Glowing Skin : ముఖంపై నల్లని మచ్చలు తొలిగి పోవాలంటే ఈ చిట్కా పాటిస్తే చాలు !
మార్కెట్లో లభించే వివిధ రకాల ఫేస్ క్రీమ్ లను పెద్ద మొత్తంలో ఖర్చుచేసి కొనుగోలు చేసి ప్రయత్నించి చూస్తుంటారు. అయినా ఏమాత్రం ఫలితం ఉండదు. అయితే అలా కాకుండా మన ఇంటిలో దొరికే సహజసిద్దమైన పదార్ధాలతో సులభంగా మొటిమలు,నల్ల మచ్చల వంటి సమస్యల నుండి బయట పడవచ్చు.

Coffee Face Masks
Glowing Skin : ముఖంపై నల్ల మచ్చలు అందంగా కనిపించాలనుకునే వారికి కాస్త ఇబ్బందినే కలిగిస్తాయి. అలాంటి వారు నలుగురికి ముఖాన్ని చూపించటానికి బిడియపడుతుంటారు. చర్మంపై మృతకణాలు సైతం చర్మాన్ని కాంతి విహీనంగా మారుస్తాయి. వయసు పెరిగే కొద్దీ కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ముఖం మీద వచ్చే నల్లని మచ్చలు, మొటిమలు,మురికి వంటి వాటిని తొలగించుకునేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖం కాంతి వంతంగా మారాలని కోరుకుంటుంటారు.
READ ALSO : Bindi Benifits : మహిళలు బొట్టు పెట్టుకుంటే చర్మం యవ్వనంగా ఉంటుందట.. నిపుణులు చెబుతున్నారు
ఇందుకోసం మార్కెట్లో లభించే వివిధ రకాల ఫేస్ క్రీమ్ లను పెద్ద మొత్తంలో ఖర్చుచేసి కొనుగోలు చేసి ప్రయత్నించి చూస్తుంటారు. అయినా ఏమాత్రం ఫలితం ఉండదు. అయితే అలా కాకుండా మన ఇంటిలో దొరికే సహజసిద్దమైన పదార్ధాలతో సులభంగా మొటిమలు,నల్ల మచ్చల వంటి సమస్యల నుండి బయట పడవచ్చు. అదెలాగో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ముఖం పై నల్లమచ్చలు తొలగించే చిట్కా ;
ఒక గిన్నెలో ఒక స్పూన్ కాఫీ పొడి వేయాలి. అందులో 4 స్పూన్ల పచ్చిపాలు వేసి బాగా కలపాలి. అనంతరం ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద ఉంచి రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుతూ పేస్ట్ లా తయారు చేసుకోవాలి. తరువాత దానిని క్రిందికి దించుకొని చల్లారనివ్వాలి.
ఒక డబ్బాలో ఉంచుకుని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖం పై రాసుకున్న తరువాత పది నిమిషాలు అలాగే వదిలేయాలి. అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం మీద ఉన్న మృతకణాలు, జిడ్డు, మురికి, నలుపు మచ్చలు, మొటిమలు అన్నీ తొలగిపోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.
READ ALSO : Best Skin Oils : ఈ ఆయిల్స్ వాడితే మీ చర్మం హైడ్రేట్ గా ఉంటుంది!
ప్రధానంగా కాఫీలో ఉండే కెఫీన్ చర్మ టిష్యూ రిపేర్ కి సహాయపడుతుంది. స్కిన్ మృదువుగా కాంతివంతంగా మెరుస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేయటంలో కాఫీ ఉపకరిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాఫీ పొడి కూడా అందరికి అందుబాటులో తక్కువ ఖర్చుతో సమకూర్చుకోవచ్చు. అలాగే కార్న్ ఫ్లోర్ ముఖం పై మృత కణాలను తొలగించటంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. పాలల్లో ఉన్న పోషకాలు చర్మానికి అవసరమైన పోషణనిస్తుంది.
గమనిక: అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వైద్యులను సంప్రదించి చికిత్స పొందటం మంచిది.