Alopecia : పేను కొరుకుడుతో బట్టతల వస్తుందా!..

గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నపడటాన్ని పేనుకొరుకుడు అని పిలుస్తారు. నిజానికి ఇది పేను కొరకటం వల్ల ఏర్పడేది కాదు.

Alopecia : పేను కొరుకుడుతో బట్టతల వస్తుందా!..

Head

Updated On : October 30, 2021 / 12:39 PM IST

Alopecia : పేను కొరుకుడు అంటే ఉన్నట్లుండి తలమీద వెంట్రుకలు కొద్దిపాటి ప్రాంతంలో రాలిపోయి చర్మం కనిపిస్తూ ఉంటుంది. ఇది అలర్జీ వల్ల వస్తుందని వైద్యుల అభిప్రాయం. ఈ అలర్జీ తగ్గగానే మళ్ళీ తిరిగి వెంట్రుకలు వస్తాయి. దీనినే పేనుకొరుకుడు అంటారు. అయితే చాలా మంది పేనుకొరుకుడు కారణంగా బట్టతల మాదిరిగా అవుతుందేమో అని అపోహ పడుతుంటారు. ఈ సమస్య ఉన్నవారిలో జుట్టు గుండ్రగా ప్యాచెస్‌ ప్యాచెస్‌ గా రాలిపోతూ ఉంటుంది. అంటే జుట్టు రాలిపోయిన చోట… అది గుండ్రంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఈ సమస్య ఉంటే చికిత్స తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే ఒక్కోసారి జుట్టుమెుత్తం రాలిపోయే ప్రవూదం ఉంది.

గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నపడటాన్ని పేనుకొరుకుడు అని పిలుస్తారు. నిజానికి ఇది పేను కొరకటం వల్ల ఏర్పడేది కాదు. దీన్ని వైద్య పరిభాషలో అలోపేషియం ఏరిమేటా అని పిలుస్తారు. ఈ పేనుకొరుకుడు జనాభాలోని రెండుశాతం మందిలో కనపడుతుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌. వెంట్రుకలకి వ్యతిరేకంగా వాటిలోనే ఆంటీబాడీస్‌ తయారయ్యి అక్కడక్కడ వెంట్రుకలు లేకుండా చేస్తుంది. మానసిక ఆందోళన, థైరాయిడ్‌, డయాబెటిస్‌, బి.పి లాంటి సమస్యలు ఉన్నవాళ్లలో ఎక్కువగా చూస్తుంటాం. ఆడా, మగ అనే తేడాలేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా పేనుకొరుకుడు వస్తుంది. చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా 20 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఇది అంటువ్యాధి మాత్రం కాదు. పేనుకొరుకుడు తలలో, గడ్డం, మీసాలలో రావచ్చు. పేను కొరుకుడు సమస్యను జన్యుపరమైన సమస్యగా గుర్తించారు.

పేను కొరుకుడు నివారణకు ఆయుర్వేదంలో మంచి చిట్కాలు ఉన్నట్లు నిపుణులు సూచిస్తున్నారు. గురివింద గింజలను అరగ దీసి తలకు పట్టిస్తే పేను కొరుకుడు నివారిస్తుంది. రోజూ రెండుసార్లు ఇలాచేస్తుంటే త్వరలోనే మంచి ఫలితం కనపడుతుంది. నెల రోజుల పాటు రోజూ మూడు పూటలా మందార పూలను తలపై రుద్దుతూ ఉంటే పేను కొరుకుడు సమస్య తొలగిపోతుంది. వీలైనంత మేరకు పేను కొరుకుడు సమస్యకు వైద్యుల సూచనలు సలహాలు పాటిస్తూ చికిత్స పొందటమే మేలు.