట్టి పడుకున్నట్లయితే అయస్కాంత ఆకర్షణ మీ మెదడుపై ఒత్తిడి కలిగిస్తుంది. వయస్సు మళ్ళిన వారిలో రక్తనాళాలు బలహీనమై రక్తస్రావం ఏర్పడుతుంది. పక్షవాతం వచ్చే ముప్పు ఉంటుంది. ఏ దిక్కుకు తల ఉంచి పడుకోవాలనంటే తూర్పు, పడమర, ఈశాన్యం మంచిదని నిపుణులు చెబుతున్నారు. తప్పనిసరైతే తప్ప ఉత్తరం, దక్షిణం తల ఉంచి నిద్రించరాదు..