Instant Noodles : వాటిని రోజు తింటే జీర్ణ సమస్యలు, రక్తపోటు తప్పదు?
ప్రొటీన్లతో నిండిన ఆహారం తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. అదేవిధంగా ఫైబర్ జీర్ణాశయాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కువ నూడుల్స్ తింటే జీర్ణవ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి.

Instant Noodles :
Instant Noodles : మారిన జీవనశైలి,బిజీ లైఫ్ లో సమయం లేకపోవటంతో ఇన్ స్టెంట్ ఆహారాల మీద ఆధారపడటం అలవాటుగా మారింది. ఈ ఇన్ స్టెంట్ ఆహారాలలో నూడుల్స్ కూడా ఒకటి. చిన్నల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఆహారం. వీటిని తయారుచేయడానికి ఎక్కువ సమయం పట్టకపోవటంతో త్వరగా పూర్తయ్యే నూడుల్స్ ను ఆహారంగా తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ ఇన్‌స్టంట్ నూడుల్స్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
నూడుల్స్ తయారిలో నూనెను ఎక్కువగా వాడతారు.అంతేకాక కార్బో హైడ్రేడ్స్ ఎక్కువగా ఉండుట వలన షుగర్ లెవల్స్ కూడా పెరుగుతాయి. నూడుల్స్ లో ఎటువంటి ప్రోటీన్స్,మినరల్స్ ఉండవు. ఇన్‌స్టంట్ నూడుల్స్‌లో సాధారణంగా పామాయిల్‌తో పాటు పిండి, పిండి, నీరు, ఉప్పు, కాన్సుయి, సోడియం కార్బోనేట్, పొటాషియం కార్బోనేట్ ఉంటాయి. ఇది కాకుండా మసాలాలు, ఉప్పు, మోనోసోడియం గ్లుటామేట్ కూడా ఉంటాయి. మోనోసోడియం గ్లుటామేట్’ అనే రసాయన సమ్మేళనం శరీరంలోకి ప్రవేశించడం వల్ల, రక్తపోటుకు కారణమవుతుంది. మోతాదుకు మించి సోడియం తీసుకోవడం వల్ల క్యాన్సర్, స్ట్రోక్, గుండె జబ్బులు, అధిక రక్తపోటుతో పాటు మూత్రపిండాల సమస్యలు తలెత్తుతాయి. వాటినిలోని హానికరమైన పదార్థాల కారణంగా మెటబాలిజం రేటు తగ్గుతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు.
మనం ఎక్కువ నూడుల్స్ తింటే జీర్ణవ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. నూడుల్స్ తయారీ సరిగా లేకపోతే పొట్టలో అసౌకర్యం ఏర్పడి అజీర్ణ సమస్యలు వస్తాయి. నూడుల్స్ తినాలని అనుకున్నప్పుడు వాటిని తయారుచేసేటప్పుడు ఆకుకూరలు,బీన్స్,బఠాణి వంటివి వేస్తె ఆరోగ్యకరమైన ఆహారంగా మారుతుంది.మీరు నాన్ వెజ్ తినేవారు అయితే నూడుల్స్ తయారు చేసినప్పుడు గుడ్లు, మాంసం, చికెన్ వంటివి కూడా వేసుకోవచ్చు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు నూడుల్స్ తింటే మంచిది. రాత్రివేళ తీసుకునే ఆహారంలో నూడుల్స్ వంటి వాటిని తీసుకోకపోవటమే మంచిది. కొవ్వు పదార్ధాలు, మసాలా దినుసులు తక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవటం మంచిది.