Sugary Foods : చక్కెర పదార్ధాలు అతిగా తీసుకుంటే మెదడు పనితీరులో మందగమనం!
చక్కెర ఆహారాలు అతిగా తీసుకోవటం వల్ల ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది. మానవులలో, అధిక-గ్లైసెమిక్ ఆహారాలు మెదడులోని ప్రాంతాలను సక్రియం చేస్తాయి తక్కువ-గ్లైసెమిక్ ఆహారాల కంటే ఆకలిని పెంచుతాయి.

Excessive consumption of sugary foods slows down brain function!
Sugary Foods : మెదడు మానవ శరీరంలోని ఇతర అవయవాల కంటే ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. గ్లూకోజ్ దాని ప్రధాన ఇంధన వనరు. అయితే ఆహారంలో అధిక మొత్తంలో చక్కెరలు తీసుకున్నప్పుడు మెదడుపై తీవ్రమైన ప్రభావం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీపి పదార్ధాలు మనిషి మెదడులో వ్యసనం వంటి ప్రభావాలను ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల స్వీయ నియంత్రణ కోల్పోయి అతిగా తినటం అలవాటవుతుంది. దీంతో బరువు పెరగటానికి దారితీస్తుంది. కొద్దిపాటి చక్కెర తీసుకోవటం తదుపరి మరింత కోరికను ప్రేరేపించేదిగా చేస్తుంది.
చక్కెర పదార్ధాలు అతిగా తినటం వల్ల మెదడు ఆలోచన సామార్థ్యాన్ని క్రమేపి కోల్పోతుంది. తీపి పదార్థాలు మెదడు పనితీరును నెమ్మదింపచేస్తాయి. తెలివి తేటల మీద అది ప్రభావాన్ని చూపిస్తుంది. చక్కెరతోకూడిన ఆహారపదార్థాలను సాధ్యమైనంత మేరకు తీసుకోకపోవడమే ఉత్తమం. చక్కెరతో చేసే తీపి పదార్థాలను, తీపి వంటకాలను తీసుకోవడం తగ్గించాలి. కనుక సాధ్యమైనంత వరకు చక్కెరకు దూరంగా ఉండాలి.
చక్కెర ఆహారాలు అతిగా తీసుకోవటం వల్ల ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది. మానవులలో, అధిక-గ్లైసెమిక్ ఆహారాలు మెదడులోని ప్రాంతాలను సక్రియం చేస్తాయి తక్కువ-గ్లైసెమిక్ ఆహారాల కంటే ఆకలిని పెంచుతాయి. రక్తంలో గ్లూకోజ్‌లో అధిక పెరుగుదలకు కారణమయ్యే ఆహారాలు మెదడులో ఎక్కువ వ్యసనాన్ని కలిగిస్తాయి. చక్కెర, ఉప్పు మరియు కొవ్వు అధికంగా ఉండే తక్కువ-పోషక ఆహారాలు తీసుకోవటం అన్నది క్రమంగా వ్యసనంగా మారేలా చేస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మెదడుపై చక్కెర ప్రతికూల ప్రభావాలతో పాటు, ఇది మొత్తం శరీరానికి కూడా హాని చేస్తుంది.
చక్కెర పదార్ధాలు అధిక మోతాడులో తినటం వల్ల జ్ఞాపకశక్తి లోపిస్తుంది. పనిపై శ్రద్ధ పెట్టటంలో సమస్యలు ఎదురవుతాయి. మెదడులో వాపు, మెదడులో మంట, జ్ఞాపకశక్తి లోపం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. మానసిక స్థితిపై దాని ప్రభావం ఉంటుంది. ఒత్తిడి సైతం చక్కెర పదార్ధాలను తినటం వల్ల పెరుగుతుంది. కాబట్టి చక్కెర పదార్ధాలను తీసుకునే సందర్భంలో ఆచితూచి వ్యవహరించటం మంచిది. కొద్ది మోతాదుకు పరిమితమైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవని గ్రహించటం మంచిది. ఇది ఆరోగ్యానికి మేలు.