మగాళ్లతో పోలిస్తే.. మహిళల బట్టలెందుకింత పలచన?

ట్రెండ్ మారుతోంది.. ఫ్యాషన్ ట్రెండ్‌కు తగినట్టుగా జీవన విధానంలో కూడా వేగంగా సరికొత్త మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అయిపోయింది. ఆడా మగా అనే తేడా లేదు.. ప్రతిఒక్కరూ మోడ్రాన్ కల్చర్‌కు అలవాటు పడిపోయారు. ప్రత్యేకించి ఫ్యాషన్ ట్రెండ్.. ధరించే దుస్తులదే అనడంలో సందేహం అక్కర్లేదు. షాపింగ్ వెళ్లడం.. ఖరీదైన గిఫ్ట్‌లు, వెరైటీ డ్రెస్సులను కొనుగోలు చేయడం ట్రెండ్‌గా మారిపోయింది. ఇప్పుడుచ్చే మోడ్రాన్ దుస్తులన్నీ ఎంతో ఆకర్షణీయంగా ఉండటంతో యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది.
మహిళలకే ప్రాధాన్యత :
ఒకప్పుడు అబ్బాయిలే జీన్స్ వేసుకునేవారు. ఇప్పుడు అమ్మాయిల కోసం ప్రత్యేకమైన డిజైన్లతో జీన్స్ వంటి ఎన్నో డిజైన్ల దుస్తులు మార్కెట్లోకి వచ్చేశాయి. అబ్బాయిలు కావొచ్చు.. అమ్మాయిలు కావొచ్చు.. డ్రెస్ డిజైన్ల విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదు. అందుకే వినియోగదారుల అభిరుచి తగట్టుగానే ఫ్యాబ్రిక్ దుస్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి పలు దుస్తుల కంపెనీలు.
అసలు ఫ్యాబ్రిక్ దుస్తుల విషయంలో మహిళలకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. మహిళల దుస్తులకు పురుషుల దుస్తులకు మధ్య పెద్దగా వ్యత్యాసం ఉండదని, ధరలు, బట్టల డిజైన్ కాస్త దగ్గరగా ఉంటుందని తెలుసు. అయితే, ఫ్యాబ్రిక్ దుస్తుల తయారీ కంపెనీల్లో ఎక్కువగా మహిళలకు సంబంధించి బ్లౌజులు, టీషర్టులే ఉంటాయి. ఇవన్నీ చాలా పలచగా ఉంటాయి.
ఫాస్ట్ ఫ్యాషన్ ట్రెండే కారణం :
అదే పురుషుల దుస్తులయితే కాస్త మందంగా ఉండి బరువుగా ఉంటాయి కూడా. పురుషులతో పోలిస్తే.. మహిళల దుస్తులు ఎందుకు పలచగా ఉంటాయనడానికి ఫాస్ట్ ఫ్యాషన్ కారణమని చెప్పవచ్చు. అందుకే కాబోలు.. మహిళ దుస్తుల్లో ఎక్కువ శాతం పలచని దుస్తుల వాడకమే ఫాస్ట్ ట్రెండ్ గా మారింది. మహిళల దుస్తులపై పలచగా ఉండే బట్టను ఉపయోగించే ధోరణి ఫాస్ట్ ఫ్యాషన్ పెరుగుదలతో ముడిపడి ఉంటుందని ఓ నివేదిక పేర్కొంది.
ప్రత్యేకించి మహిళల కోసం పలచని దుస్తులను డిజైన్ చేసే.. H&M, Zara వంటి ఎన్నో కంపెనీలు చౌకైన ధరకే అందిస్తున్నాయి. మహిళల ఫ్యాబ్రిక్ దుస్తులు ఎంతో పలచగా ఉంటాయి. ఫాస్ట్ ఫ్యాషన్ ఎందుకింత చౌకగా మారిందంటే? దీని అర్థం.. చౌకైన, సింథటిక్ పదార్థాలను ఉపయోగించడం, అలాగే వేతనాలు తక్కువగా ఉన్న ప్రదేశాలలో బట్టలు తయారు చేయడం, తయారీ ప్రక్రియ కూడా అధునాతనమైనదిగా ఉంటుంది.
ఫ్యాబ్రికేనా.. టెస్ట్ చేయండిలా :
చౌకైన ధరకే లభించే ఫ్యాబ్రిక్ దుస్తులను ఎక్కువ సార్లు ఉతికితే వెంటనే పాడైపోతాయి. అందుకే మార్కెట్లో ఫాబ్రిక్ దుస్తులు చౌకైన ధరకే లభిస్తాయని జీరో వేస్ట్ ఫ్యాషన్ డిజైన్ సహా రచయిత టిమో రిస్సానెన్ అంటున్నారు. మీరు కొనుగోలు చేసే దుస్తుల నాణ్యత కూడా ఎలా ఉందో చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. ఈసారి ఏదైనా కొత్త టాప్ డ్రెస్ కొనుగోలు చేసే సమయంలో ఫ్యాబ్రిక్ టచ్ చేసి చూడండి. మీకే తెలుస్తుంది.. అది ఎంత పలచగా.. పెళుసుగానూ లేదా మృదువుగానూ, ధృడంగా ఉందో చెక్ చేసుకోవచ్చు.
‘ఆ దుస్తుల్లో ఎక్కువ ఫైబర్ ఉంటే, అది ఎక్కువకాలం ఉంటుంది అని రిస్సానెన్ చెప్పారు. దీన్ని పరీక్షించడానికి, మీరు ఒక వస్త్రాన్ని కాంతి దగ్గరా పట్టుకుని చూడవచ్చు. తద్వారా దాని బట్ట ఎంత మందంగా ఉందో, లేదా దాని నేత ఎంత దట్టంగా ఉంటుందో మీరు తెలుసుకోవచ్చు.
ఒక చిన్న బిట్ బట్టను సాగదీయడం (ముఖ్యంగా అది అల్లిన బట్ట అయితే) కొనడానికి విలువైనదేనా అని చెప్పడానికి ఇదో మంచి మార్గమని రిస్సానెన్ తెలిపారు. అలా సాగదీసిన బట్ట.. అసలు ఆకృతికి తిరిగి బౌన్స్ కాకుండా అలానే ఉంటే మాత్రం అది ఎక్కువ కాలం మన్నికగా నిలిచే మంచి టాప్ కాదనే విషయాన్ని గుర్తించాలని రిస్సానెన్ చెప్పారు.