Covid Symptoms : వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారా? ఈ 4 లక్షణాలు ఉంటే పక్కా కరోనానే..!
ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. వ్యాక్సిన్లు వచ్చినా కరోనా మాత్రం వదలడం లేదు. వ్యాక్సిన్లు వేయించుకోనివారితో పాటు పూర్తిగా రెండు డోసులు వేయించుకున్నవారిలోనూ కరోనా వస్తోంది.

Had Both Vaccines The 4 Symptoms That Could Still Be Covid
Fully vaccinated people get Covid Symptoms : ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. వ్యాక్సిన్లు వచ్చినా కరోనా మాత్రం వదలడం లేదు. వ్యాక్సిన్లు వేయించుకోనివారితో పాటు పూర్తిగా రెండు డోసులు వేయించుకున్నవారిలోనూ కరోనా వస్తోంది. ప్రత్యేకించి పూర్తి రెండు డోసులు టీకా తీసుకున్నవారిలో ఈ నాలుగు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయట.. అంటే.. వారికి కరోనా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. NHS రూపొందించిన వైరస్ లక్షణాల జాబితాకు చాలా వ్యత్యాసం ఉందంటున్నారు. ఎందుకంటే.. యూకే జనాభాలో దాదాపు మూడింట రెండొంతల మందికి డబుల్ డోసులు అందాయి.
అయినప్పటికీ వేలాది మంది వారికి తెలియకుండానే వైరస్‌ను మరొకరికి వ్యాపింపజేస్తున్నారట. ఎప్పటినుంచి ఈ నాలుగు లక్షణాల్లో ఒకదాన్ని అధికారిక జాబితాలో చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీలో ఎవరికైనా దగ్గు, అధిక జ్వరం లేదా రుచి, వాసన కోల్పోయిన లక్షణాలు ఉంటే.. వెంటనే ఫ్రీ కొవిడ్ టెస్టు (Free Covid Test) చేయించుకోవాలని NHS నిపుణులు సూచిస్తున్నారు. కానీ, వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో వైరస్ ఇన్ఫెక్షన్ తీవ్రత మాత్రం స్వల్పంగానే ఉంటుందని, కాకపోతే లక్షణాలు వేరుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. యూకేలో కొత్త కొవిడ్ వేరియంట్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.
టీకా స్థితిని బట్టి లక్షణాలు ఉంటాయట :
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి అయినవారిలో అత్యంత సాధారణ లక్షణం.. తలనొప్పి ఉంటుందట.. అలాగే ముక్కు కారడం, తుమ్ములు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయట. King’s College London చెందిన రీసెర్చర్లు ఈ డేటాను వెల్లడించారు. ZOE Covid Symptom Study App ద్వారా కరోనా బాధితుల డేటాను సేకరించారు. టీకా పూర్తి అయిన వారిలో కనిపించే లక్షణాల్లో నిరంతర దగ్గు అనేది 8వ స్థానంలో ఉంది. అయితే ఈ కరోనా లక్షణం కావడానికి చాలా తక్కువ అవకాశం ఉందని అధ్యయన నివేదిక వెల్లడించింది. టీకా రెండు డోసులు తీసుకున్నవారిలో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంపై పరిశోధకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా టీకా తీసుకోని వారితో పోలిస్తే.. కేవలం తుమ్ములు మాత్రమే కరోనా లక్షణంగా ఉన్నట్టు గుర్తించారు. ఒకవేళ టీకా తీసుకున్నా.. తుమ్ములు వస్తుంటే మాత్రం వెంటనే కోవిడ్ టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఒక టీకా డోసు మాత్రమే తీసుకున్నవారిలోనూ ఒకే మాదిరి కరోనా లక్షణాలు ఉంటున్నాయి. అందులోనూ తలనొప్పి, ముక్కు కారడం, గొంతునొప్పి, తుమ్ములు, నిరంతర దగ్గు వంటి లక్షణాలు ఉంటున్నాయి. టీకా తీసుకోనివారిలో తలనొప్పి అనేది ప్రధాన కరోనా లక్షణంగా యాప్ ద్వారా నిర్ధారించారు. తలనొప్పి తర్వాతే రెండో లక్షణంగా గొంతునొప్పి, జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని హెచ్చరిస్తున్నారు.