Eating Egg : రోజు కోడి గుడ్డు తింటే మధుమేహం ముప్పు
మధుమేహం సమస్యలను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. రోజువారి వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి.
Eating Egg : కోడి గుడ్డులో ఎన్నో పోషక పదార్థాలు, ప్రొటీన్లు, ఉంటాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా రోజుకు ఒక గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఒక గుడ్డు తినడం వల్ల 70-80 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్లు, 5 గ్రాముల కొవ్వులు, 190 గ్రాముల కొలెస్ట్రాల్ శరీరానికి లభిస్తాయి. గుడ్డులో లవణాలతో పాటు ఫాస్పరస్, అయోడిన్, సెలీనియం, ఐరన్, జింక్ ఉంటాయి. గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి. అలాగే నరాల బలహీనత ఉన్న వారు రోజూ గుడ్డును తీసుకోవాలి. ఇది నరాల బలహీనత తగ్గేలా చేస్తుంది. గుడ్లు అంటే ఇష్టపడని వారు ఉండరు. ఎగ్ ఫ్రైగా, ఉడకబెట్టి, ఆమ్లెట్ గా వివిధ రూపాల్లో ఆహారంగా తీసుకుంటారు.
గుడ్డులో క్షణాల్లో కూరను తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కూడా చాలా ఈజీ గా ఉంటుంది. ఇటీవలి కాలంలో గుడ్డును ఆహారంగా తీసుకోవటంపై అనేక సందేహాలు, అపోహలు నెలకొన్నాయి. గుడ్లు తినడం వల్ల మధుమేహం ముప్పు పెరుగుతుందని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనం ద్వారా తెలుస్తుంది. గుడ్డు వినియోగం క్రమంగా గుడ్డు తినేవారి సంఖ్య గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో రెట్టింపు అయిందని అధ్యయనంలో తేలింది. దీర్ఘకాల గుడ్డు వినియోగం రోజుకు 38 గ్రాముల కంటే ఎక్కువ తినేవారిలో మధుమేహం ప్రమాదాన్ని 25 శాతం పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. అలాగే, క్రమం తప్పకుండా 50 గ్రాముల కంటే ఎక్కువ గుడ్డు తినేవారిలో మధుమేహం వచ్చే అవకాశం 60 శాతం ఎక్కువని తేలింది.
మధుమేహం సమస్యలను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. రోజువారి వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. రోజుకు ఒక గుడ్డు తినేవారు ముందుగా డైటీషియన్ సలహా తీసుకోవటం మంచిది. ఎందుకంటే శరీరంలో కొవ్వు, రక్తపోటు, చక్కెర తో బాధపడుతున్నవారు రోజుకు ఒక గుడ్డు తినటం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ముందస్తుగా డైటీషియన్ ను సంప్రదించటం ఉత్తమం. రోజు గుడ్డు తీసుకునేవారు రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవటం మంచిది.
చైనీస్ మెడికల్ యూనివర్శిటీ మరియు ఖతార్ విశ్వవిద్యాలయాల అధ్యయనం ప్రకారం, రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం 60 శాతం పెరుగుతుందని తేలటం ఒకింత ఆందోళన కలిగిస్తుంది. గుడ్డు మితంగా తింటే ఆరోగ్యానికి మంచిది. రోజూ రెండు కంటే ఎక్కువ కోడిగుడ్లు తింటే గుండెకు ముప్పని మరో తాజా సర్వేలో బయపడింది. కోడిగుడ్లలో కొవ్వు ఉంటుంది. దీనిని రోజూ అతిగా తీసుకుంటే చేటు తప్పదు. కాబట్టి కోడి గుడ్డు తినే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది.