Elon Musk : క్రిస్మస్ వేళ ‘ఓజెంపిక్ శాంటా’గా ఎలన్ మస్క్.. ‘మౌంజారో’తోనే బరువు తగ్గానన్న టెస్లా బాస్..!
Elon Musk : ఎలన్ మస్క్ క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ ఫోటోను ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. ఎరుపు రంగు శాంతా క్లాజ్ దుస్తులు ధరించి, టెస్లా సీఈఓ పెద్ద తెల్లటి గడ్డంతో క్రిస్మస్ టోపీతో కనిపించాడు.

Elon Musk reveals taking Mounjaro for weight loss
Elon Musk : ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ ఫొటోను షేర్ చేశాడు. ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఎరుపు రంగు శాంతా క్లాజ్ దుస్తులు ధరించి, టెస్లా సీఈఓ అలంకరించిన పెద్ద క్రిస్మస్ చెట్టు ముందు పోజులిచ్చాడు. అంతేకాదు.. పెద్ద తెల్లటి గడ్డంతో క్రిస్మస్ టోపీతో సరికొత్తగా కనిపించాడు.
మస్క్ ఆ ఫొటోను (X )లో షేర్ చేయడంతో వైరల్ అయింది. అలాగే, తనను తాను “ఓజెంపిక్ శాంటా” అని కూడా చెప్పుకున్నాడు. ఎందుకంటే.. గతంలో టైప్-2 డయాబెటిస్ బారిన పడిన ఆయన తాను మధుమేహంతో పాటు బరువు తగ్గడానికి ఈ ఓజెంపిక్ అనే మందును వాడాడు. ఈ మందు వాడే ముందు దీని గురించి డయాబెటిక్ బాధితులకు సూచించాడు.
టైప్-2 మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయిన ప్రముఖులలో మస్క్ మామ ఒకరు. ఓజెంపిక్‌కు బదులుగా.. ఆయన దీర్ఘకాలిక వ్యాధికి చికిత్స కోసం మౌంజరోను తీసుకుంటాడు. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సాయపడుతుంది. “సాంకేతికంగా చెప్పాలంటే.. మౌంజారో, కానీ దానికి అదే రింగ్ లేదు,” అని స్పేస్ఎక్స్ సీఈఓ ఎక్స్ పోస్టులో చమత్కరించాడు.
మౌంజారో ఇటీవల యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)చే ఆమోదించింది. (Zepbound) బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు. ఊబకాయం ఉన్న రోగులకు ఈ మందును సూచిస్తారు. ఈ నెల ప్రారంభంలో, ఇలాంటి బరువు తగ్గించే మందులకు మస్క్ పెద్దపీట వేశారు. “అమెరికన్ల ఆరోగ్యం, జీవితకాలం, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి (GLP-1 డ్రగ్స్) ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో తయారు చేయడం కన్నా మరేమీ చేయదు. ఇంకేమీ దగ్గరగా లేదు” అని అన్నారు.
Ozempic Santa pic.twitter.com/7YECSNpWoz
— Elon Musk (@elonmusk) December 26, 2024
అయినప్పటికీ, అమెరికన్లు బరువును విజయవంతంగా తగ్గించడానికి GLP-1 నిరోధకాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 53ఏళ్ల మస్క్.. తాను ఓజెంపిక్ మెడిసిన్ కన్నా మౌంజారో మెడిషన్ అమితంగా ఇష్టపడతారని పేర్కొన్నాడు. ఎందుకంటే.. ఈ ఔషధం అధిక మోతాదులో తీసుకోవడంతో తాను వేగంగా బరువు తగ్గినట్టు చెప్పుకొచ్చాడు.
“మౌంజారో అనేది తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉంది. చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది” అని టెస్లా అధినేత చెప్పారు. స్థూలకాయాన్ని ఎదుర్కోవడానికి జీఎల్పీ-1 ఇన్హిబిటర్లను విస్తృతంగా ఉపయోగించాలని మస్క్ చాలా కాలంగా చెబుతున్నారు. అయితే, ఇలాంటి ఔషధాల వినియోగాన్ని ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ తీవ్రంగా విభేదించారు. 70ఏళ్ల కెన్నెడీ అమెరికన్లు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఊబకాయం సంక్షోభాన్ని నిర్వహించడానికి మరింత ఖర్చుతో కూడుకున్న మార్గంగా వాదించారు.
How it started vs how it’s going pic.twitter.com/fQeCQ7zCPC
— Elon Musk (@elonmusk) December 26, 2024
జీఎల్పీ-1 ఇన్హిబిటర్లకు మస్క్ మద్దతుగా నిలవడంతో అనేక మంది నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. వారిలో ఒకరైన 69ఏళ్ల హస్యనటుడు హూపి గోల్డ్‌బెర్గ్ కూడా మౌంజరో తీసుకున్నట్లు అంగీకరించాడు. అయితే, ఈ మౌంజారో తీసుకోవడం ప్రారంభించే ముందు రెండేళ్ల క్రితం తన బరువు 300 పౌండ్లకు చేరుకుందని వెల్లడించిన తర్వాత భారీగా తగ్గిన ఫొటోను రివీల్ చేశారు. తనకు పని చేయడం ఇష్టం లేదని బహిరంగంగా ప్రకటించిన మస్క్.. 2022లో మరో జీఎల్పీ-1 ఇన్హిబిటర్ (Wegovy)ని ఉపయోగించినట్లు గతంలో వెల్లడించాడు.
Read Also : RJ Simran Singh : పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆర్‌జే సిమ్రాన్ సింగ్ అనుమానాస్పద మృతి..