DNA Genetic Secret : కొంతమంది 105ఏళ్లు దాటినా జీవించడానికి వెనుక జన్యు రహస్యాన్ని కనిపెట్టేశారు!

సాధారణంగా మనిషి ఆయుష్షు.. వందేళ్లు అంటారు.. కానీ, చాలామంది సెంచరీ దాటి కూడా జీవిస్తున్నారు. 100ఏళ్ల నుంచి 105 వయస్సు.. 110 ఏళ్ల వరకు బతికినవాళ్లు కూడా ఉన్నారు. అయితే అందరూ 100ఏళ్లకు పైగా జీవించడమంటే అది చాలా అదృష్టంగా భావిస్తుంటారు..

DNA Genetic Secret : కొంతమంది 105ఏళ్లు దాటినా జీవించడానికి వెనుక జన్యు రహస్యాన్ని కనిపెట్టేశారు!

The Genetic Secret Behind Why Some People Can Live Past 105 Years

Updated On : May 8, 2021 / 11:41 AM IST

Genetic secret behind some people can live past 105 Years : సాధారణంగా మనిషి ఆయుష్షు.. వందేళ్లు అంటారు.. కానీ, చాలామంది సెంచరీ దాటి కూడా జీవిస్తున్నారు. 100ఏళ్ల నుంచి 105 వయస్సు.. 110 ఏళ్ల వరకు బతికినవాళ్లు కూడా ఉన్నారు. అయితే అందరూ 100ఏళ్లకు పైగా జీవించడమంటే అది చాలా అదృష్టంగా భావిస్తుంటారు.. ఒక మనిషి వందేళ్లకు పైగా జీవించడానికి దాని వెనుక ఉన్న జన్యు రహస్యం ఏంటో సైంటిస్టులు కనిపెట్టేశారు.. జన్యుపరంగా మార్పుల వల్లే కొంతమంది 105 ఏళ్ల దాటి జీవించగలగుతున్నారట..

ప్రత్యేకించి వారిలోని జన్యువులే వారి డీఎన్ఏ దెబ్బతినకుండా అడ్డుకుంటున్నాయట.. ఒకవేళ డీఎన్ఏ దెబ్బతినే పరిస్థితి ఏర్పడినా వారి శరీరంలోని జన్యువులు డీఎన్ఏను తిరిగి రిఫేర్ చేస్తుంటాయని కొత్త అధ్యయనంలో తేలింది. మనిషి సుదీర్ఘ జీవితానికి సంబంధించి జన్యుపరమైన రహస్యాన్ని కనుగొన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. కొంతమంది ఇతరులకన్నా ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తారు? అనేదానిపై అధ్యయనం చేయగా.. జన్యువు రహాస్యానికి సంబంధించి అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని అంటున్నారు.

105ఏళ్ల నుంచి 110 ఏళ్ల వయస్సు దీర్ఘాయువు కలిగిన వ్యక్తులపై పరిశోధకులు వారి జన్యువులను డీకోడ్ చేసి విశ్లేషించారు. మనిషి జీవిత కాలంపై అధ్యయనం జరిపినమొదటి పరిశోధన ఇదేనని అధ్యయన నిపుణులు చెబుతున్నారు. వృద్ధాప్యం అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. 105 ఏళ్లు దాటినవారిని జన్యుశాస్త్రం అధ్యయనం చేసేందుకు పరిశోధకులు ఎంచుకున్నారు. ఇటలీలోని అదే ప్రాంతానికి చెందిన యువకులతో పోల్చి చూశారు. చిన్న వయస్సులో ఉన్నవారిలో కంటే వృద్ధాప్యంలో ఉన్నవారిలో అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి.. అందుకే వయస్సు-సంబంధిత వ్యాధుల ప్రభావం వారిపై ఏ స్థాయిలో ఉంటుందో కనుగొనే ప్రయత్నం చేశారు.

వృద్ధాప్యంలో దీర్ఘకాలంపాటు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించేవారిలో ఎలాంటి జన్యువులు ఉన్నాయో పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇటలీకి చెందిన 105 ఏళ్ల నుంచి 110 ఏళ్ల వయస్సు దాటిన వారిలో ప్రత్యేకించి 81 సెమీ-సూపర్సెంటెనరియన్ల (semi-supercentenarians) (105+ వయస్సు) జన్యువులు, సూపర్సెంటెనరియన్ల (supercentenarians), (110 + వయస్సు ) జన్యువులు ఉన్నట్టు గుర్తించారు. వీరి జన్యువులను సగటున 67 ఏళ్ల వయస్సు గల 36 మంది ఆరోగ్యకరమైన వ్యక్తుల జన్యువులతో పోల్చారు. ఈ జనెటిక్ వేరియంట్లు కలిగిన వృద్ధుల్లో డీఎన్ఏ మ్యుటేషన్లు కాకుండా అడ్డుకుంటున్నాయని, అలాగే డీఎన్ఏ మెకానిజం దానింతట అదే రిఫేర్ చేసుకుంటుందని గుర్తించారు.