Toothache : ఈ అద్భుతమైన ఆకు సహాయంతో పంటి నొప్పిని పొగొట్టుకోండి !

దంతాల కోసం జామ ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. లేదంటే జామాకుల రసాన్ని ఉపయోగించవచ్చు. జామాకుల రసాన్ని తయారు చేయటానికి ముందుగా కొన్ని తాజా జామ ఆకులను తీసుకోవాలి. కొన్ని పిప్లీ, లవంగాలు, దానికి కొద్దిగా ఉప్పు కూడా కలపాలి. వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను దంతాలకు అప్లై చేయాలి.

Toothache : ఈ అద్భుతమైన ఆకు సహాయంతో పంటి నొప్పిని పొగొట్టుకోండి !

Guava leaves

Updated On : May 8, 2023 / 3:53 PM IST

Toothache : పంటి నొప్పికి జామ ఆకులు ఎన్నో ఏళ్ల తరబడి ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి, ఈ ఆకులకు దంత క్షయాన్ని తగ్గించడం, మంటను తొలగించడం , దంతాలను ఆరోగ్యంగా ఉంచడం వంటి లక్షణాలు ఉన్నాయి. ఈ ఆకులు యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి దంతాలలోని బ్యాక్టీరియాను చంపడంలో , మంటను తొలగించడంలో సహాయపడతాయి.

READ ALSO : Tooth Decay : దంతాలు పుచ్చిపోవటానికి కారణాలు తెలుసా! పుచ్చిపోకుండా ఉండాలంటే ఏంచేయాలి?

దంతాల కోసం జామ ఆకులను ఎలా ఉపయోగించాలి మరియు వాటి ప్రయోజనాలు ఏమిటి?

దంతాల కోసం జామ ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. లేదంటే జామాకుల రసాన్ని ఉపయోగించవచ్చు. జామాకుల రసాన్ని తయారు చేయటానికి ముందుగా కొన్ని తాజా జామ ఆకులను తీసుకోవాలి. కొన్ని పిప్లీ, లవంగాలు, దానికి కొద్దిగా ఉప్పు కూడా కలపాలి. వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను దంతాలకు అప్లై చేయాలి.

READ ALSO : Acidic Foods : అమ్లగుణంతో కూడిన ఆహారాలు తింటే దంతాలు పచ్చగా మారతాయా?

పంటి నొప్పిలో జామ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు ;

1. యాంటీ బాక్టీరియల్ ; పంటి నొప్పులను తగ్గించుకోవటానికి ఈ యాంటీ బాక్టీరియల్ పేస్ట్ ఉపయోగించవచ్చు. అలాగే, దాని రసాన్ని ఉపయోగించవచ్చు. దంతాల లోపల ఉండే బ్యాక్టీరియాను నాశనం చేయడంతో పాటు, దంతాలలోని పురుగులను నిర్వీర్యం చేస్తుంది. ఇది పంటి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

READ ALSO : CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!

2. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి ; జామ ఆకు , లేదా పొడవాటి మిరియాలు అయినా, రెండింటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పంటి మంటను తగ్గించి నొప్పిని తగ్గిస్తాయి. అంతేకాకుండా నోటిలోని ఇతర ప్రాంతంలకు వ్యాపించకుండా నిరోధిస్తుంది. దీనివల్ల దంతాల నొప్పి తగ్గుతుంది. కాబట్టి, ఈ హోం రెమెడీని పాటించటం ద్వారా పంటి నొప్పిని తగ్గించుకోండి.